సుశాంత్‌ ​కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి? | Subramanian Swamy: Why Two Ambulances Sent to Sushant Home After his Demise | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ​కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి?

Published Sat, Aug 15 2020 2:14 PM | Last Updated on Sat, Aug 15 2020 2:25 PM

Subramanian Swamy: Why Two Ambulances Sent to Sushant Home After his Demise - Sakshi

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని సందేహాలు లేవనెత్తారు. సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని, ఆయనకు నమ్మకస్తుడైన  శ్యామ్యూల్ హోకిప్ అదృశ్యం అవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌లో సంచలన ఆరోపణలు చేశారు. 

 సుశాంత్‌ మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణిండానికి ముందు రోజు అంటే జూన్ 13 తేదీ రాత్రి ఆయనతో పాటు ఇంట్లో శామ్యూల్ హెకిప్ కూడా ఉన్నారనే విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్‌ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

ఇంతకీ శామ్యూల్ హెకిప్ బతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ  సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో కాళ్లు స్ట్రెయిట్‌గా ఉంటే  మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్న దేహాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.  తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్‌కు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ను ప్రశ్నించాలని సుబ్రహ్మణ్య స్వామి సీబీఐను గతంలో కోరారు. చదవండి: ‘నా కొడుకు ఉరి వేసుకోడాన్ని ఎవరూ చూడలేదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement