కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనమలూరుకు చెందిన ధనేకుల మురళీకృష్ణను నియమిస్తూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మురళీకృష్ణ పెనమలూరు నుంచి 1987లో ఎంపీపీగా, 2000లో జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు.
డీసీసీ అధ్యక్షుడిగా ధనేకుల
Aug 30 2016 8:57 PM | Updated on Sep 4 2017 11:35 AM
విజయవాడ సెంట్రల్ :
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనమలూరుకు చెందిన ధనేకుల మురళీకృష్ణను నియమిస్తూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మురళీకృష్ణ పెనమలూరు నుంచి 1987లో ఎంపీపీగా, 2000లో జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో పీఆర్పీపీ విలీనం నేపథ్యంలో తిరిగి సొంతగూటికి చేరారు. ప్రస్తుతం ఏపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణ రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సన్నిహిత సంబధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిసింది. సామాజిక కోణంలో కూడా ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు స్థానాన్ని భర్తీ చేసేందుకు మురళీకృష్ణ తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు.
Advertisement
Advertisement