సీఎం పర్యటనతో భక్తుల పాట్లు
- పోలవరం రహదారిపై 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేత
- తీవ్ర ఇబ్బందులు పడిన యూత్రికులు
పోలవరం/పోలవరం రూరల్/పుష్కరఘాట్ (కొవ్వూరు) : పోలవరం మండలంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుష్కర యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేయడంతో పుష్కర స్నానాలు చేసేందుకు వెళుతున్న భక్తులు అవస్థలు పడ్డారు. పట్టిసీమ రేవుకు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా రెండున్నర గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్దకు వెళ్లి తిరిగి 1.45 గంటలకు వెంకటాపురం వచ్చి హెలికాఫ్టర్‌లో సీఎం వెళ్లారు.
ముఖ్యమంత్రి పర్యటనతో పోలీసులు ఉదయం 9.30 నుంచి పోలవరం-కొవ్వూరు రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు.పోలవరం నుంచి పట్టిసీమ వైపు వెళ్లే వాహనాలను పోలవరంలోను, తాళ్లపూడి నుంచి పోలవరం వైపు వచ్చే వాహనాలను కన్నాపురం అడ్డ రోడ్డు వద్ద, పట్టిసీమకు కొయ్యలగూడెం వైపు నుంచి వచ్చే భక్తులను వెంకటాపురం వద్ద నిలిపి వేశారు. దీంతో భక్తులు కొవ్వాడ కాలువ గట్లపై నుంచి, ఆర్ అండ్‌బీ రోడ్డుపై కాలినడకన గమ్యస్థానాలకు చేరుకున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా పుష్కరస్నానం చేసిన తరువాతే టిఫిన్ చేస్తామనే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగించగా సీఎం బందోబస్తు వల్ల నాలుగు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ఆకలితో అలమటించారు.
కొందరు భక్తులు విసుగుచెంది వెనుదిరిగారు. జిల్లా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అత్యంత ప్రేమ కురిపిస్తూ తరచూ ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తుండడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయూరు. సీఎం వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్‌ను నిలిపేయడమే కాక దుకాణాలను సైతం మూరుుంచేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.