శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:జిల్లాలో అక్రమంగా నడుపుతున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకు లు డిమాండ్ చేశారు. వోల్వో బస్సు ప్రమాదం తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ప్రైవేటు వాహనాలపై దాడులు జరగకపోవడం శోచనీయమన్నారు. ఈయూ డివిజినల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు మాట్లాడుతూ..కార్మికుల ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు పోరాడతామన్నారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 30 కారుణ్యనియామకాలను చేపట్టారని వివరించారు. ఈయూ రీజినల్ కౌ న్సిల్ అధ్యక్షుడు పి.నానాజీ మాట్లాడుతూ.బస్సుల మెయింటినెన్స్‌ను ప్ర తి రోజూ చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21,22 తేదీల్లో గ్యారేజీ కార్మికులతో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కె.సుమన్, ఎస్.వి.రమణ, పప్పల రాధాకృష్ణ, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.