
ముంబై: బాలీవుడ్ ఒక్క పరిశ్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియా హడావుడి చేస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ విమర్శించారు. బాలీవుడ్ కాకుండా మిగతా రంగాలలో విపరీతంగా డ్రగ్స్(మాదక ద్రవ్యాల) వాడుతన్నా, మీడియాకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ ప్రమేయం ఏమైనా ఉన్నదా అని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పేర్కొంది. ఈ అంశంపై ఎన్‌సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు సమన్లు జారీ చేసన విషయం తెలిసిందే. మరోవైపు 39 మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై డ్రగ్స్ కేసు సంబంధించి విచారించే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సంచలన అంశాలను మీడియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని పూజా బేడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment