
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్‌లో నెపోటిజం మీద విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టార్ కిడ్స్ అయిన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ లాంటి వారిపై తీవ్రస్థాయిలో సుశాంత్ అభిమానులు విరుచుకుపడ్డారు. వారిని అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా సోషల్‌మీడియాలో తీవ్రంగా విమర్శించడంతో సోనాక్షి సిన్హా లాంటివారు తమ అకౌంట్‌లను కూడా డియాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే.
సుశాంత్ విషయంలో అలియాభట్, ఆమె తండ్రి మహేష్ భట్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అలియా నటించిన సడక్ 2 ట్రైలర్ ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలైంది. దానికి ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాదాపు 4 మిలియన్ల మంది డిస్‌లైక్ చేశారు. ఇదిలా ఉండగా అలియా భట్ సౌత్‌లో దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తోంది. అలియాభట్ వల్ల ఈ సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి ఏ నిర్ణయం తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment