Bicycle Shop
-
రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి : ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాలకోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయలకోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. కానీ, అలాంటి ఘటనే కాకినాడ రూరల్ వలసపాకలో ఆదివారం చోటుచేసుకుంది. రూ.2 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్లో గాలి పెట్టుకునేందుకు సాంబ సైకిల్షాఫ్ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు. అయితే, అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈక్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరావుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
సైకిల్ పంక్చర్లు వేసే వ్యక్తి ఆదాయం 100 కోట్లు
-
వ్యవసాయ కూలి నుంచి ఎంపీపీగా..
చిట్యాల : కాలం కలిసొచ్చింది. కూలి మని‘షి’ని అదృష్టం వరించింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నిన్న మొన్నటి వరకు భర్తకు తోడుగా కూలి పనిచేస్తూ ఆర్థిక అవసరాల్లో అండగా నిలుస్తూ ఇంటిని చక్కదిద్దుకునే ఆమె... ఇప్పటి నుంచి మండలస్థాయి పాలనకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని టేకుమట్ల గ్రామంలో బందెల నరేష్, స్నేహలత దంపతులది సాదాసీదా కుటుంబం. వీరికో పాప ఉంది. ఈ ముగ్గురే కాకుండా నరేష్ అమ్మానాన్న, తమ్ముడు కూడా వీరితోనే ఉంటారు. కాగా, నరేష్ గ్రామంలో సైకిల్షాపు నిర్వహిస్తున్నాడు. అలాగే తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న స్నేహలత ఇంటిపనులకే పరిమితం కాకుండా భర్తకు ఆసరాగా ఉండాలనుకుంది. ఇందులో భాగంగా భర్తతోపాటు రోజు వ్యవసాయ పనులు చేస్తోంది. అయితే వీరికి కొద్దిపాటి భూమి మాత్రమే ఉండడంతో రోజూ పని ఉండకపోయేది. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తుండేది. ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త మలుపు తిప్పాయి. అచ్చొచ్చిన రిజర్వేషన్లు స్నేహలతను ప్రజాప్రతినిధిని చేశాయి. టేకుమట్ల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించాయి. అంతేనా... మండల పరిషత్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాయి. మొన్నటివరకు తమతో కూలి పనికి వచ్చిన స్నేహలత ఎంపీపీగా ఎన్నిక కావడం పట్ల ఆమెతో పరిచయం ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.