ఆంధ్రజ్యోతి కథనంపై లోతుగా దర్యాప్తు | An in-depth investigation into the Andhra Jyoti article | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి కథనంపై లోతుగా దర్యాప్తు

Published Thu, Jul 1 2021 4:26 AM | Last Updated on Thu, Jul 1 2021 4:26 AM

An in-depth investigation into the Andhra Jyoti article - Sakshi

సాక్షి, అమరావతి: భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారమంటూ ‘ఆంధ్రజ్యోతి’ అసత్య కథనం ప్రచురించిందని టీటీడీ విజిలెన్స్‌ విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు జరుగుతోం దని తిరుపతి తూర్పు విభాగం పోలీసులు బుధ వారం హైకోర్టుకు నివేదించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్, గూగుల్, టీటీడీ ఐటీ విభాగం నుంచి కీలక సాం కేతిక ఆధారాలను సేకరించినట్లు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. పిటిషనర్‌ ఆరోపిస్తున్న విధంగా దర్యాప్తులో ఎలాంటి అలక్ష్యం లేదని చె ప్పారు. ఆంధ్రజ్యోతి మీద టీటీడీ ఇచ్చిన ఫిర్యా దుపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసేలా పోలీ సులను ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యు డు డాక్టర్‌ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంలో పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. టీటీడీ డేటా సెంటర్‌ నుంచి పలు ఆధారాలు సేకరించి.. విజయవాడ ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపించామని చెప్పారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు నోటీసులిచ్చా మని తెలిపారు. టీటీడీ వెబ్‌సైట్‌ ఆధారంగా కథనం ప్రచురించినట్టు పేర్కొన్నారన్నారు. దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. బుధవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. పోలీసుల కౌంటర్‌కు సమాధానం ఇస్తానని తెలిపారు. ఇందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement