
సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణానికి అతని సోదరి ప్రియాంక సింగ్ కారణమంటూ రియా చక్రవర్తి ఆరోపించింది. సుశాంత్ ఇద్దరు అక్కలు ప్రియాంక సింగ్, నీతూ సింగ్ సుశాంత్‌కు సంబంధించిన బోగస్ మెడికల్ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చారని, ఆ మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లోనే సుశాంత్ మరణించాడని రియా సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్స్ కారణమంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సుప్రీం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు. (నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి)
ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు జూన్ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు తెలిపింది. చట్టవిరుద్ధంగా అతనికి సైకోట్రోపిక్ మెడిసిన్‌ను ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని ఆరోపించింది. సుశాంత్‌కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో వైద్యం చేయడం వల్లే మరణించాడని ఇందుకు కారణమైన సుశాంత్ సోదరి ప్రియాంక, నీతూ సింగ్ డాక్టర్ తరుణ్‌లతో పాటు తదితరులను విచారించాల్సిందిగా రియా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా మూడోరోజు కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్‌కు చెందిన కొందరి పేర్లను కూడా రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. (8 గంటలు ప్రశ్నల వర్షం)
Comments
Please login to add a commentAdd a comment