డీసీసీ అధ్యక్షుడిగా పంతం నానాజీ
Published Sat, Dec 3 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
కాకినాడ :
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతం నానాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎ¯ŒS.రఘువీరారెడ్డి శుక్రవారం సాయంత్రం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఇంతవరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన కందుల దుర్గేష్ ఇటీవల పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పంతం నానాజీని నియమించారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నానాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కాకినాడ నగర అధ్యక్షుడిగా, పీసీసీ కార్యదర్శిగా పలు పదవులు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒSగా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతే లక్ష్యంగా సీనియర్ నాయకుల సూచన మేరకు పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీ ప్రతిష్ట ఇనుమడింప చేస్తానన్నారు.
Advertisement
Advertisement