Pushkarni pilgrims
-
సీఎం పర్యటనతో భక్తుల పాట్లు
- పోలవరం రహదారిపై 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేత - తీవ్ర ఇబ్బందులు పడిన యూత్రికులు పోలవరం/పోలవరం రూరల్/పుష్కరఘాట్ (కొవ్వూరు) : పోలవరం మండలంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుష్కర యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేయడంతో పుష్కర స్నానాలు చేసేందుకు వెళుతున్న భక్తులు అవస్థలు పడ్డారు. పట్టిసీమ రేవుకు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా రెండున్నర గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్దకు వెళ్లి తిరిగి 1.45 గంటలకు వెంకటాపురం వచ్చి హెలికాఫ్టర్‌లో సీఎం వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటనతో పోలీసులు ఉదయం 9.30 నుంచి పోలవరం-కొవ్వూరు రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు.పోలవరం నుంచి పట్టిసీమ వైపు వెళ్లే వాహనాలను పోలవరంలోను, తాళ్లపూడి నుంచి పోలవరం వైపు వచ్చే వాహనాలను కన్నాపురం అడ్డ రోడ్డు వద్ద, పట్టిసీమకు కొయ్యలగూడెం వైపు నుంచి వచ్చే భక్తులను వెంకటాపురం వద్ద నిలిపి వేశారు. దీంతో భక్తులు కొవ్వాడ కాలువ గట్లపై నుంచి, ఆర్ అండ్‌బీ రోడ్డుపై కాలినడకన గమ్యస్థానాలకు చేరుకున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా పుష్కరస్నానం చేసిన తరువాతే టిఫిన్ చేస్తామనే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగించగా సీఎం బందోబస్తు వల్ల నాలుగు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ఆకలితో అలమటించారు. కొందరు భక్తులు విసుగుచెంది వెనుదిరిగారు. జిల్లా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అత్యంత ప్రేమ కురిపిస్తూ తరచూ ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తుండడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయూరు. సీఎం వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్‌ను నిలిపేయడమే కాక దుకాణాలను సైతం మూరుుంచేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎందుకో.. ఇవెందుకో
- పుష్కరాల పేరిట రూ.కోట్లు వృథా - అక్కరకు రాని నిర్మాణాలు - యాత్రికులకు ఉపయోగపడని విశ్రాంతి షెడ్లు - తమ్ముళ్ల జేబుల్లోకి పుష్కర నిధులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : కొవ్వూరు పట్టణానికి పుష్కర యాత్రికులు లక్షలాదిగా పోటెత్తి వస్తున్నారు. కనీస వసతి సౌకర్యాలు లేక రోడ్లు, పేవ్మెంట్లపై నిద్రిస్తున్నారు. అలాగని వారికోసం ఏర్పాట్లేమీ చేయలేదనుకుంటే తప్పులో కాలేసినట్టే. యాత్రికుల కోసం షెడ్లు వంటివి నిర్మించినా అవి వారికి అక్కరకు రావడం లేదు. వందలాది కోట్ల రూపాయల పుష్కర నిధులను కాంట్రాక్టర్ల ముసుగులో అంది నంత దోచుకున్న తెలుగుతమ్ముళ్లు కనీసం ఆ నిర్మాణాలను యాత్రికులకు ఉపయోగపడే విధంగా చేపట్టలేదు. పుష్కరాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నా ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు, ప్రాజెక్టులు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. కేవలం కాంట్రాక్టుల పేరిట సొమ్ము చేసుకునేందుకే ఆ పనులు చేపట్టడం వల్ల కనీసమాత్రం కూడా పుష్కర భక్తులకు ఉపయోగం లేకుండా పోయాయి. కొవ్వూరు మునిసిపాలిటీ రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయంటే.. అవి ఎంతదూరంలో ఏర్పాటు చేశారో, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తగిన చోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించకపోవడం ప్రధాన సమస్య కాగా, అక్కడ అరకొర వసతులు కల్పించి చేతులు దులుపుకోవడంతో ప్రజాధనం వృథా అయింది. ఘాట్లకు, పట్టణానికి సమీపంలోని ప్రదేశాలను విస్మరించి అక్కరకు రాని స్థలాల్లో షెడ్లు నిర్మాణం చేయడం వల్ల గడచిన వారం రోజుల్లో కేవలం పదుల సం ఖ్యలో భక్తులు మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. కొవ్వూరు పట్టణంలోని పాత బైపాస్ రోడ్డు, పుష్కరనగర్, ఆంధ్రా షుగర్స్ కర్మాగారాల మధ్య మొత్తం మూడు ప్రదేశాల్లో ప్రయాణికుల విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ప్రయాణికులు బస చేసేందుకు అనువుగా షెడ్లలో ఫ్యాన్లు, లైట్లతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, సామాన్లు భద్రపరుచుకునే లాకర్లు, జనరేటర్ సదుపాయం వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఏ ఒక్కచోట పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ షెడ్లు యాత్రికులకు అక్కరకు రావడం లేదు. కానీ.. ఈ నిర్మాణాల పేరిట కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ నేతల జేబులు మాత్రం నిండిపోయాయి. ఎవరి కోసం ఆ కార్యక్రమాలు కొవ్వూరు పట్టణంలో శివారు ప్రాంతమైన హేవలాక్ బ్రిడ్జి పక్కన రైల్వే స్థలంలో సమాచార పౌర సంబంధాల శాఖ భారీఎత్తున ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఎవరి కోసం.. ఎందుకోసం అన్న ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు. మొత్తం సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు, ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలతో ఓ ఇంటి మాదిరిగా నిర్మించిన స్టాల్ పేరిట రూ.లక్షలు ఖర్చు చేశారు. స్టాల్ నిర్మాణం కోసం స్థలాన్ని చదును ఖర్చులకే పెద్దమొత్తంలో ఖర్చయ్యింది. జనాలు రానిచోట ఆ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశారన్న దానిపై అధికారులు నోరు మెదపడం లేదు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఇదే స్థలంలో ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలు కనీసం పట్టుమని పదిమంది వీక్షకులు కూడా లేక వెలవెలబోతున్నాయి. అక్కడ స్థలంలో తుప్పలు తొలగించి, మెయిన్ రోడ్డు నుంచి కళావేదికకు అప్రోచ్ రోడ్డు వేసేందుకు టీటీడీకి రూ.మూడు లక్షలు, మునిసిపాలిటీకి మరో రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. నిత్య కార్యక్రమాల నిర్వహణ, ఇతరత్రా ఏర్పాట్లకు చాలా వ్యయమవుతోంది. కానీ అక్కడ ధార్మిక వ్రవచనాలు, భజనలు, భక్తి సంగీతాలు, హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు. ‘ఇక్కడ కళాకారులం మేమే.. ప్రేక్షకులం కూడా మేమే..’ అని టీటీడీకి చెందిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల పుష్కర నిధులను అడ్డగోలుగా ఖర్చు చేశారనేందుకు విశ్రాంతి షెడ్లు, సమాచార పౌర సంబంధాల శాఖ స్టాల్, టీటీడీ కళావేదికలు కళ్ల ముందు కనపడుతున్న ఉదాహరణలు. -
7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది
కొవ్వూరు : జిల్లాలో పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి జిల్లాలోని 97 ఘాట్లలో 13,31,038 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 7,54,128 మంది, నరసాపురం డివిజన్లోని మూడు మండలాల్లో 3,07,177 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 2,69,728 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో 2.26 లక్షల మంది యాత్రికులు స్నానాలు ఆచరించినట్టు లెక్కగట్టారు. పుష్కరాలు మొదలయ్యాక 7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది జిల్లాలోని ఘాట్లలో స్నానాలు నిర్వహించినట్టు లెక్క తేల్చారు. -
నిలువు దోపిడీ
- యూత్రికులకు అరకొరగా ఆర్టీసీ బస్సులు - ఇదే అదనుగా చార్జీలు పెంచేసిన ప్రైవేట్ వాహనదారులు - టీ, టిఫిన్, వాటర్ బాటిల్ ధరలకు రెక్కలు - పట్టించుకోని యంత్రాంగం.. ప్రయూణికుల లబోదిబో ఉంగుటూరు : పుష్కర యాత్రికులు నిలుపు దోపిడీకి గురవుతున్నారు. పుష్కరాలకు వెళ్లే యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారికి అనుగుణంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా అవి కానరావడం లేదని ప్రయూణికులు చెబుతున్నారు. ధరలకు రెక్కలు పుష్కరాల పేరుతో వాటర్ బాటిల్ నుంచి టిఫిన్ సెంటర్ల వరకు అన్నింటి ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఉంగుటూరు మండలంలో పుష్కర ఘాట్లేవి లేకపోరుునా ప్రయూణికులు పెద్ద సంఖ్యలో ప్రయూణిస్తుండడంతో జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణాల్లో ధరలను అమాంతంగా పెంచేశారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 కాగా ఇప్పుడు రూ. 25 నుంచి రూ.30 వరకు విక్రరుుస్తున్నారు. కాఫీ హోటల్లో టిఫిన్ రేట్లు గతంలో నాలుగు ఇడ్లీ రూ. 12 తీసుకోగా ఇప్పుడు రూ.25 వసూలు చేస్తున్నారు. భోజనం ధర రూ. 50 నుంచి రూ.100కు పెరిగిపోరుుంది. ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం ఆటో చార్జి గతంలో రూ.7 ఉండగా నేడు రూ.15 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. బస్సులు అరకొరగా ఉండడంతో అధిక చార్జి సమర్పించుకుని ప్రయణించాల్సి వస్తోంది.