Private vehicles
-
ఊళ్లకు ఆర్టీసీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు క్రమంగా ఆర్టీసీ బస్సులు దూరమై ప్రయాణికులకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు చేరువగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ పేరుతో తమ ప్రతినిధులను పల్లెబాట పట్టించనుంది. ప్రతి ఊరిలోనూ తమ ప్రతినిధిని అందుబాటులో ఉంచనుంది. గ్రామాలకు ప్రజారవాణా అవసరాలేంటో గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్రతినిధికి ఐదు ఊళ్లకు మించకుండా బాధ్యత అప్పగించేలా మే ఒకటో తేదీ నుంచి 2 వేల మంది ప్రతినిధులను రంగంలోకి దింపనుంది. రెగ్యులర్ డ్యూటీ చేస్తూనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ ప్రతినిధుల బాధ్యత భుజానికెత్తుకోనున్నారు. వీక్లీ ఆఫ్, ఇతర సెలవు రోజుల్లో వారు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులు, సర్పంచులతో చర్చించి ఆయా ఊళ్లు ఆర్టీసీ నుంచి ఏం కోరుకుంటున్నాయో, ఆయా ఊళ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీకి ఉన్న అవకాశాలేంటో తెలుసుకోనున్నారు. ప్రజలు బస్సెక్కేలా చేయడమే లక్ష్యం... రాష్ట్రంలో 12,769 గ్రామాలున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు తప్ప మిగతా ఊళ్లకు పల్లెవెలుగు/ఇతర కేటగిరీల ఆర్టీసీ బస్సులు నడిచేవి. కానీ ఏడెనిమిది ఏళ్లుగా ఆదాయం కోసం శ్రమిస్తున్న ఆర్టీసీ... ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న గ్రామాలకు ట్రిప్పులు తగ్గించి ఆదాయం ఎక్కువగా ఉండే మార్గాలకు మళ్లించింది. కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతోపాటు సర్విసుల సంఖ్య తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. అద్దె బస్సుల సంఖ్య పెరగడం, వాటి నిర్వాహకులు ఆదాయం ఉన్న మార్గాలపైనే దృష్టి పెట్టడంతో వేల సంఖ్యలో ఊళ్లకు ఆటోలే దిక్కయ్యాయి. ఈ తరుణంలో ప్రజారవాణాను మెరుగుపరిచి గతంలోలాగా ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించేలా చేయాలన్నది యాజమాన్యం లక్ష్యం. నెలకు రూ. 300 అదనపు చెల్లింపులు! ఊళ్లతోపాటు హైదరాబాద్ సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా వార్డులు, డివిజన్ల బాధ్యతను ఆర్టీసీ ప్రతినిధులకు అప్పగించనున్నారు. వారికి నెలకు రూ. 300 వరకు అదనంగా చెల్లించనున్నట్లు తెలిసింది. ప్రతి మూడు నెలలకు సమీక్షించి ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందించనుంది. అయితే కేవలం బస్సులు నడిచే ఊళ్ల బాధ్యతే అప్పగిస్తారా, బస్సు సౌకర్యంలేని ఊళ్ల బాధ్యత కూడా ఉంటుందా అన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, ఆర్టీసీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని, ఈ తాజా నిర్ణయానికి కూడా సానుకూలంగా స్పందించి ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొంటున్నారు. ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ విధులు ఏమిటంటే..? ♦ ప్రతి 15 రోజులకోసారి ఊళ్లకు వెళ్లి సర్పంచులు, సాధారణ ప్రజలతో కలసి ఆయా ఊళ్ల రవాణా అవసరాలపై వివరాలు సేకరించాలి. ♦ ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చైతన్యపరచాలి. ♦ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనంగా ట్రిప్పులు అవసరమన్న విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. ♦ఆయా ఊళ్లలో ఉత్సవాలు, జాతరలు, పెళ్లిళ్ల తేదీల వివరాలు సేకరించి వాటి రూపంలో ఆదాయం పెంచుకొనే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులకు చెప్పాలి. ♦ ఇతర రోజుల్లో కూడా తమకు వివరాలు ఫోన్ చేసి చెప్పొచ్చని గ్రామీణులను కోరాలి. -
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్
సాక్షి, హైదరాబాద్: పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ నేషన్– వన్ పర్మిట్’లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రవాణాశాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇస్తోంది. కాంట్రాక్టు క్యారేజీలుగా తిరిగే వాహనాలు మాత్రం రాష్ట్ర, అంతర్రాష్ట్ర పర్మిట్లపై తిరుగుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు ఇచ్చే ఈ పర్మిట్ల వల్ల రవాణా శాఖకు భారీగా ఆదాయం లభిస్తుంది. అయితే కొత్తగా అమల్లోకి రానున్న వెసులుబాటు వల్ల.. ప్రైవేట్ బస్సులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించి టూరిస్టు పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారి పన్ను చెల్లిస్తే ఏడాది పాటు వాహనాలు నడుపుకోవచ్చు. ప్రైవేటు ఆపరేటర్లకు ప్రయోజనం కొత్తగా అమల్లోకి రానున్న టూరిస్టు పర్మిట్ల వల్ల ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి పర్మిట్లపై బస్సులు నడిపే ప్రైవేట్ ఆపరేటర్లకు మాత్రం ఎంతో ప్రయోజనం కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొంటున్న ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి సుమారు 1,150 ప్రైవేట్ బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు లక్షకు పైగా క్యాబ్‌లు అంతర్రాష్ట్ర పర్మిట్లపై ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇలాంటి వాహనాలన్నీ ఇక నుంచి టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు పర్మిట్ల కోసం అదనంగా చెల్లించవలసిన అవసరం ఉండదు. టూరిస్టు పర్మిట్ల ఫీజులివీ 9 సీట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేల చొప్పున చెల్లించాలి. 10 మంది ప్రయాణికులకు తక్కువ కాకుండా.. 20 మందికి మించకుండా తిరిగే నాన్ ఏసీ మినీ బస్సులు ఏడాదికి రూ.50 వేలు, ఏసీ మినీ బస్సులు రూ.75 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులు టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సులు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించి పర్మిట్లు తీసుకోవచ్చు. టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలు టోల్‌ట్యాక్స్, ఇతర చార్జీలన్నీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయం కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో వైట్ ప్లేట్ కార్లు, ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నారు. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి అగ్రిగేటర్ సంస్థలు కూడా టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. చట్టబద్ధంగా త్రైమాసిక పన్ను చెల్లించి తిరిగే రవాణా వాహనాలకు ఇది చాలా నష్టం. –షేక్ సలావుద్దీన్, రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్ -
‘ప్రైవేట్’ బాదుడు..
సాక్షి, హైదరాబాద్:దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల దోపిడీ పట్టపగలే చుక్కలు చూపింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై గుదిబండ మోపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్ల నుంచి పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 2000 బస్సులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. వీటిల్లోనూ టికెట్ ధరపై 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో 3,800 బస్సులకుగాను ఆదివారం 1,200 బస్సులే రోడ్డెక్కాయి. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. శని, ఆదివారాలు కలిపి గ్రేటర్ ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని అతికష్టం మీద కొన్ని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు అందినకాడికి దండుకున్నారు. సుమారు 127 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో 1.75 లక్షల మంది వరకు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. ఆదివారం సుమారు 4 లక్షల మంది మెట్రో జర్నీ చేశారని అధికారులు అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వే స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. -
ఈవీఎంల తరలింపు.. ప్రతిపక్షాల ఆందోళన
లక్నో : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికి.. ఈవీఎంల తరలింపు వ్యవహారంలో మాత్రం రోజుకో వివాదం తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఈవీఎంలు.. అర్థరాత్రి పూట ప్రైవేట్ వాహనాల్లో దర్శనమివ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ, తన కార్యకర్తలతో కలిసి.. స్ట్రాంగ్ రూమ్ ఎదుట నిరసనకు దిగారు. ఓ మిని ట్రక్కు నిండా ఈవీఎంలను తరలించేదుకు ప్రయత్నించారని అన్సారీ ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారంగా ఓ వీడియోను కూడా చూపిస్తున్నారు. ఆదివారం పోలింగ్ ముగిస్తే.. ఇప్పుడేలా ఈవీఎంలను తరలిస్తారని అన్సారీ ప్రశ్నిస్తున్నారు. WOAH! WATCH MGB candidate from Gazipur confronting POLICE on EVM safety. He alleges that a truck full of EVMs was spotted. He is now sitting on dharna outside the counting centre. His demand is that instead of CISF, BSF must protect EVMs. Watch this space for more. pic.twitter.com/kpYLbyPc73 — SaahilMurli Menghani (@saahilmenghani) May 20, 2019 అయితే ఈ ఆరోపణలను జిల్లా కలెక్టర్ కొట్టి పారేస్తున్నారు. వీడియోలో చూపిన 35 ఈవీఎంలను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చామని.. వాటిని ఇప్పుడు తరలించామని తెలిపారు. గత గురువారం కూడా యూపీలో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ వాహనంలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇవి ఎక్స్ట్రా ఈవీఎంలు అని అధికారులు సర్ది చెప్పారు. అలానే బిహార్‌లోని సరాన్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనంలో పదుల సంఖ్యలో ఈవీఎంలను తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్జేడీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. अभी-अभी बिहार के सारण और महाराजगंज लोकसभा क्षेत्र स्ट्रोंग रूम के आस-पास मँडरा रही EVM से भरी एक गाड़ी जो शायद अंदर घुसने के फ़िराक़ में थी उसे राजद-कांग्रेस के कार्यकर्ताओं ने पकड़ा। साथ मे सदर BDO भी थे जिनके पास कोई जबाब नही है। सवाल उठना लाजिमी है? छपरा प्रशासन का कैसा खेल?? pic.twitter.com/K1dZCsZNAG — Rashtriya Janata Dal (@RJDforIndia) May 20, 2019 -
అమల్లోకి వచ్చిన కాలుష్య ఎమర్జెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ– ఎన్సీఆర్లో కాలుష్య సమస్య రోజురోజుకు ముదురుతుండడంతో గురువారం నుంచి కాలుష్య నియంత్రణ కోసం ఎమర్జెన్సీని పది రోజుల పాటు అమల్లోకి తెచ్చారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ పనులపై నిషేధం విధించడం, స్టోన్ క్రషర్స్, హాట్ మిక్స్ ప్లాంట్లను మూసివేయడం వంటి పలు కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈ నియమాలను ఉల్లంఘించేవారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థలను ఆదేశించారు. కాలుష్య కారక వాహనాలను తనిఖీ చేసే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఢిలీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా విభాగం అధికారుల బృందాలు రోడ్లపై పాత వాహనాలను తనిఖీ చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా అవసరమైనప్పుడు సరి–బేసి విధానాన్ని అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టండి... నగరంలో కాలుష్యం మరింత దిగజారే సూచనలు కనిపిస్తోన్న దృష్ట్యా రానున్న పది రోజుల పాటు ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించవలసిందిగా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ), ఢిల్లీ–ఎన్సీఆర్ వాసులను కోరింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో కాలుష్యానికి ప్రైవేటు వాహనాలు 40 శాతం కారణమవుతున్నాయని ఈపీసీఏ తెలిపింది. ఢిల్లీలో 35 లక్షల ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో కూడా బుధవారం నుంచి 21 అదనపు రైళ్లను పట్టాలపై దింపింది. -
నిర్మాణ అనుమతుల్లోనే వ్యర్థాల చార్జీలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్ల పక్కన, నాలాల్లో వేస్తున్న నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల(డెబ్రిస్) సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ త్వరలోనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా పాత భవనాలు కూల్చివేసి.. వాటిస్థానంలో కొత్తవి నిర్మించాలనుకునేవారు భవన నిర్మాణ అనుమతి ఫీజులతోపాటు డెబ్రిస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను కూల్చివేసే భవనం బిల్టప్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.12 వంతున లెవీగా భవన ని ర్మాణ అనుమతుల ఫీజులతోపాటే చెల్లించాలి. దీన్ని జీహెచ్ఎంసీ ‘డిమాలిషన్ అండ్ రిమూవల్ ఎక్స్పెన్సెస్’పద్దు కింద జమ చేస్తారు. భవనం కూల్చివేతలో వెలువడే డెబ్రిస్‌ను జీహెచ్ంఎసీ సీ అండ్ డీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది. ఇది సెల్లార్లు లేని పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించే వాటికి వర్తిస్తుంది. సెల్లార్లు, సబ్ సెల్లార్లకు సంబంధించి పాత భవనాలకు కానీ, కొత్తగా నిర్మించబోయే వాటికి కానీ అనుమతి తీసుకున్న వారు సెల్లార్ తవ్వకం పని ఎప్పుడు ప్రారంభించేది జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయాలి. సంబంధిత అధికారుల బృందం సెల్లార్ తవ్వక ప్రాంతాన్ని తనిఖీ చేస్తుంది. వీరు సెల్లార్ తవ్వకాల్లో వెలువడే డెబ్రిస్‌తో పాటు కొత్త నిర్మాణ వ్యర్థాల్లో ఎంతమేర రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతుందో అంచనా వేసి, డెబ్రిస్ పరిమాణాన్ని నిర్ధారిస్తారు. నిర్మాణదారు దాన్ని జీహెచ్ఎంసీ నుంచి డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి పొందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ద్వారా కానీ, స్వయంగా కానీ తరలించవచ్చు. ఈ ఏజెన్సీ ద్వారా తరలిస్తే మెట్రిక్ టన్నుకు రూ.342 వంతున చెల్లించాలి. స్వయంగా తరలించాలనుకుంటే రూ.68.5 చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణదారు అండర్‌టేకింగ్ ఇచ్చి, వ్యర్థాలు తరలించాక చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. మెట్రిక్ టన్నుకు రూ.256.. నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ డెబ్రిస్ రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాంకీకి చెందిన ‘హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు వచ్చే నవంబర్ నాటికి ప్లాంట్ పని ప్రారంభించాల్సి ఉంది. పని ప్రారంభమయ్యాకే సీ అండ్ డీ వ్యర్థాలను అక్కడకు తరలించాల్సి ఉన్నప్పటికీ, నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోయిన డెబ్రిస్ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ.256.5 చార్జీతో డెబ్రిస్‌ను తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కోరింది. ఆ మేరకు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపును ఇప్పటికే ప్రారంభించారు. సీ అండ్ డీ వ్యర్థాలను తరలించాలనుకునే ఎవరైనా ప్రస్తుతం రూ.256.5 చెల్లిస్తే సరిపోతుంది. జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు పనులు ప్రారంభం కాగా, జీడిమెట్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాంట్ సమీప ప్రాంతానికి డెబ్రిస్ తరలిస్తున్నారు. నగర ప్రజలు తమ వద్ద ఉన్న ఎలాంటి డెబ్రిస్నైనా ఈ చార్జీతో తరలించవచ్చని జీహెచ్ఎంసీ పేర్కొంది. సంబంధిత సమాచారాన్ని ‘మై జీహెచ్ఎంసీ’యాప్, కాల్‌సెంటర్ సేవల ద్వారా పొందవచ్చని తెలిపింది. ప్రైవేటు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి డెబ్రిస్ తరలించే ప్రైవేట్ వాహనాలు విధిగా రాంకీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది. వాటికి జీపీఎస్ తప్పనిసరి. తద్వారా సదరు వాహనాలు నిర్ణీత ప్రదేశానికి కాకుండా వేరే ప్రాంతంలో డెబ్రిస్ కుమ్మరిస్తే బల్దియా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. నగరంలో డెబ్రిస్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఈ చర్యలకు సిద్ధమైంది. -
‘మృత్యు’ ప్రయాణం!
...ఇది నక్కర్తమేడిపల్లి నుంచి పల్లెచెల్కతండాకు విద్యార్థులు ఆటోలో వెళుతున్న దృశ్యం. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్తమేడిపల్లి మార్గంలో ఉన్న మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు ప్రయాణించాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. నిత్యం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితిలో వెళ్లక తప్పని దుస్థితి ఇది. లోపలా పైనా.. జనమే.. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో ప్రయాణం ప్రమాదంలో పడింది. మారుమూల పల్లెలు, తండాలు, కొన్నిచోట్ల మండల కేంద్రాల నుంచీ ప్రజలు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడం, నడిచినా పొద్దున ఓ ట్రిప్పు, సాయంత్రం మరో ట్రిప్పు మాత్రమే ఉంటుండటంతో జనాలకు ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పోటీలు పడి పరుగులు తీయించడం, సరిగా లేని రోడ్లు, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆటో వ్యవసాయ బావిలో పడిపోయి 11 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అందులో ఆరుగురు చిన్నారులుకాగా, ఐదుగురు మహిళలు ఉండటం ఆందోళనకరం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నూ ఈ తరహా పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ నుంచి నారాయణఖేడ్‌కు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆటో ఇది. లోపల 20 మంది, టాప్‌పైన మరికొంత మంది.. అసలే గుంతల రోడ్డు.. మితిమీరిన వేగం.. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ దుర్ఘటన జరగక తప్పని పరిస్థితి. నిబంధనలున్నా.. పాటించే వారేరీ? ♦ ఆటోలు, జీపుల్లో కచ్చితంగా పరిమితిని పాటించాలి. దీనిని పాటించేవారే లేరు. ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న వారెవరికీ ప్రమాద బీమా కూడా వర్తించదు. ♦ డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ఫోన్లు వాడడం నిషేధం. ప్రైవేటు వాహనాల వారు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆటోల్లో అయితే పెద్ద ధ్వనితో పాటలు పెట్టి నడుపుతూ ఉంటారు. దానివల్ల ఎవరైనా హారన్ కొట్టినా వినపడే పరిస్థితి ఉండదు. అరకొర బస్సులు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలకు సరిగా బస్సు సౌకర్యం లేదు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు బస్సు సర్వీసు మాత్రమే ఉన్న గ్రామాలు ఎన్నో. ఇక తండాల పరిస్థితి మరీ దారుణం. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఆటోల్లో ప్రయాణం కూడా ప్రమాదకరమే. నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళితేగానీ వాహనం ఎక్కలేని పరిస్థితి. పలు చోట్ల సరైన రోడ్డు ఉన్నప్పటికీ బస్సులు నడపడం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో వాటికి 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి ఆటోలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. రోడ్లు సరిగా ఉండకపోవటం, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మైనర్లు నడుపుతుండటం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, ఇయర్ ఫోన్లో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తుండటం వంటివి ఎక్కడ చూసినా కనిపిస్తుండటం ఆందోళనకరం. ప్రాణాలతో చెలగాటం ♦ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరం లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కాలేజీలైతే పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ ఇక తెల్లవారక ముందే కూలీలు ఉపాధి కోసం బయలుదేరుతారు. పనుల కోసం పది ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా కూలీలతో వెళ్తున్న ఆటోలు బోల్తాపడడం, వాహనాలను ఢీకొనడం వంటి ఘటనల్లో పేద కూలీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మంది బలయ్యారు కిందటేడాది అక్టోబర్ 20వ తేదీన రాత్రి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. వారంతా మేడ్చల్ జిల్లా కాప్రా మండలం నందమూరినగర్‌కు చెందిన వారు. బస్సు రాదు.. రోడ్డు సరిగా లేదు.. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారు 60 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యమున్నా.. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు తిరుగుతాయి. దాంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ♦ గద్వాల జిల్లాలో రోజూ సుమారు 50 వేల మందికిపైగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారని అంచనా. వనపర్తి జిల్లాలో 250కి పైగా జనావాసాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వారికి ప్రైవేటు వాహనాలే దిక్కు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి. నిత్యం జిల్లాలో ప్రైవేటు వాహనాల్లో రెండు లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో ఆటోలు, జీపులు తిరుగుతున్నాయి. వాటిలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. సూర్యాపేట జిల్లాలో బస్సులు నడవని గ్రామాలు 30 వరకు ఉన్నాయి. ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 35 వేల వరకు ఆటోలు, తుఫాన్లు, జీపులు ఉన్నాయి. వీటిల్లో రోజూ మూడున్నర లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజూ సుమారు లక్షన్నర మంది వరకు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తారు. బస్సుల్లో ప్రయాణిస్తేనే రక్షణ ప్రయాణికులు తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న హడావుడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడాలి. బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యం చేరవచ్చు. – శంకర్‌నాయక్, ఖమ్మం ఇన్చార్జి ఆర్టీవో -
ప్రైవేటు జోరు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రైవేట్ వాహనాల జోరు తోడై ప్రయాణికుల జీవితాలకు చెలగాటంగా మారింది. అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలైన ఆటోలు, జీపులు, టాటాఎస్ లలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆయా ప్రదేశాలకు చేరవేస్తున్నారు. ఒకవేళ ఊహించని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుపోతున్న అటోలు, జీపులు తదితర ప్రైవేట్ వాహనాల కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా అధికారు ల్లోమార్పురాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేటలో ‘ప్రైవేటు’ జోరు.. జిల్లా కేంద్రం అయిన సిద్దిపేటలో ప్రైవేట్ వాహనాల జోరు మరింత తీవ్రంగా ఉంది. సిద్దిపేట జిల్లా కేంద్రం కావటం వలన ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారికి అటోలే పెద్ద దిక్కుగా మారాయి. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోకి విద్యార్థులు చదువులకోసం, వ్యాపారులు, ఇతరులు నిత్యం అనేక మంది పట్టణాలకు తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల కూడా ఎంతోమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రతీ గ్రామానికి మినీ బస్సులను ప్రభుత్వం నడిపితే ఆర్టీసీకి ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి వెళ్లాలంటే ప్రజలు ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. నిబంధనలు బేఖాతర్.. ముఖ్యంగా పల్లెలకు బస్సులు ప్రతి దినం రెండు లేక మూడు ట్రిప్పులు మాత్రమే తిరుగుతాయి . దీంతో ప్రయాణికులు ప్రమాదమని తెలిసినా అటోలను అశ్రయించాల్సివస్తోంది. ఆటో డ్రైవర్లు మాత్రం ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేస్తే అధికంగా డబ్బులు వస్తాయన్న ఆశతో ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులను తీసుకుపోతున్నారు. దీంతో ఆటోప్రయాణం ప్రజల పాలిట కత్తిపై సాములా మారింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటోలో కేవలం డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. దీంతో పాటుగా ఇతర వాహనాల్లో కెపాసిటీకి లోబడి ప్రయాణికులను తీసుకెళ్లాలి. కాని వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రతీ ఆటోలో కనీసం 10మందికి తక్కువ కాకుండా ప్రయాణికులు లేనిదే వాటిని ముందుకు కదిలించరు. నియంత్రణ చర్యలు శూన్యం ప్రైవేట్ వాహనాలకు ప్రమాదం సంభవిస్తే.. ఆ సందర్భంలో నిబంధనలు పాటించని వాహనాలకు, అందులో ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాద బీమా వర్తించదు. అయినప్పటికీ జిల్లాలో ప్రైవేట్ వాహనాల జోరుపై సంబంధిత అధికారుల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. పట్టణాల్లో ప్రతినిత్యం ప్రైవేటు వాహనాలవారు నిబంధనలను పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని ఇలాంటి చర్యలు కనిపించడం లేదు. ఎప్పుడో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించినపుడో, ఇతర ముఖ్య అధికారులతో ఒత్తిడి వచ్చినపుడు మాత్రమే తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి సిద్దిపేట జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్టు సౌకర్యాలు కల్పించడం అధికారుల బాధ్యత. జిల్లాలో మూడు రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ముఖ్య పట్టణంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఉంటారు, ఇతర ముఖ్య ట్రాపిక్ అధికారులు , ఆర్టీసీ అధికారులు ఉంటారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు రవాణాలో ఇబ్బందులను తొలగించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రమాదాలు జరిగినపుడే చూసుకుందాం అన్న ధోరణితో కాకుండా ముందే జాగ్రత్త పడాలని జిల్లా కేంద్రంలోని ప్రజలు అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించాలి ప్రతి అటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నారు. చార్జీలనూ బాదుతున్నారు. సంబంధిత అధికారులు మారుమూల గ్రామాలకు మినీ బస్సులను నడిపి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పెంపొందించాలి. ప్రైవేట్ వాహనాలవారు ఓవర్‌లోడ్‌తో నడిపించకుండా తగిన చర్యలు చేపట్టాలి. –దుర్గయ్య, ప్రశాంత్‌నగర్ సమయానికి బస్సులు లేక.. నేను సిద్దిపేటలో పని చేస్తాను. ప్రతి రోజూ ఇంటికి వెళ్లాలంటే రాత్రి అవుతుంది. దీంతో ప్రైవేట్ వాహనాలను అశ్రయించక తప్పడం లేదు. వాటిలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. రాత్రి వేళలో బస్సులు వెళ్లిపోతే ప్రైవేటు వాహనాలే మాకు దిక్కుగా మారాయి. –పర్శరాములు, ప్రయాణికుడు పరిమితికి మించితే కఠిన చర్యలు ప్రతీ వాహనం పరిమితికి లోబడే ప్రయాణికులను తీసుకెళ్లాలి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే తీవ్ర చర్యలుంటాయి. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటుగా, వాహనాలను సీజ్ చేస్తాం. ప్రమాదం సంభవిస్తే వాహనానికి, ప్రయాణికులకు ఎలాంటి బీమా వర్తించదు. – రామేశ్వర్‌రెడ్డి, జిల్లా రవాణశాఖఅధికారి -
25 ప్రైవేట్ వాహనాలు సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ వాహనాలను ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం సీజ్ చేశారు. నగరంలోని హయత్‌నగర్ సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న 25 వాహనాలను సీజ్‌చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
పుష్కర దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్న నగరవాసుల జేబులను ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతూ నిలువునా దోచుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం, బీచుపల్లి, వాడపల్లి, సోమశిల తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున నగర వాసులకు పుష్కర ప్రయాణం చేదు అనుభవాన్నే మిగులుస్తోంది. రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక, ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లవలసి వస్తోంది. దీంతో ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ ఆపరేట్లు, ట్రావెల్స్ సంస్థలు తమ దోపిడీని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్‌లగ్జరీ బస్సుల్లో సాధారణ చార్జీ రూ.350 అయితే ఇప్పుడే ఏకంగా రూ.600 లకు చేరుకుంది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. శ్రీశైలంకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సాధారణంగా అయితే రూ.210 లు ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.400లకు పెంచేశారు. అలాగే నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు సైతం రూ.250 నుంచి రూ.500లకు పెంచేశాయి. ఇక 7 సీట్లు, 12 సీట్లు ఉన్న వాహనాలను సొంతంగా బుక్ చేసుకొనే వెళ్లే ప్రయాణికులకు సైతం ట్రావెల్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోమీటర్ చొప్పున లెక్కగట్టి తీసుకొనే చార్జీలతో నిమిత్తం లేకుండా గంపగుత్తగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణంగా అయితే రూ.5000 ఖర్చయ్యే దూరానికి ఇప్పుడు రూ.7000 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ వైపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటు వైపు వెళ్లే అన్ని ప్రైవేట్ వాహనాలు సగటు పుష్కర భక్తుడిని నిండా ముంచడమే లక్ష్యంగా పెట్టుకొని వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వాళ్లకు చార్జీల రూపంలోనే రూ.వేల సంఖ్యలో ఖర్చు చేయవలసి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు గరుడ బస్సుల్లో రూ.550 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు అది ఏకంగా రూ.820కి చేరుకొంది. బీచుపల్లికి డీలక్స్ చార్జీ రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.350 వసూలు చేస్తున్నారు. అన్ని రూట్లలోనూ అదనపు చార్జీల పర్వం కొనసాగుతుంది. రైళ్లు, బస్సుల్లో రద్దీ.... మరోవైపు కృష్ణా పుష్కర ప్రభం‘జనం’ కొనసాగుతోంది. నగర వాసులు పెద్ద సంఖ్యలో పుష్కరాలకు తరలి వెళ్తున్నారు. గురువారం రాఖీ పౌర్ణమి, సెలవు దినం కావడంతో బుధవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో నగర వాసులు వివిధ ప్రాంతాల్లో పుష్కర స్నానాల కోసం బయలుదేరారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, గద్వాల తదితర ప్రాంతాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే 40 రెగ్యులర్ రైళ్లతో పాటు 15 ప్రత్యేక రైళ్లు బుధవారం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేçÙన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలారు. సాధారణ రోజుల్లో 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా బుధవారం ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గుంటూరు, విజయవాడల మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసాయి. రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. కాచిగూడ–గద్వాల మధ్య నడిచే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వుడ్ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్ బోగీల్లో బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో నిండిపోయాయి. పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనూ రద్దీ కనిపించింది. బుధవారం వివిధ ప్రాంతాలకు 100 బస్సులు అదనంగా నడిపారు. వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 1500 ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులకు ఇవి అదనం. నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం ఘాట్లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే 93 రెగ్యులర్ బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. -
నిలువు దోపిడీ
- యూత్రికులకు అరకొరగా ఆర్టీసీ బస్సులు - ఇదే అదనుగా చార్జీలు పెంచేసిన ప్రైవేట్ వాహనదారులు - టీ, టిఫిన్, వాటర్ బాటిల్ ధరలకు రెక్కలు - పట్టించుకోని యంత్రాంగం.. ప్రయూణికుల లబోదిబో ఉంగుటూరు : పుష్కర యాత్రికులు నిలుపు దోపిడీకి గురవుతున్నారు. పుష్కరాలకు వెళ్లే యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారికి అనుగుణంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా అవి కానరావడం లేదని ప్రయూణికులు చెబుతున్నారు. ధరలకు రెక్కలు పుష్కరాల పేరుతో వాటర్ బాటిల్ నుంచి టిఫిన్ సెంటర్ల వరకు అన్నింటి ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఉంగుటూరు మండలంలో పుష్కర ఘాట్లేవి లేకపోరుునా ప్రయూణికులు పెద్ద సంఖ్యలో ప్రయూణిస్తుండడంతో జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణాల్లో ధరలను అమాంతంగా పెంచేశారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 కాగా ఇప్పుడు రూ. 25 నుంచి రూ.30 వరకు విక్రరుుస్తున్నారు. కాఫీ హోటల్లో టిఫిన్ రేట్లు గతంలో నాలుగు ఇడ్లీ రూ. 12 తీసుకోగా ఇప్పుడు రూ.25 వసూలు చేస్తున్నారు. భోజనం ధర రూ. 50 నుంచి రూ.100కు పెరిగిపోరుుంది. ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం ఆటో చార్జి గతంలో రూ.7 ఉండగా నేడు రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. బస్సులు అరకొరగా ఉండడంతో అధిక చార్జి సమర్పించుకుని ప్రయణించాల్సి వస్తోంది. -
సమ్మెతో క్షతగాత్రులకు అందని వైద్యం
డీజిల్ లేదని తరలించని 108 తాత్కాలిక సిబ్బంది అల్లాదుర్గం రూరల్ : 108 సిబ్బంది సమ్మెతో క్షతగాత్రులకు వైద్యం అందడం లేదు. ప్రాణాపాయ స్థితితో ఉన్న మహిళను సంగారెడ్డికి తరలించాల్సి ఉండగా డీజిల్ లేదని తాత్కాలిన 108 సిబ్బంది వాహనం నుంచి దింపి వేసిన సంఘటన అల్లాదుర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెద్దశంకరంపేట మండలం బద్దారం గ్రామానికి చెందిన గాజుల తులశమ్మపై దాడి జరగడంతో ప్రైవేటు వాహనంలో శంకరంపేట తీసుకువచ్చారు. 108కు ఫోన్ చేయగా అల్లాదుర్గంలో ఉందని చెప్పడంతో అదే వాహనంలో అల్లాదుర్గం తరలించి 108లో ఎక్కించారు. పరస్థితి అందోళన కరంగా ఉండటంతో సంగారెడ్డికి తరలించాలన్నారు. వాహనంలో ఉన్న డీజిల్ జోగిపేట వరకే సరిపోతుందని, సంగారెడ్డికి చెరుకోలేదని 108 డ్రైవర్ అనడంతో ఆమెను దింపి ప్రైవేట్ వాహనంలో తరలించారు. సిబ్బంది సమ్మె చేసినా వాహనాలను నడుపుతున్నట్లు యాజమాన్యం చెబుతున్నా క్షతగాత్రులకు మాత్రం వైద్యం అందడం లేదు. -
అదనపు బాదుడు
అద్దె బస్సుల్లో టిక్కెట్‌లేని ప్రయాణం ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీల వసూలు ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె 20 శాతానికి మించి ఆర్టీసీ బస్సులు నడపడం కష్టమంటున్న అధికారులు గ్రామీణ ప్రాంతాలకే చేరని పల్లెవెలుగు రాకపోకలు సాగిస్తున్న 264 బస్సులు నేటినుంచి టిక్కెట్లతోనే ప్రయాణం నల్లగొండ సందిట్లో సడేమియా లాగా....ఆర్టీసీ కార్మికుల సమ్మెను అదునుగా చేసుకుని అద్దెబస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు వాహనాల దోపిడీ భరించలేని ప్రయాణికులకు అద్దె బస్సుల రూపంలోనూ తీవ్ర నష్టం వాటిల్లోతోంది. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అద్దెబస్సులను రోడెక్కిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ 81 బస్సులు నడుపుతుండగా అద్దె బస్సులు 183 నడుస్తున్నాయి. ఇవి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్, భువనగిరి మార్గాల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే అద్దెబస్సుల యజమానులకు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే వాటిని నడిపిస్తున్నారు. సమ్మె కాలంలో అద్దెబస్సుల నుంచి ఎలాంటి చార్జీలు ఆర్టీసీ తీసుకోరాదు. అలాగే ఆర్టీసీ చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలి. ప్రైవేటు డ్రైవర్లు, కండ క్టర్లు సాయంతో బస్సులు నడుపుతున్నారు కాబట్టి టిక్కెటు లేని ప్రయాణమే సాగుతోంది. దీనిని అతిక్రమించిన అద్దె బస్సుల యజమానులు ఆర్టీసీ చార్జీల కంటే ఎక్కువ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వంద రూపాయలు చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా రూ.120, 130 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మంగళవారం నుంచి అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం సుక్షితులైన డ్రైవర్లు, కండక్టర్లు నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కార్మికుల సమ్మె ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సులు నడపడం కష్టసాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం రీజియన్ పరిధిలోని 720 బస్సుల్లో 20 శాతానికి మించి నడపడం కష్టమని అంటున్నారు. డిపో మేనేజర్లు మినహా కార్యాలయాల్లో ఉద్యోగులు సైతం సమ్మెలో ఉన్నందున ఇతర వ్యవహారాలు చూసుకోవడం వీలుపడదని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్న బస్సుల్లో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి తప్ప పల్లె ప్రాంతాలకు చేరడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కార్మికుల నిరసనలు.... నల్లగొండ డిపో ముందు కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డిపో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మిర్యాలగూడ డిపోలో కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వివిధ ప్రాంతాలకు నాలుగు బస్సులు నడిపించారు. భువనగిరి నుంచి నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు నడిచాయి. ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక బస్ చార్జీలు వసూలు చేశారు. పోలీస్‌లు బస్సులకు అంతరాయం కలగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంస్థాన్ నారాయణపూర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్సుల రాకపోకలు ఆగిపోవడంతో ఆరు రోజులుగా పర్యాటకులు లేక నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం వెలవెలబోతుంది. కోదాడ డిపో గేట్ ముందు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహిళ కండక్టర్లు, డ్రైవర్లు గేట్ ఎదుట బైఠాయించారు. పోలీసుల ద్వారా బస్సులను బయటకు తీసుకు రావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నం చేయగా కార్మికులు ప్రతిఘటించారు. దీంతో కొద్దిసేపు కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కార్మికులను బలవంతంగా తొలగించి నాలుగు బస్సులను బయటకు తీసుకొచ్చి నాలుగు రూట్లకు పంపారు. ఖమ్మం, మిర్యాలగూడెం, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్ బయట వరకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయి. -
‘ప్రైవేట్’ హల్చల్!
- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరాన్ని ముంచెత్తిన వేలాది ప్రైవేటు వాహనాలు - ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్.. - మూడు నుంచి ఐదు గంటలపాటు పద్మవ్యూహంలో చిక్కుకున్న సిటీజనులు - వేలాదిగా వివాహాది శుభకార్యాలుండడంతో కిక్కిరిసిన రోడ్లు - ప్రయాణికులకు తప్పని అవస్థలు.. - ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిట - ఆగని ప్రైవేటు వాహనదారుల దోపిడీ.. - అనూహ్యంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ వినియోగం.. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గ్రేటర్ నిండా ప్రైవేట్ వాహనాలే కన్పిస్తున్నాయి. సిటీలోని ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి వస్తున్న వేలాది వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం గ్రేటర్ పరిధిలో సుమారు 20 వేలకు పైగా వివాహాది శుభకార్యాలు ఉండడంతో వీటికి హాజరయ్యేందుకు నగరం, పొరుగు జిల్లాల నుంచి సిటీకి వచ్చిన వారు మూడు నుంచి ఐదు గంటలపాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు సైతం వాహనాల తాకిడితో కిక్కిరిశాయి. పెట్రోలు బంకుల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎల్బీనగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, చంపాపేట్, ఉప్పల్, సాగర్‌రింగ్‌రోడ్డు, బోయిన్పల్లి, మేడ్చల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, మియాపూర్, తార్నాక, నాగోల్, ఎస్.ఆర్.నగర్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ రింగురోడ్డులో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కంటైనర్ లారీ చెడిపోయి నడిరోడ్డుపైనే ఆగిపోయింది. ఇదే సమయంలో మరో వైపు ఇసుక లారీ సాంకేతిక కారణాలతో నడిరోడ్డుపై ఆగిపోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు గంటలపాటు ఈమార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన నగరంలో ఆర్టీసీ కార్మికులసమ్మె ఆదివారం ఐదవరోజుకు చేరింది. గ్రేటర్ పరిధిలోని 28 డిపోల్లో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి డిపో పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, బర్కత్‌పుర, కాచిగూడ, జీడిమెట్ల, ఫలక్‌నుమా తదితర డిపోల్లో కార్మికులు పరిసరాలను పరిశుభ్రం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య 660 బస్సులను నడిపారు. అయినప్పటికీ ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది. స్వల్ప దూరాలకే అందినకాడికి దండుకొని ఆటోలు, కార్లు, జీపులు వంటి ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల జేబులు గుల్లచేశారు. రైళ్లు కిటకిట.. ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. ప్రయాణికుల రద్దీ దష్ట్యా సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో ద.మ.రైల్వే 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడిపింది. సాధారణంగా నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లకు ఇవి అదనం అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ అధికంగా ఉండడంతో మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఆరు ప్యాసింజర్ రైళ్లను నడిపినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. వేసవి సెలవులు,పెళ్లిళ్లు అధికంగా ఉం డడం సిటీజనం భారీగా ఆయా ప్రాంతాలకు తరలివెళ్లడంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసి కనిపించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది. ఆగని ప్రైవేటు దోపిడీ.. జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్ పరిసరాల నుంచి ఆయా జిల్లాలకు బయలుదేరిన బస్సులు అరకొరగా ఉండడంతో ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేశారు. సిద్దిపేట, కరీంనగర్, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు అరకొరగానే అద్దె బస్సులు నడిచాయి. నగరం నుంచి పొరుగు రాష్ట్రాలు, నగరాలకు వెళ్లినప్రయాణికులు పెంచిన చార్జీలతో ఆందోళన చెందారు. భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ వినియోగం... గ్రేటర్ నగరంలో సుమారు 447 పెట్రోలు బంకుల వద్ద ఆదివారం సుమారు 40 లక్షల వాహనాలు ఇంధనం కోసం బారులు తీరినట్లు అంచనా. రోజువారీగా నగరంలో 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33లక్షల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే 40 లక్షల లీటర్ల పెట్రోలు, 50 లక్షల లీటర్ల మేర డీజిల్‌ను విక్రయించినట్లు పెట్రోలు బంకుల డీలర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించడంతో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత వాహనాలను బయటికి తీస్తుండడం, వీటికితోడు పొరుగు జిల్లాల నుంచి భారీగా ప్రైవేటు వాహనాలు సిటీకి వస్తుండడంతో ఇంధన వినియోగం భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు. -
దొరికినోళ్లకు దొరికినంత!
కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల ఇష్టారాజ్యం డ్యూటీల కోసం నేతల ఒత్తిడి సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొంత మందికి బాగా కలిసొచ్చింది. ప్రైవేట్ వాహనాల వారు చార్జీలు రెట్టింపు చేసి దండుకుంటుండగా, ఆర్టీసీ తాత్కాలికంగా సిబ్బందికి మాత్రం పండగలా మారింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు కలగకూడదని భావించి ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్, కండెక్టర్లను నియమించుకున్నారు. రోజుకు డ్రైవర్‌కు రూ.వెయ్యి, కండక్టర్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తున్నారు. ఇది చాలదనుకున్నారో.. లేక సమ్మె ముగిశాక తమ ఉద్యోగాలు ఉండవనుకున్నారో కానీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సులను తనిఖీ చేసే వారు లేకపోవడంతో సగం నొక్కేస్తున్నారు. బస్సులో ఎంత మంది ఎక్కినా సగం మందికే లెక్క చూపుతూ మిగతా సొమ్మును పలువురు తాత్కాలిక డ్రైవర్, కండెక్టర్లు చెరి సగం జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 300 నుంచి 400 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బస్సులు రద్దీతో వెళ్తున్నా తక్కువ మంది ఎక్కినట్లు తాత్కాలిక కండక్టర్లు డిపోలో డబ్బులు అందజేస్తున్నారు. ఇందుకు తాత్కాలిక డ్రైవర్లు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. కాగా, ప్రస్తుత సమ్మె నేపథ్యంలో ఎంపికైన కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీల కోసం పైరవీలు చేస్తున్నారు. టీడీపీ నేతల ద్వారా కొందరు, ఇతర నాయకుల ద్వారా మరి కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో డిపో మేనేజర్లు తల పట్టుకున్నారు. -
అంతా సెట్ చేశారు
నేటి ఎంసెట్ కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు 4,300 ప్రయివేట్ వాహనాలు సిద్ధం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు టెట్ వరకు కొనసాగింపు ఇబ్బందులు ఎదురైతే డయల్ 100 కలెక్టర్, సీపీ వెల్లడి సాక్షి, విజయవాడ : జిల్లాలో శుక్రవారం జరిగే ఎంసెట్‌కు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రయివేటు వాహనాలు నడపనున్నామని వివరించారు. ఆ తర్వాత జరిగే టెట్‌కు కూడా ఇవే ఏర్పాట్లు కొనసాగిస్తామని ఆయన వివరించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ సీపీ వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గురువారం 36 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయని, శుక్రవారం ఎంసెట్ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఆర్టీసీ బస్సులు, అన్ని ప్రయివేటు విద్యాసంస్థల బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని మండలాల నుంచీ.. జిల్లాలో 1,400 బస్సులకు గానూ గురువారం 235 ఆర్టీసీ అద్దె బస్సులు, 265 ఆర్టీసీ బస్సులు నడిచాయని వివరించారు. జిల్లాలో 45వేల మంది ఎంసెట్ రాయనున్నారని, విజయవాడ, మచిలీపట్నంలో 81 సెంటర్లలో పరీక్ష జరుగుతుందని వివరించారు. 4,300 వరకు ప్రయివేట్ విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయని రవాణాశాఖ ఇప్పటికే అన్ని యాజమాన్యాలను సంప్రదించిందని, ప్రయివేటు బస్సులు కూడా వినియోగించి విజయవాడ, మచిలీపట్నంకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రవాణా ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను విధుల్లో ఉంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. దీనికోసం డయల్ 100కు ఫోన్‌చేస్తే ద్విచక్ర వాహనం నుంచి పోలీస్ వ్యాన్ వరకు ఏదైనా పంపుతామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, రవాణా శాఖ ఇన్చార్జి డెప్యూటీ కమిషనర్ ఆర్.పురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ పెనమలూరు : విజయవాడ రీజియన్‌లో జరిగే ఎంసెట్‌కు మొత్తం 40,899 మంది హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 23,069, మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే మెడికల్ పరీక్షకు 17,630 మంది హాజరవుతారు. ఇందుకు నగర పరిధిలో మొత్తం 81 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు హాల్ టికెట్, డౌన్లోడ్ చేసిన దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ అటెస్టేషన్ కాపీని విధిగా తీసుకురావాలి. పరీక్ష హాల్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 1,795 మంది అధికారులను పరీక్ష నిర్వహణకు నియమించారు. -
అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ బస్సులు నిలిపివేత
-
పన్ను ఆలోచన విరమించుకొండి: శిద్దా
-
సీఎం సారొస్తారని..!
ఎమ్మెల్యే కళా వెంకట్రావు తనయుడి పెళ్లికి ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, అనధికారుల కోసం, సీఎం కాన్వాయ్ కోసమని చెప్పి 10వ తేదీ ఉదయమే పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 11న మధ్యాహ్నమే సీఎం వెళ్లిపోయారు. కానీ వాహనాలు మాత్రం వాటి యజమానులకు చేరలేదు. కారణం.. మళ్లీ 14న సీఎం సారొస్తుండటమే. ఆ పర్యటన కోసం వాహనాలన్నింటినీ ఎచ్చెర్లలోని రిజర్వ్ పోలీసు కార్యాలయానికి తరలించి అట్టిపెట్టారు.ఇంటే.. సీఎం రెండో పర్యటన ముగిసిన తర్వాత 14వ తేదీ నాటికి గానీ వాహనాలు తిరిగి ఇవ్వరన్నమాట! 10 నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఐదు రోజులపాటు తమ వాహనాలను తీసుకుంటే వాటి కిరాయిపైనే ఆధారపడే తాము ఏం కావాలని వాహన యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఎచ్చెర్ల : సీఎం సారొస్తున్నారంటే చాలు.. అధికార దుర్వినియోగానికి హద్దు లేకుండాపోతోంది. సాక్షాత్తు ఉన్నతాధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడుతుండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతోపాటు రుణాలపై వాహనాలు కొని స్వయంగా అద్దెకు నడుపుకొంటున్నవారు రోజుల తరబడి ఆదాయం కోల్పోతున్నారు. సాధారణంగా సీఎం స్థాయి ప్రముఖులు వచ్చినప్పుడు జనం తరలింపు, ఇతరత్రా అవసరాల కోసం అధికారులు ప్రైవేట్ వాహనాలను సమీకరించడం కొత్త కాదు. ఈసారి మాత్రం నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు సీఎం చంద్రబాబు జిల్లాకు రానుండటం వాహన యజమానులకు ఆదాయం కోల్పోయే పరిస్థితి కల్పించింది. ఇప్పటికే 11న వచ్చి వెళ్లిన సీఎం.. తిరిగి 14న జిల్లాకు రానున్నారు. దీని కోసం అధికారులు పెద్ద సంఖ్యలో వాహనాలను సమకూర్చారు. సీ బుక్కులు స్వాధీనం రవాణా శాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ ఉదయాన్నే ప్రైవేట్ వాహన యజమానులపై పడ్డారు. 11నాటి సీఎం పర్యటన కోసం శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో ట్యాక్సీ స్టాండ్లకు వెళ్లి అందుబాటులో ఉన్న సుమారు 65 వాహనాల సీ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో స్కార్పియో, ఇన్నోవా, గ్జైలో, క్వాలీస్, సఫారీ, బొలేరో వంటి పెద్ద వాహనాలున్నాయి. వాటన్నింటిని సీఎం పర్యటనకు పంపించాలని ఆదేశించారు. అలా వెళ్లిన వాహనాలను 11న మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసిన వెనక్కి పంపకుండా ఎచ్చెర్లలోని ఆర్మ్డ్రిజర్వు పోలీసు కార్యాలయానికి తరలించారు. అలా ఎందుకు చేశారంటే.. 14న మళ్లీ సీఎం పర్యటన ఉంది.. అప్పుడు వాహనాలు దొరుకుతోయో లేదోనన్న భయంతో వీటినే ఉంచేశారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఐదు రోజుల ఖర్చుల మాటేమిటి? సాధారణంగా సీఎం పర్యటన ముందురోజు, పర్యటన రోజు వాహనాలు వినియోగించుకొని ప్రభుత్వ రేట్ల ప్రకారం రోజుకు రూ.800 నుంచి 1000 వరకు చెల్లిస్తుంటారు. అదే ప్రైవేటుగా అద్దెకు తిరిగితే వేలల్లోనే ఆదాయం వస్తుంది. కాగా కాన్వాయ్ నిర్వహణ రోజే డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లు అందిస్తారు. మిగతా రోజుల్లో సొంత ఖర్చులో తినాలి. ఇంతా చేసి పర్యటన రద్దయితే ఆ ఖర్చులు కూడా ఇవ్వరు. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఐదు రోజులపాటు రవాణా శాఖ ఆధీనంలో తమ వాహనాలు ఉండిపోతే కిరాయి కోల్పోవడంతోపాటు, రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని వాహన యజమానులు, డ్రైవర్లు వాపోతున్నారు. ఇదేమిటని నిలదీస్తే.. తర్వాత నిబంధనల పేరిట తమను వేధిస్తారేమోనని భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజను కావడంతో వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో వాహనాలను నిర్బంధంగా తరలించి తమ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నష్టాల నివారణకు ఆర్టీసీ ప్రయత్నం
సాక్షి, ముంబై: నష్టాల బాటలో నడుస్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆ పరిస్థితి నుంచి గట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం స్థానిక పోలీసులు, రవాణ శాఖతో కలసి పనిచేయాలని నిర్ణయించింది. ముంబై వంటి మహానగరం నుంచి తాలూకా స్థాయి వరకు ఎక్కడ చూసినా బస్టాండ్ బయట అక్రమంగా ప్రైవేటు వాహనాలను నిలిపి, ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గి ప్రతిరోజు సంస్థకు రూ.కోట్లలో గండి పడుతోంది. దీన్ని నివారించేందుకు బస్‌స్టాండ్‌కు 200 మీటర్లలోపు ప్రైవేటు వాహనాలను నిలిపి ఉంచకుండా స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం ఐదు వేల మందికి పైగా పోలీసుల అవసరముంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని భరించే స్థోమత ఆర్టీసీకి లేదు. ఇంత త్వరగా అంత మందిని సమకూర్చడం సాధ్యపడదు. దీంతో తాత్కాలికంగా 500-1000 వరకు పోలీసులను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ రూ.వేయి కోట్లకు పైగా నష్టాలను చవిచూస్తోంది. దీనికి తోడు ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూనే ఉంది. ఎన్ని రాయితీలు కల్పించినా సీజన్లో మినహా ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇలా చేస్తే కనీసం నష్టాల శాతం అయినా తగ్గే అవకాశం ఉంది. -
నష్టాల ఊబిలో ‘ప్రగతి చక్రం’
- జిల్లాలో పది డిపోల్లో రూ. 10.12 కోట్ల నష్టం - నాలుగు నెలలుగా అందని ప్రభుత్వ రాయితీలు - ప్రైవేట్ వాహనాల జోరుకు కళ్లెం శూన్యం నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందంగా తయారైంది. ఆయా డిపోలు పూర్తిగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సమయపాలన పాటించకపోవడం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సులను తీసుకోవడం, నిర్వహణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టామిట్టాడుతోంది. జిల్లాలోని మొత్తం 10 డిపోలు కలిపి రూ.10.12 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నష్టం ఇలా... జిల్లాలో నెల్లూరు-1, 2, ఉదయగిరి, ఆత్మకూ రు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాపూరు, వాకాడు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో దాదాపు 798 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 103 అద్దె బస్సులు ఉన్నాయి. అన్ని డిపోల్లో ఆయా కేటగిరీల్లో మొత్తం 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజుకు 3.75 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందుకోసం డీజిల్ రూపంలో నెలకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులకు కిలోమీటరుకు దాదాపు రూ.33లు రావల్సి ఉండగా, కేవలం రూ.21లు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.34 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. తరచూ మొరాయిస్తున్న బస్సులు ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. పాతకాలం నాటి బస్సులు కావడంతో ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల చెన్నైకి వెళ్తున్న బస్సు మొరాయించడంతో మరొక బస్సులో ప్రయాణికులను తరలించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవడంతో మరమ్మతుల ఖర్చు తడిసిమోపెడవుతోంది. అర్ధంతరంగా బస్సుల రద్దు సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజుల కిందట కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రూట్లలో బస్సులు నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తి రుగుతుండంతో ఓఆర్ తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల జోరు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ప్రైవే టు వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు డిపోల ముందుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నుంచి గూడూరు, నాయుడుపేట, తిరుపతిలకు ప్రతిరోజు టెంపోలు, కార్లు తిరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. నష్టాలను అధిగమిస్తాం : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్తాం. ఏప్రిల్, మే, జూన్ నెలలు మాత్రమే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. మిగిలిన నెలలు అన్ సీజన్. దీంతో ఆర్టీసీకి కొంత రాబడి తగ్గుతుంది. ఆర్టీసీ 100 రోజుల ప్రణాళికలో నష్టాలను అధిగమిస్తాం. - చంద్రశేఖర్, సీటీఎం -
ట్రాఫిక్ సమస్యకు ‘షేరింగ్’తో చెక్!
సాక్షి, ముంబై: రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాహనాల సంఖ్య తగ్గితేనే ట్రాఫిక్‌ను నియంత్రించగలమని ట్రాఫిక్ విభాగం తేల్చేయడంతో వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా రవాణా విభాగం చర్యలు తీసుకుంటోంది. సొంత కార్లలో ఆఫీసులకు వెళ్లేవారు ప్రజారవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తే వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సొంత వాహనాలకు బదులుగా షేర్ ట్యాక్సీలను వినియోగించుకునేలా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ముందుగా అభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు రవాణా విభాగా అధికారి ఒకరు తెలిపారు. వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆవరణలో షేర్ ట్యాక్సీలను అందుబాటులో ఉంచడం ద్వారా ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులంతా ఈ ట్యాక్సీని ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంత ప్రయాణికుల కోసం కూడా ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ఒకే రూట్లో వెళ్తున్న ట్యాక్సీల రద్దీని కూడా కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు. షేర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రావడంతో కార్లు ఉన్న వారు కూడా తమ కార్లను ఇంటి వద్దనే ఉంచుతారని, అంతేకాకుండా వీరికి పార్కింగ్ రుసుము చెల్లించే ఖర్చు కూడా తప్పుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నవీముంబై, ఠాణే తదితర సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు షేర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ములుండ్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు, అంధేరి నుంచి చర్చ్‌గేట్ వరకు, బాంద్రా నుంచి పరేల్ వరకు షేర్ ట్యాక్సీలను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దీంతో షేర్ ఆటోల కోసం స్టాండ్లను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించాలని రవాణా విభాగం అధికారులు సూచించారు. ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రయాణికులకు తెలపడం కోసం ప్రకటనలు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవరు పూర్తి వివరాలతోపాటు షేర్ ఆటో చార్జీల వివరాలను ఆటో స్టాండ్లు, వెబ్సైట్లలో పొందుపర్చాలని, దీంతో ప్రయాణికులు కూడా తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన ఆటో స్టాండ్‌ను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే చాలా మంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ఖార్గర్ నుంచి పరేల్ వరకు రోజు ట్యాక్సీలో వెళ్తాను. నాతోపాటు ఈ మార్గంలో వెళ్లే మరికొంతమంది ప్రయాణికులను కూడా డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు. అయితే నేను డ్రైవరుకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నా ఒక్కడినే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తే అతను అడిగినంత చార్జీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మరికొంత మంది ట్యాక్సీలో ఎక్కడం ద్వారా చార్జీని మేమందరం షేర్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయ’న్నారు. ఇదిలాఉండగా ఈ ప్రక్రియను తాము కూడా స్వాగతిస్తామని ముంబై ట్యాక్సీమెన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్ క్వాడ్రోస్ తెలిపారు. -
ఈ రోజులు మాకొద్దు.. రాదు.. పోదు.. కదలదు
బస్సుల కోసం పడిగాపులు పడే జనం.. బస్సొస్తే పొలోమంటూ పరుగెత్తే విద్యార్థులు.. జీపులో జనమున్నారో.. లేక జనం మధ్యలో జీపుందో తెలియనంతగా కిక్కిరిసే ప్రైవేటు వాహనాలు.. ఇటువంటి దృశ్యాలు పల్లెల్లో నిత్యకృత్యమయ్యాయి. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం గంటల కొద్దీ నిరీక్షించలేని పల్లెవాసులు ‘ప్రైవేటు’ బాట పడుతుండగా.. ‘లాభం’ లేదని ఆర్టీసీ ట్రిప్పులు తగ్గించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజలు అష్టకష్టాలపాలవుతున్నారు. ఆర్టీసీని నమ్ముకోలేక.. అలాగని ప్రయాణాలు వాయిదా వేసుకోలేక ప్రమాదం అంచునే ప్రయాణిస్తున్నారు. నరకానికి డైరెక్ట్ రూట్లుగా మారిన రోడ్లు.. రావడమే గొప్పన్నట్టు ముక్కుతూ ములుగుతూ వచ్చే బస్సులు చచ్చీచెడీ మధ్యలో మొరాయిస్తే.. బతుకు బస్టాండే! బస్సుకోసం ఎదురుచూసీ.. చూసీ యాష్టకొచ్చి జీపులో ఓ ఇరవై మంది.. టాపుపై మరో 15మంది ప్రాణాలు గాల్లో దీపాలని తెలిసినా.. గమ్యం చేరాలంటే తప్పదుగా మరి! స్కూలుకో, కాలేజీకో వెళ్లాలంటే చెమటోడ్చాల్సిందే ‘పల్లెవెలుగు’తో రూపురేఖలు మార్చేస్తాం అంటారు పాలకులు.. దండిగా పాసులిచ్చేస్తారు.. మరి బస్సులేవయ్యా అంటే రోడ్డులేదంటారు.. రోడ్డుంటే ‘ఆక్యుపెన్సీ’ లేదంటారు. ఆ రూట్లో ‘లాభం’ లేదంటూ ‘ప్రైవేటు’కు దన్నుగా నిలుస్తారు. ‘పల్లె వెలుగు’లు నింపడం లేదని.. ఆటోలు.. జీపుల సాకుతో ఆ ఒక్కటీ ఊడబెరుకుతారు, కాదు.. కూడదంటే డొక్కుబస్సులేస్తారు మరి ఏమైపోవాలి విద్యార్థులు?.. ఎక్కడికెళ్లాలి ఊరి జనం? స్వతంత్ర భారతావనిలో ఇంకా రోడ్డులేని.. బస్సురాని ఊళ్లా? చాలు.. ఈ రోజులు మాకొద్దు.. ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టేద్దాం. - సాక్షి నెట్వర్క్. బుట్టలల్లకపోతే బువ్వ లేదు! వృత్తి పథం: మేదరులు: నాకు అరవయ్యేళ్లు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కానీ బువ్వ దొరకదు. ఒకట్రెండ్రోజులు కాదు... పుట్టింటి నుంచి వచ్చిన 44 ఏళ్ల నుంచి ఇదే కష్టమే. నా భర్త పరమేశు.. నేను ఇద్దరమే. పిల్లల్లేరు. నిద్ర లేచినప్పటి నుంచి నా మొగుడు పనిలోకి దిగితే, నేను ఇంటి పనులు, వంట చేస్తాను. తర్వాత నా మొగుడితో పాటే పని చేస్తా. సాయంత్రానికి నాలుగు పప్పు గంపలు అల్లుతా. ఆ నాలుగు కలిపి రూ.300కు అమ్ముతాం. ఇందులో సగం పెట్టుబడికి పోతే మిగిలిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది. అప్పట్లో దబ్బల రేటు తక్కువగా ఉండేది. దీంతో డబ్బు మిగిలేది. సరుకు కర్నూలు జిల్లాలోని అహోబిలం నుంచి వస్తుంది. వెదురుబొంగు రూ.60 ప్రకారం కొంటాం. రూ.20 వేలకు పైగా పెడితే కానీ అక్కడి నుంచి సరుకు తెచ్చుకోలేం. సరుకు దొరకనప్పుడు కూలి పనులకు వెళ్తాం. ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా మిగలట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గొంతుక్కూర్చొని పని చేస్తుండటంతో ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి. అయినా బతకడం కోసం చేయాల్సిందే కదా! మాకెలాంటి ప్రభుత్వ సాయమూ అందడం లేదు. ఇంతకుముందు మైదుకూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు సొసైటీలో ఉన్న సొమ్మంతా తినేశారు. కష్టాల్లో ఉన్న మా లాంటి వాళ్లను నాయకులు ఆదుకోవాలి. అలాంటి వారికే ఓటేస్తాం. - రాగం లక్ష్మమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా -
సమైక్య బంద్ సక్సెస్
మిన్నంటిన నిరసనలు స్తంభించిన ఆర్టీసీ సేవలు మూతపడిన బ్యాంకులు, థియేటర్లు, విద్యా సంస్థలు తిరుమలకు బస్సుల రాకపోకలమినహాయింపు జాతీయ రహదారుల్లో నిలిచిన ప్రైవేట్ వాహనాలు సాక్షి, చిత్తూరు: సమైక్య బంద్ జిల్లాలో సక్సెస్ అయ్యింది. ఏపీఎన్జీవోలు, వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, నగరి పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలను ఏపీఎన్జీవోలు దగ్గరుండి మూయించారు. వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే.రోజా, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. కార్యకర్తలతో కలిసి రోడ్లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, చిత్తూరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మదనపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు నీరుగట్టుపల్లెలో బంద్ నిర్వహించారు. ఎపీఎన్జీవోల ఆధ్వర్యంలో మానవహారాలు చేపట్టారు. నీరుగట్టువారిపల్లె మార్కెట్‌యార్డు వద్ద విద్యార్థులు, ఎన్జీవోలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు అక్కడక్కడా తిరిగాయి. పుంగనూరులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ జరిగింది. అన్ని రహదారులు దిగ్బంధ నం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ నాయకుడు శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే .రోజా ఆధ్వర్యంలో ఉయ్యాల కాలువవద్ద రాస్తారోకో చేశారు. రాకపోకలు స్తంభించాయి. పలమనేరు ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పట్టణ సరిహద్దుల్లో వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నాయకులు బంద్ పాటించారు. బంద్‌లో మాజీ ఎమ్మేల్యే అమరనాథరెడ్డి పాల్గొని ఆందోళనకారుల నుద్దేశించి ప్రసంగించారు. కుప్పంలో వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఏపీ ఎన్జీవోలు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సాయంత్రం వరకు బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. శ్రీకాళహస్తిలో ఎపీఎన్జీవోలు బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దుకాణాలు మూత పడ్డాయి. చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే వాహనాలను ఆపేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలీసులు జోక్యం చేసుకుని కొన్ని వాహనాలను వదిలారు. నగరంలోకి ఇతర వాహనాలను అనుమతించలేదు. తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు, డిపార్టుమెంట్ పరీక్షలకు మినహాయింపు ఇచ్చారు. వాణిజ్య సంస్థలు, బ్యాంక్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. కలెక్టరేట్ మూతపడింది. ప్రభుత్వకార్యాలయాలూ పనిచేయలేదు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎం.ఆర్.పల్లె సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్డీవో, ఎం.ఆర్.వో కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఎస్వీయూలోనూ తరగతులు బహిష్కరించారు. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. -
కాళిదాసు.. కదలదా బస్సు?
పన్నెండు గంటలు ట్రాఫిక్ జామ్ చేతులెత్తేసిన పోలీసులు పదేళ్ల తర్వాత తిరిగి ట్రాఫిక్ కష్టాలు పోలీసుల అతివిశ్వాసమే కారణం సాక్షి, హన్మకొండ : ‘ఎడ్లబండ్లపై వచ్చే ప్రయాణికులు తమ బండ్లకు, ఎడ్ల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అంటించుకోవాలి.. లేకపోతే వాటిని మేడారం జాతరకు అనుమతించం. ఆటోలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి గట్టమ్మ వరకే ఆటోలకు ప్రవేశం.’ అని జాతర మరో వారం రోజులు ఉందగనా జిల్లా యంత్రాంగం చేసిన హడావుడి ఇది. తీరా జాతర ప్రారంభానికి మరో రెండు గంటల ముందే వారి మాటలకు, చేతలకు సంబంధం లేదని తేలిపోయింది. జాతరకు వచ్చే వాహనాలను అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం చేసిన కసరత్తు విఫలమైంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ జామ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కానీ క్లియర్ కాలేదు. పిల్లాపాపాలతో జాతరకు బయల్దేరిన భక్తులు బస్సుల్లోనే జాగారం చేశారు. ఏం చేయాలో పాలుపోక ఇటు మేడారం అటు హన్మకొండల నుంచి ఆర్టీసీ బస్సులకు టిక్కట్ల జారీని నిలిపేశారు. కొంప ముంచిన స్పీడ్‌బ్రేకర్లు : మేడారం వెళ్లే వాహనాలకు పస్రా దగ్గర నుంచి వన్‌వే అమల్లో ఉంది. ప్రైవేటు వాహనాలు ఎడమ వైపునకు మలుపు తీసుకుని మేడారం చేరుకోవాల్సి ఉండగా ఆర్టీసీ బస్సులు నేరుగా తాడ్వాయి వెళ్లాలి. ఇక్కడ వన్‌వే అమలు చేయడంలో భాగంగా ములుగు మీదుగా వచ్చే వాహనాల స్పీడు తగ్గించేందుకు పస్రా దగ్గర తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రయోగం వికటించింది. ఫలితంగా వాహనాల వేగం బాగా నెమ్మదించింది. మంగ ళవారం మధ్యాహ్నం నుంచి మేడారానికి వాహనాల రాక పెరిగింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ తాకిడి ఎక్కువైంది. ముందు వెళ్లే వాహనాల వేగం తగ్గడంతో క్రమంగా బండెనక బండి కలిసి సాయంత్రం ఆరు గంటలకు పస్రా నుంచి వరంగల్ వైపు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమనించిన పోలీసులు రాత్రి ఏడు గంటలకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ల ను తొలగించారు. అప్పటికే వాహనాల రాక అనూహ్యంగా పెరిగింది. స్పీడ్ బ్రేకర్లు తీసినా వెల్లువలా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో పస్రా నుంచి వరంగల్ వైపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరో ప్రయోగం : ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి మేడారం వైపు వచ్చే ట్రాఫిక్‌ను జంగాలపల్లి వద్ద నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి మల్లంపల్లి, వెంకటాపురం రోడ్డులో రామప్ప వరకు వాహనాలు నిలిచిపోయాయి. పస్రా వద్ద తెల్లవారుజామున 4 గంటలకు ట్రాఫిక్ క్లియరైంది. కుదరని సమన్వయం : అర్బన్, రూరల్ పోలీస్ విభాగాల మ ద్య లోపించిన సమన్వ యంతో ట్రాఫిక్ జామైనట్లు తెలు స్తోంది. జాతర బాధ్యతల విషయంలో రూరల్ ఎస్పీ అన్నీ తాైనె వ్యవహరించారు. పాస్‌ల కోసం అర్బన్ విభాగం అధి కారులు, సిబ్బంది రూరల్ ఎస్పీ కార్యాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృి ప్త వ్యక్తం చేశారు. కాగా, జాతర ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌లుగా రూర ల్ అదనపు ఎస్పీ శ్రీకాంత్, అర్బన్ ట్రాఫిక్ డీఎస్పీ రవికుమా ర్ను నియమించారు. ఏమైందోగాని చివరి నిమిషంలో మంగళవారం సాయంత్రం రవికుమార్‌ను బదిలీ చేశారు. విధుల్లో ఇన్‌చార్జ్‌లే : కాజీపేట నుంచి మేడారం వరకు ట్రాఫిక్ విభాగంను 16 సెక్టార్లుగా విభజించారు. సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొందరు డీఎస్పీలతోపాటు సీఐలను నియమించారు. సెక్టార్ల విభ జన, అధికారుల కేటాయింపు పూర్తయిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా బదిలీల పర్వం మొదలైంది. సెక్టార్ల ఇన్ చార్జ్‌లు దాదాపుగా బదిలీ అయ్యారు. బదిలీ ప్రదేశంలో జాయిన్ అయి వచ్చి సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న కొందరు సీఐలు జాతర పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ తలెత్తిన ప్రాంతాల్లో ఇన్చార్జ్ లు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావి స్తోంది. పోలీసు శాఖ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. -
ప్రైవేటు వాహనాల్లో వెళ్లొద్దు..
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు ప్రయాణికులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో విజయనగరం జిల్లా పెంట శ్రీరాంపురం గ్రామస్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో జనం ప్రైవేట్ బస్సులు, వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారన్నారు. పెంట శ్రీరాంపురంలో ఆటోలు ఎక్కినవారికి గ్రామ పెద్దలు రూ.100 జరిమానా వేస్తున్నారని, దీంతో గ్రామస్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని వివరించారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పల్లె వెలుగు బస్సులకు మరమ్మతులు ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సంస్థ ముందుంటుందని పూర్ణచంద్రరావు చెప్పారు. విజయనగరం జోన్లో వెయ్యి వరకు పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయని, వీటికి మరమ్మతులు చేయించటంతోపాటు రంగులు వేయిస్తామని తెలిపారు. వీటిలో ఆక్యుపెన్సీ రేషియోను పెంచాల్సి ఉందని, దీనిపై ప్రయాణికులకు కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. వచ్చే నెల 5 తర్వాత సమ్మె ప్రభావం ఉంటుందని, సంక్రాంతికి బస్సులు తిరగవని కార్మిక సంఘాలు చెబుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా సంస్థను నష్టపరిచే పని కార్మికులు చేయరన్నారు. అందువల్ల పండగకు బస్సులు తిరుగుతాయని, సమ్మె విషయమై కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. సంక్రాంతి బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించగా ఆ సొమ్మును తమ జేబుల్లో వేసుకోమని, సంస్థ అభివృద్ది కోసమే వినియోగిస్తామని అన్నారు. 50 శాతం చార్జీలు పెంచినా ఇంకా 25 శాతం మేర నష్టం వస్తోందన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వోల్వో బస్సులను ఎన్నాళ్లు నడుపుతాయో తెలియదని, అదే ఆర్టీసీ మొదలుపెడితే చివరి వరకూ నడుపుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తొలుత ఈయూ, ఎన్ఎంయూల ప్రతినిధు లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాం ప్లెక్స్ ఆవరణలోని మరుగుదొడ్లు, నాన్‌స్టాప్ కౌంటర్లను ఎండీ పరిశీలించారు. ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ, ఆర్ఎం అప్పడు, డీసీటీఎం జి.సత్యనారాయణ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, కాంప్లెక్స్ ఎస్ఎం బీఎల్పి రావు, ఈయూ ప్రతినిధులు కొర్లాం గణేశ్వరరావు, భానుమూర్తి, సుమన్, శంకరరావు, ఎస్.వి.రమణ, ఎన్ఎంయూ నేత బాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మరో 26 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎండీకి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల వినతి రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఏసీ బస్సుల్లో రాయితీ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాలరావు, సత్తారు భాస్కరరావు తదితరులు వినతపత్రం సమర్పించారు. ప్రస్తుతం రాజధానిలోని జర్నలిస్టులకే దీనిని పరిమితం చేశారన్నారు. అలాగే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌లకు కూడా బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. పరిశీలిస్తామని పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. విజయవాడ-శ్రీకాకుళం ‘వెన్నెల’ బస్సు ప్రారంభం శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : విజయవాడ-శ్రీకాకుళం వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు విలేకరులతో చెప్పారు. విజయవాడలో రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన ఈ బస్సు శనివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది. శనివారం రాత్రి 8.45 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నిత్యం నడిచే ఈ బస్సులో టిక్కెట్ ధర పెద్దలకు రూ.1231, పిల్లలకు 980 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బస్సులో 24 సీట్లు మాత్రమే ఉంటాయి. విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరుల్లో ఆగే ఈ బస్సు సర్వీసును ప్రయాణీకులు వినియోగించుకోవాలని పూర్ణచంద్రరావు కోరారు. -
ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:జిల్లాలో అక్రమంగా నడుపుతున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకు లు డిమాండ్ చేశారు. వోల్వో బస్సు ప్రమాదం తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ప్రైవేటు వాహనాలపై దాడులు జరగకపోవడం శోచనీయమన్నారు. ఈయూ డివిజినల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు మాట్లాడుతూ..కార్మికుల ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు పోరాడతామన్నారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 30 కారుణ్యనియామకాలను చేపట్టారని వివరించారు. ఈయూ రీజినల్ కౌ న్సిల్ అధ్యక్షుడు పి.నానాజీ మాట్లాడుతూ.బస్సుల మెయింటినెన్స్‌ను ప్ర తి రోజూ చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21,22 తేదీల్లో గ్యారేజీ కార్మికులతో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కె.సుమన్, ఎస్.వి.రమణ, పప్పల రాధాకృష్ణ, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికి మేల్కొన్నారు
కర్నూలు, న్యూస్‌లైన్: మృత్యువు చేల‘రేగింది’. 45 మందిని పొట్టన పెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేట్ బస్సు ఘటనతో ఇప్పుడు ఆ వాహనాలంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమోననే చర్చతో వారిలో కదలిక వచ్చింది. అయితే వీరు ఎంతకాలం ఇలా తనిఖీలుతో సంబంధిత యాజమాన్యాలను దారిలోకి తీసుకొస్తారనేది ప్రశ్నార్థకం. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కర్నూలు నగర శివారులోని టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పర్మిట్ల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా తిప్పుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. రీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిప్పుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు రిజిస్ట్రేషన్ల కాగితాలు, డ్రైవర్ల లెసైన్స్‌లతో పాటు అధిక లోడ్ వివరాలను పరిశీలించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాంప్రసాద్ నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు చంద్రబాబు, రమణ, శ్రీనివాసులు, శేషాద్రి, ఏఎంవీఐలు శివలింగయ్య, రాజేశ్వరరావు, రవిశంకర్ నాయక్, నారాయణ నాయక్, కుసుమ, జయశ్రీ, విజయకుమారి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. సహారా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా తనిఖీ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పీయూఎన్ ట్రావెల్స్, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీ టూరిస్ట్ ట్రావెల్స్ వాహనాలను పరిశీలించారు. పర్మిట్ల గడువు ముగిసినట్లు తనిఖీల్లో తేలడంతో కేసులు నమోదు చేశారు. అలాగే రీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మూడు వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా 12 మాసాల్లోపు రిజిస్ట్రేషన్ బదలాయించి నంబర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న(కర్ణాటక) బస్సులను తనిఖీ చేసి రీ అసైన్మెంట్ కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు(మర్చంటైల్ గూడ్స్) టాప్‌పైన అధిక లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసి కేసు కట్టారు. వీటికి సంబంధించి దాదాపు రూ.2 లక్షల అపరాధ రుసుముతో పాటు ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు అప్పగించేందుకు వాహనాలు సీజ్ చేసి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ డిపోకు తరలించారు. అదేవిధంగా నంద్యాలలో ఆర్టీఓ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు, రాజబాబు, శివకుమార్, అనిల్‌కుమార్ నేతృత్వంలో మరో బృందం నంద్యాల జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా డీటీసీ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఇద్దరు డ్రైవర్లను కచ్చితంగా నియమించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. -
రయ్.. రయ్..!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న భోరజ్ చెక్‌పోస్టు మీదుగా గురువారం రాత్రి డైమండ్, కన్కర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు వెళ్తుండగా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. వాటి పర్మిట్లను పరిశీలించగా కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి ఉండగా, స్టేజ్ క్యారేజ్‌గా వెళ్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆర్టీ ఏ అధికారులు ఆ ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. బస్సులను కోర్టుకు తరలించా రు. కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి ఉన్న బస్సులు పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఒకే పార్టీని తీసుకెళ్లాలి. ఈ అనుమతి పొంది ఈ రెండు బస్సులు ప్రయాణికులను తీసుకెళ్తూ నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వయా ఆదిలాబాద్ మీదుగా వెళ్తున్నాయి. విచిత్రమేమిటంటే ఈ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు రోజు ఇదే మార్గం గుండా వెళ్లా యి. పాలమూరు ఘటనతో అధికారులు మేల్కొని సీజ్ చేశారు. లేకపోతే మామూళ్ల మత్తులో జోగేవారు. ఇంకా రోజు తనిఖీలు చేస్తున్నామని, ఏడు నెలల్లో వందకుపైగా కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులే పేర్కొనడం విశేషం. జిల్లాలో 15 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని, అన్నీ కూడా నిబంధనల మేరకు తిరుగుతున్నాయని, పర్మిట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని చెప్పడం కొసమెరుపు. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ట్రావెల్స్ అధికంగా ఉన్నాయి. మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో రైల్వే సదుపాయాలు విస్తృతంగా ఉండడంతో అంతగా లేవు. జిల్లా కేంద్రంలో ముస్కాన్, హెచ్‌కేజీఎన్, జైమాతాదీ, శ్రావణ్, డైమండ్, ఆరేంజ్, వంశీ తదితర ట్రావెల్స్ ఉన్నాయి. వీటిలో పలు ట్రావెల్స్ కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి తీసుకొని యథేచ్ఛగా స్టేజ్ క్యారేజ్‌గా తిరుగుతున్నాయి. కాంటాక్ట్ క్యారేజ్‌లో ఒక్కో సీట్‌కు ప్రతి మూడు నెలలకు రవాణ శాఖకు రూ.874 పన్ను చెల్లించాలి. కేవలం పెళ్లి బృందాలు, విహార యాత్రలకు మాత్రమే వీటిని ఉపయోగించాలి. అయితే కాంటాక్ట్ క్యారేజ్ పర్మిట్‌తో రాత్రి సర్వీసులుగా హైదరాబాద్, నాగ్‌పూర్ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. రెండు రోజులుగా ఆర్టీఏ అధికారులు హల్చల్ చేస్తుండటంతో బస్సులను బయటకు తీయడం లేదు. నాగ్‌పూర్ నుంచి బయలుదేరే డైమండ్ ట్రావెల్స్ బస్సు ఆదిలాబాద్ బస్టాండ్‌లో నిత్యం ప్రయాణికులను తీసుకుని హైదరాబాద్ వెళ్తుంది. దీనికి నేషనల్ పర్మిట్ లేకున్నా మన రాష్ట్రంలో ప్రవేశించి యథేచ్చగా ప్రయాణికులను తీసుకెళ్తుండటం గమనార్హం. ఇక ఆదిలాబాద్ నుంచి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ 30 సీట్లకు అనుమతి తీసుకుని 40 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంటాయి. కానీ, ఈ తతంగం అధికారులకు కనిపించదు. గూడ్స్ ట్రావెల్సే.. ప్రయాణికులను తీసుకెళ్లడంలోనే అడ్డదారులు తొక్కుతున్న ట్రావెల్స్ యజమానులు అవే బస్సు వెనుక భాగంలో ఉన్న క్యాబిన్లలో టన్నుల కొద్ది బరువైన లగేజ్‌ను తరలిస్తూ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వాటితో నిత్యం ఒక్కో బస్సు ద్వారా రూ.15వేల నుంచి రూ.20వేల ఆదాయం గడిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వ్యాపారాలకు ఈ బస్సులు అడ్డాగా మారుతున్నాయి. నిషేధిత గుట్కాలు ఈ బస్సుల్లో తీసుకొస్తుండగా పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. కానీ బస్సులను సీజ్ చేయకుండా మామూలుగా తీసుకొని వదిలిపెట్టారన్న విమర్శలు లేకపోలేదు. ఇలాంటి అక్రమ దందాలతో ఏదైన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు.. మహబూబ్‌నగర్ ఘటన జరగక ముందే అంటే జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వంద ట్రావెల్స్‌లపై కేసులు నమోదు చేయడం జరిగింది. నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. - ప్రవీణ్‌రావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
12 బస్సుల సీజ్
సాక్షి, సంగారెడ్డి: ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లపై ఆర్టీఏ అధికారులు కొరడా జులుపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు శుక్రవారం నిబంధనలు పాటించని 12 బస్సులను సీజ్ చేశారు. ఉదయం 04-08 గంటల మధ్య రవాణా శాఖ ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఐదు, కంది వద్ద ఐదు బస్సులు, చిరాగ్పల్లి బైపాస్ ఒక బస్సు, పటాన్చెరు రహదారిపై ఒక వోల్వో బస్సును సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో కేసినేని, నేట, నకోడా, సహార, సూపర్ ట్రావెల్స్ చెందిన ఒక్కో వాహనం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటపడడానికి ఎమర్జెన్సీ ద్వారం లేకపోవడం, పర్మిట్ లేని ప్రాంతంలో తిప్పుతుండడం, ప్రథమ చికిత్స పెట్టే లేకపోవడం, ప్రత్యామ్నాయం డ్రైవర్ లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం తదితర ఉల్లంఘనలు బయటపడడంతోనే ఈ బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మమతా ప్రసాద్ తెలిపారు. సీజ్ చేసిన బస్సుల యజమానులపై కేసులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. గురువారం జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. -
మండుతున్న ‘అనంత’
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన ఎగిసిపడుతోంది. వైఎస్ఆర్సీపీ, ఏపీ ఎన్జీవోల బంద్ పిలుపుతో రెండో రోజైన శనివారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు, జాక్టో, విద్యుత్, ఆర్టీసీ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్, విద్యార్థి జేఏసీలతో పాటు సామాన్యులు సైతం బంద్‌లో పాలుపంచుకోవడంతో సమైక్య ‘జ్వాలలు’ ఎగిసిపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు బంకులు... సర్వం మూతబడ్డాయి. పైవేట్ వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. జిల్లా గుండా వెళ్లే రాష్ట్ర, జాతీయ రహదారులన్నీ దిగ్బంధించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల పాతటైర్లు, దుంగలు, చెట్ల కొమ్మలు వేసి నిప్పు పెట్టారు. దీంతో రోడ్లన్నీ అగ్నిగుండల్లా మారాయి. అనంతపురం నగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, సమైక్యవాదులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. నగరంలోని అన్ని రోడ్లలో పాతటైర్లకు నిప్పు పెట్టి దిగ్బంధం చేశారు. రాంనగర్ రైల్వే గేటు, రహమత్‌నగర్ రైల్వే బ్రిడ్జి, ఓవర్‌బ్రిడ్జి, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో రైలు పట్టాలపై సమైక్యవాదులు అడ్డురావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వేస్టేషన్‌పై కొందరు రాళ్లు రువ్వారు. రహమత్‌నగర్ రైల్వేబ్రిడ్జిపై గూడ్సురైలును ఆపి రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. జెడ్పీ సమీపంలోని పోస్టుబాక్సుకు నిప్పంటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవో నేతలు బంద్ చేయించారు. తపోవనం సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఎన్జీఓలపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు దాడి చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమన్నారు. దాడికి నిరసనగా ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ నేతలు నిరసన కార్యక్రమం చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంతకల్లు పట్టణంలో రోడ్లపై పాతటైర్లకు నిప్పు పెట్టారు. ఇంధన ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్లు దీక్ష చేశారు. గుత్తిలో జాక్టో, జేఏసీ ఆధ్వర్యంలో గౌతమపురి వికలాంగులు రిలే దీక్షలకు దిగారు. హిందూపురం రైల్వేస్టేషన్లో సమైక్యవాదులు గుంటూరు, కేకే ఎక్స్‌ప్రెస్ రైళ్లను అడ్డుకున్నారు. సమైక్యవాదులకు వైఎస్సాఆర్సీపీ నాయకుడు నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో విద్యుత్ ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. బైక్ ర్యాలీ చేపట్టి... బంద్ విజయవంతం చేశారు. తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట, తనకల్లులో బంద్ సంపూర్ణంగా జరిగింది. కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తపాలా కార్యాలయాన్ని బంద్ చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని జేఏసీ రిలేదీక్షల్లో నేతలు తప్పుబట్టడంతో జీర్ణించుకోలేని ‘తమ్ముళ్లు’ దౌర్జన్యానికి దిగారు. దీంతో జేఏసీ నాయకులు ఆగ్రహించి టీడీపీ శిబిరంలోని పార్టీ జెండాలు తొలగించారు. వేదికను పెకలించివేశారు. అమరాపురంలో ఎంపీ హర్షకుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మడకశిర, రొళ్ల, గుడిబండలో బంద్ విజయవంతమైంది. పుట్టపర్తి, నల్లమాడ బుక్కపట్నం, కొత్తచెరువులో బంద్ విజయవంతమైంది. ఓడి చెరువులో వినూత్న రీతిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పెనుకొండ, రాయదుర్గంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు మానవహారం నిర్మించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు లారీల రాకపోకలను అడ్డుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రిలేదీక్షలు చేశారు. రాయలచెరువులో రైల్‌రోకో చేశారు. ఉరవకొండ పట్టణంలోని బళ్లారి-అనంతపురం రహదారిని విద్యార్థులు దిగ్బంధించారు. గతంలో కేసీఆర్ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని జేఏసీ నేతలు, సమైక్యవాదులు ధ్వంసం చేశారు. బెళుగుప్ప మండల కాంగ్రెస్ కన్వీనర్, మాజీ జెడ్పీటీసీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిపి దాదాపు 180 మంది అధికార పార్టీకి రాజీనామా చేశారు. కూడేరులో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ, బంద్ చేపట్టారు. -
ప్రయాణికులకు సమైక్య సెగ
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. దాదాపు 18 రోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ఆ సంస్థ కార్మికులు సైతం ఉద్యమబాట పట్టడంతో జనం ప్రైవేటు వాహనాలు, రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు రెట్టింపునకు పైగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. దీంతో రోజువారీ రైళ్లలో ప్రయాణం చేసేవారి కన్నా 80 శాతం మంది ప్రజలు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లలో చోటు సరిపడక, గంటల తరబడి నిలబడి గమ్యానికి చేరుకోవటానికి ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మచిలీపట్నం-విజయవాడ, నరసాపూర్-గుంటూరు ప్యాసిం జరు, మచిలీపట్నం-విశాఖపట్నం, భీమవరం-గుడివాడ ప్యాసింజరు రైళ్లు నడుస్తుండగా అన్నీ కిక్కిరిసిన వెళ్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే గుడివాడ నుంచి రోజుకు సుమారు ఏడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగింది. రైల్వేస్టేషన్‌లోని టిక్కెట్ కౌంటర్లు సైతం ప్రయాణికులు టిక్కెట్ల కోసం క్యూ కట్టడంతో వారు టిక్కెట్ తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడునన్ని సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. మరోపక్క కిక్కిరిసిన రైళ్లలోకి ఎక్కలేక చాలామంది స్టేషన్లోనే ఉండిపోతున్నారు. ఇక పిల్లలతో ప్రయాణాలు చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రైలు మార్గంలేని గ్రామాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనాల దోపిడీ.. సమైక్య ఉద్యమాన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు వాహనదారుల దోపిడీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్లు గుడివాడ-విజయవాడకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. రైళ్లు మాత్రం ఒకటి రెండు తిరగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అదనపు వేళల్లో రైళ్లను నడిపితే ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారని కోరుతున్నారు. -
ప్రైవేటు వాహనాల ‘డబ్బు’ల్ దోపిడీ
చోడవరం,న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్ని ఇబ్బందులుకైనా ఓర్చి జనమంతా ఆందోళనలు, బంద్‌లు చేస్తుంటే... మీరు అధిక వసూళ్లు చేయడం న్యాయమా? అంటూ ప్రయాణికులు ఆటో, ట్రక్కర్, ఇతర రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. అయినా వీరు డబుల్ ఛార్జీలు గుంజడమే పనిగా పెట్టుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎక్కడికక్కడే ఆందోళనలు చేయడంతో కొద్ది రోజులుగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అసలే వరలక్ష్మీదేవి వ్రతాలు, పెళ్లిళ్లు జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ సమ్మె, ఆందోళనల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం పదిరోజుల తర్వాత రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్దరణ కావడంతో జనమంతా తమ పనులు, శుభకార్యాలకు రాకపోకలు ప్రారంభించారు. ఆటోలు, మ్యాక్సీ వ్యాన్లు, ట్రక్కర్లు వంటి ప్రైవేటు వాహనాలు జోరుగా తిరిగాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఈ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార కేంద్రం చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం వంటి ప్రధాన పట్టణాలతో పాటు మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం, బుచ్చెయ్యపేట, సబ్బవరం ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదార్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు గుంజేస్తున్నారు. విశాఖపట్నంకు సాధారణ చార్జీ రూ.35 కాగా ఇప్పుడు రూ.100, అనకాపల్లికి రూ.12 కాగా 25లు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాలకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం మినహా ఆయిల్, ఇతర ఛార్జీలు ఏమీ పెరగలేదు. అయినప్పటికీ ఆటో, ట్రక్కర్, ఇతర ప్రయాణ వాహనాల డ్రైవర్లు ఇంత మొత్తంలో దోపిడీకి పాల్పడుతున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం ప్రజలంతా కలిసి చేస్తుంటే ఈ ప్రైవేటు వాహనాల నిర్వాహకులు మాత్రం జనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణాలు తప్పక పోవడంతో డబుల్ ఛార్జీలు ఇచ్చైనా వెళ్లాల్సి వస్తుందని చాలా మంది ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ తరుణంలో సమైక్య జేఎసీ నాయకులు, ఆటో, కార్లు, ట్రక్కర్ స్టాండ్ల సంఘాలు చర్యలు తీసుకోలని, లేనిపక్షంలో పోలీసులైనా చొరవ తీసుకొని అక్రమ ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.