కాకినాడ: కూటమి ప్రభుత్వంలోని నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించితూనే ఉన్నాయి. కాకినాడలో జనసేన నేతల భూకబ్జా బాగోతం తాజాగా వెలుగుచూసింది. కాకినాడు రూరల్‌లో ఎమ్మెల్యే పంతం నానాజీ(Pantham Nanaji) అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలో కోటుల విలువ చేసే లే అవుట్ ప్లాట్లు కబ్జా(Land Grabbing) చేశారు. జనసేన నేత పుల్లా శ్రీరాములు కోట్లు విలువ చేసే భూమికి కబ్జా చేశారు. తన భూమిని జనసేన నేత పుల్లా శ్రీరాములు కబ్జా చేశారని కలెక్టర్, ఎస్పీలకు మాధవపట్నంకు చెందిన గుత్తుల జాన్సన్ కుటుంబం ఫిర్యాదు చేసింది.
పోస్టల్ ఎంప్లాయిస్ సొసైటీ లేవుట్‌లో 658 గజాల భూమిని 2008-09లో రెండు ప్లాట్లుగా కొనుగోలు చేసింది జాన్సన్ కుటుంబం. అప్పటినుండి ఆ భూమి తనదే అంటూ శ్రీరాములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే కోర్టును ఆశ్రయించారు. బాధితులు.
మళ్లీ ఇటీవల తన అనుచరులతో జాన్సన్‌కు చెందిన ప్లాట్లను ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆ కాంపౌడ్ వాల్‌ను తన మనుషులతో కూలగొట్టించింది జాన్సన్ కుటుంబం. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
రెచ్చిపోతున్నపంతం నానాజీ అనుచరులు
కాకినాడ లో కాకినాడలో ఎమ్మెల్యే నానాజీ అనుచరులు రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం మత్స్యకారుల(Fishermen) దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ. 10 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు.
అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా జరగ్గకపోతే దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.
అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment