
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ అడగ్గా, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు.
అయితే, వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఉమామహేశ్వరరావుపై నానాజీ దురుసుగా ప్రవర్తించారు. చంపేస్తానంటూ ఆయనపై నానాజీ దాడి చేశారు. నానాజీ అనుచరులు వీరంగం సృష్టించారు. పంతం నానాజీపై కాలేజీ యాజమాన్యం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment