
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ కొంత పురోగతిని సాధించింది. ఈ సందర్భంగా సుశాంత్ సోదరి, శ్వేతా సింగ్ కీర్తి అతనిని గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ తాను కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. మేం ఒకరిని ఒకరం ఎప్పుడూ కాపాడుకుంటాం అని వాగ్దానం చేశాము. కానీ భాయ్ నేను నా మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అయితే ఇప్పుడు నేను, దేశం మొత్తం నీకు మరో వాగ్ధానం చేస్తున్నాం. మేం నిజం కనుక్కుంటాం, నీకు న్యాయం చేస్తాం.
నా సోదరుడు ఎలాంటి వ్యక్తి అంటే అతని జీవితం ఆనందంతో నిండినది. అతను చిన్న పిల్లవాడిలా ఉంటాడు. అతను కోరుకున్నది ప్రేమ మాత్రమే. ఎవరైనా ఒకసారి తన తల నిమురుతూ ప్రేమతో మాట్లాడితే సుశాంత్‌కు అది చాలు. తన ప్రాణాలు బలవంతంగా తీసుకునే వ్యక్తి కాదు. అది నమ్మడానికి నా మనసు సిద్ధంగా లేదు. మన ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకుందాం. సుశాంత్ మరణానికి నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. ఇది సత్యానికి వచ్చిన ఆగ్రహం’ అని శీర్షికను జోడించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అతడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని బాంద్రా పోలీసులు తెలిపారు. అయితే సుశాంత్ అత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, అతని మరణం వెనుక ఏదో నిజం ఉండే ఉంటుందని కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక నిరసనలు వెల్లువెత్తడంతో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో రియా సోదరుడిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..
Comments
Please login to add a commentAdd a comment