అమ్మకు తోడు | Neetu Kapoor Daughter Gift Pet Dog to Her Mom Divert Depression | Sakshi
Sakshi News home page

అమ్మకు తోడు

Published Sat, Jun 20 2020 8:23 AM | Last Updated on Sat, Jun 20 2020 8:23 AM

Neetu Kapoor Daughter Gift Pet Dog to Her Mom Divert Depression - Sakshi

'డిప్రెషన్‌’ గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తోంది. మనసులోకి వెలితి ఎప్పుడు అడుగు పెడుతుందో తెలియదు. ముఖ్యంగా అయినవారిని కోల్పోయినప్పుడు. రిషి కపూర్‌ మరణంతో నీతూ కపూర్‌ కచ్చితంగా ఒక ఖాళీని అనుభూతి చెందుతూ ఉంటుంది. అందుకే కుమార్తె రిథిమ కపూర్‌ తండ్రి మరణించినప్పటి నుంచి తన అత్తవారిల్లు ఢిల్లీని వదిలి ఆమెతోనే ఉంటోంది. అంతే కాదు ఇప్పుడు తల్లికి ఒక కుక్కపిల్లను బహూకరించింది. నీతూసింగ్‌ ఆ కుక్క పిల్లను తన కుటుంబ సభ్యునిగా సంతోషంగా స్వీకరించింది. అంతేకాదు, దానికి ‘డూడుల్‌ కపూర్‌’ అని పేరు కూడా పెట్టుకుంది. దేనికీ ఏదీ ప్రత్యామ్నాయం కాదు. కాని మనసును దారి మళ్లించడానికి ప్రతిదీ ఉపయోగపడుతుంది. డిప్రెషన్‌లో ఉన్నవారిని పూలతోట పెంచమని అంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం కూడా యాంటీ డిప్రెసెంటే. నీతూకు ఈ కుక్కపిల్ల మంచి ఓదార్పు కానుంది.(ఐ వాన్న అన్‌ఫాలో యు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement