subramanyaswamy
-
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వాయిదా
తిరుపతి లీగల్/తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్ 1న ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్డి సత్యానంద్ జూన్ 21వ తేదీకి వాయిదా వేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులు కలిసి టీటీడీ పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రూ.100 కోట్లు పరువు నష్టం చెల్లించేటట్లు ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆదేశించాలని టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది పరువు నష్టం కేసును దాఖలు చేసింది. టీటీడీ తరఫున ఈ కేసును బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. సోమవారం కేసు విచారణకు ఎంపీ హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్ 29న రిటర్న్ స్టేట్మెంట్ను కోర్టులో దాఖలు చేశారని, ఆ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ గత వాయిదా అప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని కారణాలతో కోర్టు ఆ పిటిషన్ రిటర్న్ చేయగా సోమవారం ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆ పిటిషన్‌ను తీసుకుని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి తిరిగి జడ్జికి ఆ పిటిషన్ ఇచ్చారు. అలాగే ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరఫున వాదించడానికి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్ 21కి వాయిదా వేశారు. కేసును వాదించే న్యాయ అవగాహన ఉంది టీటీడీ తరఫున కోర్టులో పరువు నష్టం కేసును వాదించే న్యాయ అవగాహన తనకుందని ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. కేసు వాయిదా అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారంపై ఇదివరకే రాష్ట్ర హైకోర్టులో తాము విజయం సాధించామన్నారు. వచ్చే వాయిదాకు ఆంధ్రజ్యోతి వేసిన పిటిషన్‌పై తాము బదులు ఇస్తామన్నారు. కాగా, సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి మూలమూర్తిని ఎంపీ సుబ్రమణ్యస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆధ్వర్యంలో తిరుమల మరింత అభివృద్ధి చెందిందన్నారు. సీఎం వైఎస్ జగన్ హిందూ ఆలయాల్లో క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తున్నారనేది అసత్యమన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. -
మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి శిక్ష తప్పదు
తిరుపతి లీగల్: మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పరువుకు భంగం కలిగిస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులపై దాఖలు చేసిన పరువు నష్టం దావాపై టీటీడీ తరఫున వాదించేందుకు బుధవారం ఆయన స్థానిక నాలుగో అదనపు జిల్లా జడ్డి కోర్టులో హాజరయ్యారు. సెక్షన్ 32 కింద ప్రత్యేకంగా కేసును వాదిస్తున్నట్లు న్యాయమూర్తికి నివేదించారు. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం, తదితరులకు రిటన్ స్టేట్మెంట్ దాఖలుకు న్యాయస్థానం 90 రోజులు సమయం ఇచ్చినా స్పందించలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఖర్చుల కింద రూ.200 చెల్లించాలని ఆదేశిస్తూ కేసును న్యాయమూర్తి డిసెంబర్ 29కి వాయిదా వేసినా ఇంతవరకూ రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేయలేదన్నారు. సమాజ హితంతో ముడిపడిన కేసు.. ఈ కేసు సమాజ హితంతో ముడిపడి ఉందని వాదనల సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి నివేదించారు. ఈ సమయంలో ఆంధ్రజ్యోతి తరపున జూనియర్ న్యాయవాది హాజరై రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేస్తామని కోరడంతో జడ్జి సత్యానంద్ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అనంతరం ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరై రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేశారు. ఖర్చుల కింద రూ.200 చెల్లించాలని టీటీడీ తరపు న్యాయవాది కోరగా, టీటీడీ తరపున సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే వాదనలు వినిపిస్తామని కోర్టు అనుమతి తీసుకున్నందున ఆయనకు మాత్రమే ఇస్తామన్నారు. అయితే ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అప్పటికే కోర్టు నుంచి వెళ్లిపోవడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు నగదును కోర్టులో డిపాజిట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును న్యాయమూర్తి ఫిబ్రవరి 4వతేదీకి వాయిదా వేశారు. టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్ 1వ తేదీన ‘‘వెంకన్న వెబ్సైట్లోకి యేసయ్య‘‘, ‘‘టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం‘‘ శీర్షికలతో కథనాలను ప్రచురించిందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. వాదనలు వినిపించిన తరువాత కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అసత్య కథనాలతో టీæటీడీ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, దీనిపై క్షమాపణలు చెప్పాలని టీటీడీ మూడుసార్లు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపినా స్పందించలేదన్నారు. ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె.శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్లను ప్రతివాదులుగా పేర్కొంటూ రూ.వంద కోట్ల పరిహారం చెల్లించాలని దావా వేసినట్లు తెలిపారు. రెచ్చగొట్టేందుకే అసత్య కథనాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హిందువుల్లో వ్యతిరేకత రేకెత్తించేందుకు మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రజ్యోతి అసత్య కథనాలను ప్రచురించిందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఇలాంటి కథనాలు ప్రచురించినట్లు తెలుస్తోందన్నారు. ఈ కథనాలపై పోలీస్ దర్యాప్తు అనంతరం శ్రీవారి ఆలయం వద్ద ఎలాంటి శిలువ ఆకారం లేదని ధృవీకరిస్తూ హైకోర్టుకు ఫోటోలను సమర్పించారని తెలిపారు. ఈ కేసును టీటీడీ తరపున చివరివరకు తానే వాదిస్తానని, మధ్యలో తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వంశపారపర్యం అర్చకత్వంపై రమణ దీక్షితులు గతంలో చేసిన ట్వీట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో కోటి మందికిపైగా ఉన్నారని, అన్నీ తాను చూడలేనని చెప్పారు. తనతో నేరుగా సంప్రదిస్తే సలహా ఇస్తానన్నారు. బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలని లేదన్నారు. ఇతర కులాలకు చెందిన ఎంతో మంది రుషులు, మహర్షులుగా పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు. టీటీడీలో కాగ్‌తో ఆడిట్ తనిఖీ జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. -
ఆంధ్రజ్యోతి కథనంపై లోతుగా దర్యాప్తు
సాక్షి, అమరావతి: భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారమంటూ ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనం ప్రచురించిందని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు జరుగుతోం దని తిరుపతి తూర్పు విభాగం పోలీసులు బుధ వారం హైకోర్టుకు నివేదించారు. ఫోరెన్సిక్ ల్యాబ్, గూగుల్, టీటీడీ ఐటీ విభాగం నుంచి కీలక సాం కేతిక ఆధారాలను సేకరించినట్లు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. పిటిషనర్ ఆరోపిస్తున్న విధంగా దర్యాప్తులో ఎలాంటి అలక్ష్యం లేదని చె ప్పారు. ఆంధ్రజ్యోతి మీద టీటీడీ ఇచ్చిన ఫిర్యా దుపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసేలా పోలీ సులను ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యు డు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ డేటా సెంటర్ నుంచి పలు ఆధారాలు సేకరించి.. విజయవాడ ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించామని చెప్పారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు నోటీసులిచ్చా మని తెలిపారు. టీటీడీ వెబ్సైట్ ఆధారంగా కథనం ప్రచురించినట్టు పేర్కొన్నారన్నారు. దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. బుధవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. పోలీసుల కౌంటర్‌కు సమాధానం ఇస్తానని తెలిపారు. ఇందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. -
ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
తిరుపతి లీగల్, సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి దినపత్రిక 2019 డిసెంబర్ 1వతేదీన కథనం ప్రచురించడంపై ఆమోద పబ్లికేషన్స్‌పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. బుధవారం తిరుపతి కోర్టు సముదాయాల వద్ద, తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవో అభ్యర్థన మేరకు, తిరుమల శ్రీవారి భక్తుడిగా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 32 ప్రకారం టీటీడీ ఈవోను వాదిగా పేర్కొంటూ టీటీడీ తరఫున కేసు కాగితాల్లో సంతకాలు చేయడానికి తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మత విద్వేషాలు రగిల్చేలా ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించిందన్నారు. అసత్య వార్తల ప్రచురణపై క్షమాపణలు చెప్పాలని టీటీడీ పంపిన నోటీసుపై పత్రిక యాజమాన్యం స్పందించలేదన్నారు. టీటీడీని క్రైస్తవమయం చేస్తున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం కుట్ర వెనుక అసలు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు మరో దారిలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు కూడా అందుకు సహకరిస్తున్నారని తెలిపారు. టీటీడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడి ఆరోపణల ఆధారంగా ఆంధ్రజ్యోతి ఆ కథనాన్ని ప్రచురించినట్లు ఓ విలేకరి సుబ్రహ్మణ్యస్వామి దృష్టికి తేగా.. అందులో అలా ఎక్కడా లేదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆంధ్రజ్యోతిపై ఏడాది క్రితం పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు సీఎం జగన్ సరైన రీతిలో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవే ఫలితాలు పునరావృతం.. ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయంగా సుదీర్ఘమైన ఉజ్వల భవిష్యత్తు ఉందన్న వాస్తవాన్ని గుర్తించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ అద్భుత విజయం సాధించారు. ప్రధాని మోదీని విడిచిపెట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంచన చేరినప్పటికీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రానున్నాయి’ అని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన సుబ్రహ్మణ్యస్వామి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన ఆయన్ను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలసి సీఎం నివాసానికి చేరుకున్నారు. భోజనం అనంతరం స్వామి తిరిగి వెళ్లిపోయారు. ఆడిట్‌తో బాబు నిర్వాకాలు బయటపడడం ఖాయం ‘టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హిందూ ఆలయాల ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలని దేశంలో నిర్ణయం తీసుకున్న మొదటి ముఖ్యమంత్రి ఆయనే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిటింగ్ చేయించమని అడిగితే సమ్మతించ లేదు. ఆ విషయం కోర్టు రికార్డుల్లో నమోదైంది. సీఎం వైఎస్ జగన్ స్వచ్ఛందంగా స్పందించి టీటీడీ ఆదాయ వ్యయాలను కాగ్‌తో ఆడిటింగ్ చేయించేందుకు సమ్మతించారు. గత సర్కారు హయాంలో లెక్కలపై కూడా కాగ్‌తో ఆడిట్ నిర్వహిస్తే చంద్రబాబు నిర్వాకాలు బయటపడటం ఖాయం’ అని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ‘విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకం. సరళీకరణ విధానాలను సమర్థిస్తా. కానీ ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ప్లాంట్లు, ఎయిర్ఇండియా లాంటి సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి రెండు లేఖలు రాశారు. అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అప్పాయింట్మెంట్ కూడా కోరారు. అప్పాయింట్మెంట్ ఇస్తే అన్ని విషయాలు వివరిస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు’అని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. -
టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే చానల్‌పై పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులందరికీ విసుగు పుట్టించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని క్రైస్తవీకరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని బీజీపీ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. అలా తప్పుడు ప్రచారం చేసే వాటిలో ఒక చానల్‌పై మొదటగా పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సుబ్రమణ్య స్వామి శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఒక వర్గం మీడియా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తుండడం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు విసుగు తెప్పించింది. చంద్రబాబు ఆర్థిక సాయం అందజేసే మీడియా సంస్థలే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి’ అని పేర్కొన్నారు. -
విగ్రహాల విధ్వంసం చంద్రబాబు కుట్రే..
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. ప్రముఖ జాతీయ చానల్ ‘న్యూస్ ఎక్స్’ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తెరవెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పారు. ఏపీలో పరిణామాలపై సుబ్రహ్మణ్యస్వామి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.... తిరుమలలో వైఎస్ జగన్ పూజలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల ఘటనలపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రిస్టియన్ అని విమర్శిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ ఎలా అవుతారు? వైఎస్ జగన్ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు. కానీ ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదు. టీటీడీ ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిట్ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్ ఒక్కరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్ర. సోనియాగాంధీ(కాంగ్రెస్)తో కలసి పోటీచేస్తే ప్రజలు ఎవరూ ఆయన వైపు చూడలేదు. అందుకే ఆయన హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారు. టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలంటూ దు్రష్పచారం టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. దీనిపై నేను విచారించా. టీటీడీలో కేవలం ఏడుగురే అన్య మతస్తులు ఉన్నారు. వారు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు కాదు. అంతకు ముందు ప్రభుత్వంలో నియమితులైనవారే. వారిని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోకి బదిలీ చేసింది. ఇక ముందు టీటీడీలో హిందూయేతరులను నియమించరాదని విధాన నిర్ణయం కూడా తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌గా వైఎస్ జగన్ తన బంధువు వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తే ఆయన క్రిస్టియన్ అని, ఆయన భార్య క్రిస్టియన్ మిషనరీ అని దుష్ప్రచారం చేశారు. వారిద్దరూ నరేంద్ర మోదీ కంటే కూడా పక్కా హిందువులు. అలాంటి వారిపై దుష్ప్రచారం చేశారు. పోలీసులనే అడగండి.. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో పోలీసులను అడగండి. ఆలయాలపై దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేశారో లేదో చెబుతారు. అంతేగానీ బీజేపీ నేతలనో, కార్యకర్తలనో అడగవద్దు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం అన్ని దేవాలయాలను స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రినే అన్ని ఆలయాలకు చైర్మన్‌గా ప్రకటించడంపై కోర్టులో కేసు వేశా. ఆస్తులపై అధికారమంతా ఆలయాలదేనని న్యాయస్థానం పేర్కొంది. కేసు ఇంకా విచారణలో ఉంది. -
సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి?
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని సందేహాలు లేవనెత్తారు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని, ఆయనకు నమ్మకస్తుడైన శ్యామ్యూల్ హోకిప్ అదృశ్యం అవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్లో సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణిండానికి ముందు రోజు అంటే జూన్ 13 తేదీ రాత్రి ఆయనతో పాటు ఇంట్లో శామ్యూల్ హెకిప్ కూడా ఉన్నారనే విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ శామ్యూల్ హెకిప్ బతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో కాళ్లు స్ట్రెయిట్‌గా ఉంటే మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్న దేహాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్‌కు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ను ప్రశ్నించాలని సుబ్రహ్మణ్య స్వామి సీబీఐను గతంలో కోరారు. చదవండి: ‘నా కొడుకు ఉరి వేసుకోడాన్ని ఎవరూ చూడలేదు’ -
రెండో అడుగు పీవోకే స్వాధీనమే!
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై రాజ్యసభలో ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇక ప్రభుత్వ తదుపరి అడుగు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే. ఆ ప్రాంతాన్ని భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్ ప్రధానికి చెప్పడం తప్ప, ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదు, ఆర్టికల్ 370 రద్దుపై సాహసోపేత చర్య తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు అభినందనలు. పీవీ నరసింహారావు ప్రభుత్వ సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆర్టికల్ 370ని రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్ వాదన వారి అజ్ఞానాన్ని సూచిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోంది. ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంటుకు తెలియజేయడాన్ని సముచిత చర్యగా భావిస్తున్నాను. ఆర్టికల్370 రద్దు ఇప్పటికే ఆలస్యమైంది. ఆర్టికల్ రద్దు ఏకపక్షమని వాదించేవారికి.. 5లక్షల మంది కాశ్మీరీ పండిట్లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి’ అని అన్నారు. -
‘రాహుల్ భారతీయుడే.. మొదట ఎత్తుకున్నది నేనే’
తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేరళకు చెందిన రిటైర్డు నర్సు రాజమ్మ వివాతిల్(72) పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారతీయ పౌరుడేనని, ఢిల్లీలో జన్మించారని తెలిపారు. ఆ సమయంలో తాను ట్రైనీ నర్సుగా ఉన్నాని, రాహుల్‌ను ఎత్తుకున్న మొదటి వ్యక్తుల్లో తానూ ఒకరినని వెల్లడించారు. ఎన్నికల వేళ రాహుల్ పౌరసత్వం అంశం బీజేపీ విమర్శల నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ విషయం గురించి రాజమ్మ వివాతిల్ పీటీఐతో మాట్లాడుతూ...‘ ఎంతో ముద్దుగా ఉన్న రాహుల్ గాంధీని మొదటగా చేతుల్లోకి తీసుకున్న వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయన జన్మించారనడానికి నేనే ఒక సాక్ష్యం. ప్రధాని ఇందిరా గాంధీ మనుమడిని ఎత్తుకోవడాన్ని ఎంతో అదృష్టంగా ఫీలయ్యాను. ఆరోజు రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, బాబాయ్ సంజయ్ గాంధీ లేబర్ రూం బయట ఎదురుచూస్తూ ఉన్నారు. నాకు ఆ విషయాలన్నీ ఇంకా గుర్తున్నాయి. వీటి గురించి నా బంధువులకు కథలు కథలుగా చెబుతాను’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ ఫ్యామిలీ హోలీ ఆస్పత్రిలో నర్సింగ్ పూర్తి చేసిన రాజమ్మ.. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత భారత ఆర్మీలో నర్సుగా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. వీఆర్ఎస్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 1987లో కేరళకు తిరిగి వచ్చిన ఆమె కల్లూరులో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసిన వయనాడ్‌కు మరోసారి వచ్చిన క్రమంలో ఆయనను తప్పకుండా కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాహుల్ గాంధీ తొలిసారిగా దక్షిణాది నుంచి(వయనాడ్) లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన సంగతి తెలిసిందే. -
నేడు సుబ్రహ్మణ్యుడి రథోత్సవం
గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంక సుబ్రమణ్యస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రథోత్సవం తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుములాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. శుద్ధపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే పలు పూజలు రాత్రి 8గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. అలాగే ఆదివారం ఉదయం సుబ్రమణ్య స్వామి ఆలయంలో శ్రీవల్లీ, దేవసేన, శ్రీవారి కల్యాణం ఉంటుంది. రథోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈడీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే అనంతపురం నుంచి ప్రత్యేక బస్సులు కోటంక ఆలయం వరకూ నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం
వన్‌టౌన్ : కొత్తపేట ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఆyì lకృత్తిక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆషాడ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున స్వామికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారి కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలుత భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి.. అనంతరం పాలు, పన్నీరు, విబూది వంటి వివిధ రకాల కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మేళతాళాలు, భక్తుల నామస్మరణ మధ్య ఈ ప్రదర్శన వన్‌టౌన్ వీధుల మీదుగా సాగింది. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల శ్రీనివాస్ పర్యవేక్షించారు.