Nanaji
-
జనసేన ఎమ్మెల్యే నానాజీ అనుచరుల భూకబ్జా
కాకినాడ: కూటమి ప్రభుత్వంలోని నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించితూనే ఉన్నాయి. కాకినాడలో జనసేన నేతల భూకబ్జా బాగోతం తాజాగా వెలుగుచూసింది. కాకినాడు రూరల్‌లో ఎమ్మెల్యే పంతం నానాజీ(Pantham Nanaji) అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలో కోటుల విలువ చేసే లే అవుట్ ప్లాట్లు కబ్జా(Land Grabbing) చేశారు. జనసేన నేత పుల్లా శ్రీరాములు కోట్లు విలువ చేసే భూమికి కబ్జా చేశారు. తన భూమిని జనసేన నేత పుల్లా శ్రీరాములు కబ్జా చేశారని కలెక్టర్, ఎస్పీలకు మాధవపట్నంకు చెందిన గుత్తుల జాన్సన్ కుటుంబం ఫిర్యాదు చేసింది.పోస్టల్ ఎంప్లాయిస్ సొసైటీ లేవుట్‌లో 658 గజాల భూమిని 2008-09లో రెండు ప్లాట్లుగా కొనుగోలు చేసింది జాన్సన్ కుటుంబం. అప్పటినుండి ఆ భూమి తనదే అంటూ శ్రీరాములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే కోర్టును ఆశ్రయించారు. బాధితులు.మళ్లీ ఇటీవల తన అనుచరులతో జాన్సన్‌కు చెందిన ప్లాట్లను ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆ కాంపౌడ్ వాల్‌ను తన మనుషులతో కూలగొట్టించింది జాన్సన్ కుటుంబం. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెచ్చిపోతున్నపంతం నానాజీ అనుచరులు కాకినాడ లో కాకినాడలో ఎమ్మెల్యే నానాజీ అనుచరులు రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం మత్స్యకారుల(Fishermen) దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ. 10 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా జరగ్గకపోతే దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు. -
జనసేన నేతల వేధింపులు.. మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే ఓ శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగిని సునితని జనసేన నాయకులు వేధింపులకు గురి చేశారు. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీలు నడకుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త వీరబాబు ఆరోపించారు. నిందితులు తన భార్యను నెలకు రూ.20 వేల లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇవ్వలేదంటే లైగింక కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైద్యులపై దాడి ఘటన.. పంతం నానాజీపై కన్నబాబు ఫైర్
-
జనసేన ఎమ్మెల్యే నానాజీకి దళిత నేతలు వార్నింగ్..
-
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి
-
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ అడగ్గా, ఉన్నతాధికారుల అనుమతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు.అయితే, వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఉమామహేశ్వరరావుపై నానాజీ దురుసుగా ప్రవర్తించారు. చంపేస్తానంటూ ఆయనపై నానాజీ దాడి చేశారు. నానాజీ అనుచరులు వీరంగం సృష్టించారు. పంతం నానాజీపై కాలేజీ యాజమాన్యం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
జనసేన కార్యకర్తల దౌర్జన్యం
కరప: “ఒక్కొక్కరి అంతు చూస్తాం. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి. ఎవరొస్తారో చూస్తాం’ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం, బెదిరింపులకు దిగారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కరప మండలం పెద కొత్తూరులో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నానాజీ తన అనుచరులు, పొరుగూరు జనంతో కలసి ఆరు కార్లలో సాయంత్రం 5 గంటల సమయంలో వేములవాడ గ్రామానికి వచ్చారు. స్థానిక నాయకులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.అంతమంది జనంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమేమిటని వారిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబునుద్దేశించి “వాడొస్తే బూత్‌లోకి పంపిస్తారా?’ అంటూ రాయలేని పదజాలంతో నానాజీ దూషణలకు దిగారు. ఆయన మాట తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో వారితో జనసేన శ్రేణులు వాగ్వాదానికి, తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరు వర్గాల వారినీ చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం నానాజీ పెదకొత్తూరు గ్రామం వెళ్లారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తూండగా, తన అనుచరులు 60 మందితో కలసి గేటు వద్ద నానాజీ అడ్డంగా నిలబడ్డారు. లోపలకు వెళ్లడానికి దారివ్వాలని ఈశ్వరరావు కోరగా.. “పక్క నుంచి వెళ్లు’ అని నానాజీ దురుసుగా మాట్లాడారు. ఇదే అదనుగా అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్త తోటకూర శ్రీనుపై జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి మొబైల్ ఫోన్ లాగేసుకుని, ఒక్కొక్కరి అంతు చూస్తామంటూ బెదిరించారు. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి, ఎవరొస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారూ వాగ్వాదానికి దిగి, తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం తమ ఇంటి మీదకు బీరు సీసా విసిరి, తల తీసేస్తామంటూ జనసేన పార్టీ కార్యకర్తలు తమను బెదిరించి, భయభ్రాంతులకు గురి చేశారని ఈశ్వరరావు భార్య, మాజీ సర్పంచ్ చింతా దుర్గాశ్రీ తెలిపారు. జనసేన కార్యకర్తల నుంచి రక్షణ కలి్పంచాలని కోరారు. కూరాడలో కూడా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగడంతో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. రాత్రి 9 గంటలకు కూడా పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. కొరిపల్లి, గురజనాపల్లి గ్రామాల్లో కూడా జనసేన కార్యకర్తలు వీరంగం వేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
డీసీసీ అధ్యక్షుడిగా పంతం నానాజీ
కాకినాడ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతం నానాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎ¯ŒS.రఘువీరారెడ్డి శుక్రవారం సాయంత్రం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఇంతవరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన కందుల దుర్గేష్ ఇటీవల పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పంతం నానాజీని నియమించారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నానాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కాకినాడ నగర అధ్యక్షుడిగా, పీసీసీ కార్యదర్శిగా పలు పదవులు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒSగా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతే లక్ష్యంగా సీనియర్ నాయకుల సూచన మేరకు పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీ ప్రతిష్ట ఇనుమడింప చేస్తానన్నారు. -
పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్య
రాత్రి 7.30 గంటలు.... అందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు.... అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా ఏడుపులు, కేకలు మిన్నంటాయి. ఉలిక్కి పడిన ఆ వీధివాసులు పరుగుపరుగున బయటకు వచ్చి చూసేసరికి...రక్తపు మడుగులో ఓ యువతి పడి ఉంది. తమ ఇళ్లమధ్యే హత్య జరగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సమాచారం దావానలంలా వ్యాపించడంతో అక్కడికి పెద్ద ఎత్తునజనం చేరుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే అల్లుడే ఇంత పనిచేస్తాడని ఊహించలేకపోయామని మృతురాలి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. విజయనగరం క్రైం: విజయనగరం పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి యువతి తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు అందించి న వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కూర్మదాసు సూర్యనారాయణ, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కూర్మదాసు రోడ్డు పై పుస్తకాలు విక్రయిస్తూ, ఆయన భార్య లక్ష్మి వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు ఏడాది క్రితం మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలలో పెద్దకుమార్తె దుర్గాదేవిని నాలుగేళ్ల క్రితం ఎస్.కోటకు చెందిన ఎ.నానాజీ కి ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమార్తె లలితాదేవి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఇంటివద్దే టైలరింగ్ చేస్తోంది. నెల క్రితం నానాజీ కుటుంబ సభ్యులతోపాటు అత్తమామలు తిరుపతి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత నానాజీ ఎస్.కోటకు వెళ్లకుండా రాజీవ్‌నగర్ కాలనీలోనే మామగారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. నానాజీ భార్య దుర్గాదేవి ప్రస్తుతం గర్భిణి. నానాజీ తన మామ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నానాజీని పట్టుకుని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. బుధవారం ఉదయం సూర్యనారాయణ పుస్తకాలు అమ్ముకునేందుకు వెళ్లగా, భార్య లక్ష్మి వంటలు చేసేందుకు వెళ్లింది. రెండో కుమార్తె లలితాదేవి ఇంటివద్దే ఉంది. లక్ష్మి వంటపని ముగించుకొని రాత్రి ఏడున్నరగంటల ప్రాంతంలో ఇంటికి చేరేసరికి, ఇంట్లో ఉన్న మంచం మీద లలితాదేవి అర్ధనగ్నంగా పడి ఉంది. ఆమెకు నైటీ వేసి, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. లలితాదేవి నోట్లో, మెడ, ముఖంపై రాడ్డుతో పొడిచినట్లుగా గాయాలున్నాయి. గోడపై రక్తం మరకలు చిందాయి. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వాటిలో ఉండవలసిన సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు కనిపించలేదు. ఇంట్లో ఉండవలసిన పెద్ద కుమార్తె, అల్లుడు 6.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీఐ కె.రామారావు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు. లలితాదేవిని హత్యకు వినియోగించిన రాడ్లను, మంచం కింద ఉన్నవాటిని పరిశీలించారు. అక్కాబావలపై అనుమానం.. ఇంట్లో లలితాదేవితోపాటు నానాజీ, అక్క దుర్గాదేవి ఉన్నారు. దుర్గాదేవి, నానాజీలు లలితాదేవిని రాడ్డుతో పొడిచి చంపినట్లుగా తండ్రి సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ అల్లుడు తాగి వచ్చి గొడవపడుతుండేవాడని వాపోయాడు. లలితాదేవి అర్ధనగ్నంగా మంచంపై పడి ఉండడాన్ని బట్టి నానాజీ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో నానాజీ, దుర్గాదేవి ఇంటినుంచి పరారవడాన్ని బట్టివారే హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నానాజీ, దుర్గాదేవిలను పట్టుకోవడానికి రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అనేది వైద్యులు ఇచ్చే నివేదికను బట్టి తెలుస్తుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. క్లూస్ ఏఎస్ఐ టి. విజయ, సభ్యులు సత్యనారాయణ, రాజు, శ్రీను వేలిముద్రలను సేకరించారు. రోదిస్తున్న తల్లిదండ్రులు.. లలితాదేవి హత్యకు గురవడంతో తల్లిదండ్రులు లక్ష్మి, సూర్యనారాయణ భోరున విలపిస్తున్నారు. ఇంట్లో ఉంచుకుంటే ఇంతపని చేస్తాడని ఉహించలేకపోయామని, కుమార్తెను హత్యచేసి, పెళ్లికోసం ఉంచిన బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడని ఆరోపించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిపై అట్రాసిటీ కేసు
కాకినాడ: కులం పేరుతో దూషించారని మాజీ కార్పోరేటర్ ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ పోటీ చేశారు. తన ఇంటిపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ మాజీ కార్పొరేటర్ కొప్పల విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచే విధంగా దూషించిన నానాజీని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టారు. -
ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:జిల్లాలో అక్రమంగా నడుపుతున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకు లు డిమాండ్ చేశారు. వోల్వో బస్సు ప్రమాదం తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ప్రైవేటు వాహనాలపై దాడులు జరగకపోవడం శోచనీయమన్నారు. ఈయూ డివిజినల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు మాట్లాడుతూ..కార్మికుల ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు పోరాడతామన్నారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 30 కారుణ్యనియామకాలను చేపట్టారని వివరించారు. ఈయూ రీజినల్ కౌ న్సిల్ అధ్యక్షుడు పి.నానాజీ మాట్లాడుతూ.బస్సుల మెయింటినెన్స్‌ను ప్ర తి రోజూ చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21,22 తేదీల్లో గ్యారేజీ కార్మికులతో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కె.సుమన్, ఎస్.వి.రమణ, పప్పల రాధాకృష్ణ, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.