7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది
కొవ్వూరు : జిల్లాలో పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి జిల్లాలోని 97 ఘాట్లలో 13,31,038 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 7,54,128 మంది, నరసాపురం డివిజన్‌లోని మూడు మండలాల్లో 3,07,177 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 2,69,728 మంది పుష్కర స్నానాలు ఆచరించారు.
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో 2.26 లక్షల మంది యాత్రికులు స్నానాలు ఆచరించినట్టు లెక్కగట్టారు. పుష్కరాలు మొదలయ్యాక 7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది జిల్లాలోని ఘాట్లలో స్నానాలు నిర్వహించినట్టు లెక్క తేల్చారు.