- అది టీడీపీ జిల్లా కార్యాలయం...
- సమయం: శుక్రవారం ఉదయం 11 గంటలు
- లైట్‌గా చినుకులు పడుతున్నాయ్...
ఏపీ 5DA నంబర్‌తో తెలుగురంగు స్కార్పియో వాహనం ఎమ్మెల్యే కాకినాడ రూరల్ అనే స్టిక్కర్‌తో దూసుకొచ్చింది. అంతా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వచ్చారనుకున్నారు.. తీరా డోర్ తెరిచి వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో ఆమె భర్త పిల్లి సత్తిబాబు దిగారు. వెంటనే ఆయనకు పక్కన ఉన్న గన్‌మెన్ గొడుగు పట్టాడు. ఇది చూసినవారంతా ‘ఓర్ని...ఎమ్మెల్యే ‘పతి’ గారు ఏం బిల్డప్ ఇచ్చార్రా బాబూ! అని ఆశ్చర్యపోయారు.
ఆలిది అధికారం... పెనిమిటి పెత్తంన అనే మాట కాకినాడ రూరల్ మండలంలో విస్తృతంగా వినిపిస్తున్నా... ఎమ్మెల్యే భర్త హడావుడి ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే అయిన భార్యను ఇంటికి పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.