సామాజిక స్థలాన్ని కాపాడండి | public site issue | Sakshi
Sakshi News home page

సామాజిక స్థలాన్ని కాపాడండి

Published Tue, Oct 25 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

public site issue

  • కన్నబాబును ఆశ్రయించిన సత్యదుర్గానగర్‌ మహిళలు
  • కాకినాడ రూరల్‌ :
    తూరంగి సత్యదుర్గానగర్‌లో సామాహిక స్థలాన్ని జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న దుర్గామహేశ్వరరావు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, మహిళలపై దౌర్జన్యానికి దిగేందుకు సిద్ధపడుతున్నాడంటూ మంగళవారం ఆ ప్రాంత మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును కలసి తమ బాధను వెల్లడించారు. గతంలో  మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ స్థలం ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి ఆ స్థలంలో కమ్యూనిటీ భవనం కడతామని చెప్పారని వివరించారు. అప్పటి నుంచి ప్రభుత్వ నిధులతో కమ్యూనిటీ భవనం కడతారని ఎదురుచూస్తున్నామన్నారు. ఏడాదిన్న క్రితం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి గ¯ŒSమె¯ŒSగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని ఇంటిని నిర్మించుకుంటానని చెప్పి ట్రాక్టర్‌ మట్టి తీసుకొచ్చి అక్కడ వేయగా ప్రజలంతా నిలదీయడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారని వివరించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఈ స్థలాన్ని తనకు అమ్మాడంటూ జన్మభూమి కమిటీ సభ్యుడు దుర్గామహేశ్వరరావు భూమిలోకి వచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని తెలిపారు. ఈ సామాజిక స్థలాన్ని ఎవరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటామని, మీ సహకారం కూడా అందజేయాలంటూ కన్నబాబును మహిళలు అభ్యర్థించారు. కన్నబాబు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గతంలో జరిగిన విషయాలను వివరించారు. సామాజిక స్థలం ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. కన్నబాబును కలిసిన వారిలో మత్స్యకార నాయకులు గంగాచలం, స్థానిక మహిళలు శేరు వీరవేణి, చీకట్ల లక్ష్మి, రాయుడు అనసూయ, గేదెల దుర్గ ఉన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement