సమ్మెతో క్షతగాత్రులకు అందని వైద్యం | Medical drought because of 108 employees strike | Sakshi
Sakshi News home page

సమ్మెతో క్షతగాత్రులకు అందని వైద్యం

Published Fri, May 15 2015 11:40 PM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

Medical drought because of 108 employees strike

డీజిల్ లేదని తరలించని 108 తాత్కాలిక సిబ్బంది
 
 అల్లాదుర్గం రూరల్ : 108 సిబ్బంది సమ్మెతో క్షతగాత్రులకు వైద్యం అందడం లేదు. ప్రాణాపాయ స్థితితో ఉన్న మహిళను సంగారెడ్డికి తరలించాల్సి ఉండగా డీజిల్ లేదని తాత్కాలిన 108 సిబ్బంది వాహనం నుంచి దింపి వేసిన సంఘటన అల్లాదుర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెద్దశంకరంపేట మండలం బద్దారం గ్రామానికి చెందిన గాజుల తులశమ్మపై దాడి జరగడంతో ప్రైవేటు వాహనంలో శంకరంపేట తీసుకువచ్చారు. 108కు ఫోన్ చేయగా అల్లాదుర్గంలో ఉందని చెప్పడంతో అదే వాహనంలో అల్లాదుర్గం తరలించి 108లో ఎక్కించారు. పరస్థితి అందోళన కరంగా ఉండటంతో సంగారెడ్డికి తరలించాలన్నారు. వాహనంలో ఉన్న డీజిల్ జోగిపేట వరకే సరిపోతుందని,  సంగారెడ్డికి చెరుకోలేదని 108 డ్రైవర్ అనడంతో ఆమెను దింపి ప్రైవేట్ వాహనంలో తరలించారు.  సిబ్బంది సమ్మె చేసినా వాహనాలను నడుపుతున్నట్లు యాజమాన్యం చెబుతున్నా క్షతగాత్రులకు మాత్రం వైద్యం అందడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement