సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే ఓ శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగిని సునితని జనసేన నాయకులు వేధింపులకు గురి చేశారు. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీలు నడకుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త వీరబాబు ఆరోపించారు. నిందితులు తన భార్యను నెలకు రూ.20 వేల లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇవ్వలేదంటే లైగింక కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment