
సాక్షి, తూర్పుగోదావరి : ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ, అలాంటి ఘటనే కాకినాడ రూరల్ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది. రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్‌లో గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్‌షాఫ్ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు.
అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈక్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment