నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత | Never Said It's a Murder Ankita Lokhande About Sushanth Death | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత లోఖాండే

Published Thu, Sep 10 2020 10:25 AM | Last Updated on Thu, Sep 10 2020 11:05 AM

Never Said It's a Murder Ankita Lokhande About Sushanth Death - Sakshi

ముంబై: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ను హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖాండే తెలిపారు. సుశాంత్‌కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలని  మాత్రమే కోరానని పేర్కొంది. సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ  క్రమంలోనే విచారణ చేపట్టిన నార్కోటిక్‌ అధికారులు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. 


ఈ విషయంపై స్పందించిన అంకిత ‘ఇది అనుకోకుండా జరిగింది కాదని, చేసుకున్న కర్మ ఫలితం’ అని ట్వీట్‌ చేసింది. ఇక సుశాంత్‌ ఆత్మహత్య గురించి మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్‌ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్‌ను హత్య చేశారని ఎప్పుడూ అనలేదని పేర్కొ‍న్నారు. తాను ఎవరిని అనుమానిస్తున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటకు రావాలని మాత్రమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. 

ఇక అంకిత, రియాకు పలు ప్రశ్నలు సంధించారు. సుశాంత్‌ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు డాక్టర్‌  చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్‌ను తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా? అసలు ఎవరైనా  అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్‌ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పింది. అంతేకాని సుశాంత్‌ డ్రగ్స్‌ వాడుతున్నట్లు చెప్పిందా? లేదు. ఎందుకంటే తాను కూడా ఆ డ్రగ్స్‌ను  తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది.  

చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement