- యూత్రికులకు అరకొరగా ఆర్టీసీ బస్సులు
- ఇదే అదనుగా చార్జీలు పెంచేసిన ప్రైవేట్ వాహనదారులు
- టీ, టిఫిన్, వాటర్ బాటిల్ ధరలకు రెక్కలు
- పట్టించుకోని యంత్రాంగం.. ప్రయూణికుల లబోదిబో
ఉంగుటూరు : పుష్కర యాత్రికులు నిలుపు దోపిడీకి గురవుతున్నారు. పుష్కరాలకు వెళ్లే యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారికి అనుగుణంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా అవి కానరావడం లేదని ప్రయూణికులు చెబుతున్నారు.
ధరలకు రెక్కలు
పుష్కరాల పేరుతో వాటర్ బాటిల్ నుంచి టిఫిన్ సెంటర్ల వరకు అన్నింటి ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఉంగుటూరు మండలంలో పుష్కర ఘాట్లేవి లేకపోరుునా ప్రయూణికులు పెద్ద సంఖ్యలో ప్రయూణిస్తుండడంతో జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణాల్లో ధరలను అమాంతంగా పెంచేశారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 కాగా ఇప్పుడు రూ. 25 నుంచి రూ.30 వరకు విక్రరుుస్తున్నారు.
కాఫీ హోటల్‌లో టిఫిన్ రేట్లు గతంలో నాలుగు ఇడ్లీ రూ. 12 తీసుకోగా ఇప్పుడు రూ.25 వసూలు చేస్తున్నారు. భోజనం ధర రూ. 50 నుంచి రూ.100కు పెరిగిపోరుుంది. ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం ఆటో చార్జి గతంలో రూ.7 ఉండగా నేడు రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. బస్సులు అరకొరగా ఉండడంతో అధిక చార్జి సమర్పించుకుని ప్రయణించాల్సి వస్తోంది.
నిలువు దోపిడీ
Published Tue, Jul 21 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement
Advertisement