pilli anantalakshmi
-
ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లకు తలపోటుగా మారింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీలో నంబర్–2గా చలామణీ అవుతున్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు రూరల్ పారీ్టలో అగ్గి రాజేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారిద్దరూ నియోజకవర్గంలో నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అతిథి పాత్ర పోషిస్తున్నారు. పారీ్టలో వర్గాలకు ఊతమిస్తున్నారు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు చివరకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పించే దశకు చేరింది. చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు తద్వారా ఆమెకు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)కు చెక్ పెట్టాలని రాజప్ప వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తనకు అనుకూలుడైన నాయకుడిని నియమించుకోవాలనేది రాజప్ప వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన తెర వెనుక చాలాకాలంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లి దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ అధిష్టానం వద్ద యనమల పట్టుబడుతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా పిల్లి వర్గానికి వెన్నుదన్నుగా ఉండేవారు. భాస్కర రామారావు మరణానంతరం సత్తిబాబు వర్గానికి పార్టీలో యనమల ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు. చంద్రబాబుకు సత్తిబాబు వైరి వర్గం ఫిర్యాదు సత్తిబాబును వ్యతిరేకించే నాయకులందరూ తాజాగా ఒక్కటయ్యారు. సత్తిబాబు దంపతులను పార్టీ ఇన్చార్జిగా తప్పించాలనేదే వారందరి ఉమ్మడి లక్ష్యం. ఇదే అవకాశంగా రాజప్ప వర్గీయులు తెర వెనుక పావులు కదుపుతున్నారని ఆ పార్టీలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా సత్తిబాబును వ్యతిరేకించే రూరల్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్తిబాబు పార్టీ కోసం ఏ కోశానా పని చేయడం లేదని వారు ఆధారాలతో నివేదించారు. కాకినాడ కార్పొరేషన్లో పలు డివిజన్లకు ఉప ఎన్నికలు జరిగాయి. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో సత్తిబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన అంగీకారంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చంద్రబాబుకు నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఇటీవలి కాకినాడ కార్పొరేషన్ ఉప ఎన్నికల వరకూ పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా చేసి, టీడీపీకి సత్తిబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సత్తిబాబు దంపతులను ఇన్చార్జిగా ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును గట్టిగానే నిలదీశారని సమాచారం. వారిని ఇన్చార్జిగా తప్పించకుంటే రూరల్‌లో పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందనే వాదనను బాబు ముందుకు తీసుకువెళ్లారు. మరోపక్క ఇటీవల పార్టీ పిలుపు మేరకు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ఇరు వర్గాలూ విడివిడిగానే ధర్నాలు చేయడం గమనార్హం. పేరాబత్తుల రాజశేఖర్, మామిడాల వెంకటేష్, పెంకే శ్రీనివాసబాబా తదితర నేతలను చినరాజప్ప వర్గం ఎగదోస్తోందని పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను తప్పించి, సొంత సామాజికవర్గానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే వ్యూహంలో భాగంగానే రాజప్ప ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. టీ కప్పులో తుపానేనా! గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు, వివాదాలు కాకినాడ రూరల్ టీడీపీలో జరిగాయి. అయితే అవి టీ కప్పులో తుపాను మాదిరిగానే చల్లారిపోయాయి. ఇన్చార్జిగా తప్పుకొని, కార్యకర్తగా కొనసాగుతానని సత్తిబాబు గతంలో ఒక సందర్భంలో పత్రికా ముఖంగా ప్రకటించడం తెలిసిందే. కానీ అంతలోనే ప్లేటు ఫిరాయించేశారు. అధిష్టానం మాట ప్రకారం కొంత కాలం కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గంపై పెత్తనం కోసమే చినరాజప్ప, ఆయన వర్గం తెర వెనుక ఇదంతా జరిపిస్తున్నారని ఆ సందర్భంగా సత్తిబాబు పేర్కొనడం గమనార్హం. అప్పటి నుంచి శుక్రవారం నాటి చంద్రబాబు భేటీ వరకూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. రూరల్ నియోజకవర్గ పార్టీ సమీక్షకు సత్తిబాబు దంపతులు గైర్హాజరయ్యారని అంటున్నారు. మరోపక్క సత్తిబాబు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో ఆయన పెత్తనం లేకుండా చేయాలనే గట్టి పట్టుదలతో వైరి వర్గానికి చినరాజప్ప వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో అధిష్టానం కూడా ఇన్చార్జి మార్పునకే మొగ్గు చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న నేతలందరూ కట్ట కట్టుకుని మరీ వెళ్లి సత్తిబాబు దంపతులపై ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబు ముందు పెట్టడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అయితే ఇన్చార్జి మార్పునకు చంద్రబాబు “ఊ అంటారా.. ఉఊ అంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ప్రజా వ్యతిరేకతతో ప్రతిపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జిల్లాలో పిల్లిమొగ్గలు వేస్తోంది. అధికారం కోల్పోయినా ఆధిపత్య పోరులో మాత్రం తెలుగు తమ్ముళ్లు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇటీవలే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారం రోజుల పాటు అలకపాన్పు ఎక్కినట్టే ఎక్కి ఒక్కసారే కిందకు దిగిపోయారు. అధినేత చంద్రబాబు నుంచి అవమానాలు, సీనియర్ అయిన తనను పట్టించుకోకపోవడం, అనుచరులకు పదవులు ఇవ్వకపోవడం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గం రాజమహేంద్రవరం సిటీలో జోక్యం చేసుకోనివ్వడం లేదనే కారణాలతో ఎమ్మెల్యేతో పాటు, పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు లీకుల మీద లీకులు ఇచ్చారు. చివరకు ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు రాజీ‘డ్రామా’తో వెనక్కు తగ్గారు. బుచ్చయ్య కోరికలు ఏ మేరకు నెరవేరాయో ఆయనకు, పార్టీ పెద్దలకే తెలియాలి. రాజమహేంద్రవరం రూరల్‌లో పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో కాకినాడ రూరల్‌లో తిరిగి మొదలైన ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. చాలాకాలంగానే వివాదం వాస్తవానికి కాకినాడ రూరల్ టీడీపీలో వివాదం ఈనాటిది కానే కాదు. రూరల్ ఇన్చార్జి పిల్లి అనంతలక్ష్మి, వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు)ను మార్చాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల తరువాత మొక్కుబడిగా ఉంటున్న ఇన్చార్జిని మార్చేయాలని వైరిపక్షం ఏడాది క్రితం గట్టి పట్టే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తానన్నా గాలికొదిలేశారని పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా మొదటి నుంచీ తనను వ్యతిరేకించే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆడిస్తున్న ఆట అంటూ సత్తిబాబు, ఆయన వర్గీయులు విమర్శలకు దిగారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి రాజప్ప బరిలోకి దిగే ఎత్తుగడతోనే తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని సత్తిబాబు వర్గం ఆరోపించింది. ఈ క్రమంలోనే రూరల్ బాధ్యతలకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తగా కొనసాగుతానంటూ సత్తిబాబు దంపతులు అప్పట్లో ప్రకటించారు. వారిని సత్తిబాబుకు రాజకీయ గురువైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ బుజ్జగించారు. కొంత కాలం కొనసాగేలా ఒప్పించి ఆ వివాదానికి అప్పట్లో తెర దించారు. టీడీపీ కాకినాడ రూరల్ ఇన్చార్జిని మార్చాలంటూ ఇటీవల చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్న మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, చలపతి, విత్తనాల గోపాల్ తదితరులు సత్తిబాబుపై చంద్రబాబుకు ద్వితీయ శ్రేణి నేతల ఫిర్యాదు కాకినాడ రూరల్ టీడీపీ ఇన్చార్జిగా సత్తిబాబును తప్పించాలనే డిమాండ్ ఇటీవల తిరిగి తెర పైకి వచ్చింది. ఇది యాధృచ్ఛికం కాదని, భాస్కర రామారావు మృతి, రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కొత్తపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం నియామకం వంటి పరిణామాల నేపథ్యంలో సత్తిబాబును తప్పించాలనే డిమాండ్‌ను ఆయన వైరిపక్షం భుజాన వేసుకున్నట్టు కనిపిస్తోంది. చినరాజప్ప వంటి వారు బయట పడకుండా సత్తిబాబు సొంత సామాజికవర్గ నేతలను ఇందుకు ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంత కాలం ఇన్చార్జి విషయంలో పెదవి విప్పని ద్వితీయ శ్రేణి నేతలు ఎకాఎకిన పార్టీ అధినేత చంద్రబాబునే కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సత్తిబాబును మార్చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండుతో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, ఆమె భర్త చలపతి, నాయకులు సీతయ్యదొర, విత్తనాల గోపాల్ తదితర పాతిక మంది ఇటీవల చంద్రబాబును కలిశారు. సత్తిబాబును ఇన్చార్జిగా కొనసాగిస్తే నియోజకవర్గంలో కొద్దోగొప్పో ఉన్న ఓటు బ్యాంక్ కూడా అడ్రస్ లేకుండా పోతుందంటూ ఫిర్యాదు చేశారని అంటున్నారు. పాతిక పేజీలతో కూడిన ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబుకు అందజేయడం వెనుక ఆ వర్గం ప్రమేయం ఉందని చెబుతున్నారు. భాస్కర రామారావు వంటి బలమైన నాయకుడు లేరనే ధైర్యంతోనే తమపై బురద చల్లి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సత్తిబాబు వర్గం పేర్కొంటోంది. రూరల్ నియోజకవర్గ టీడీపీలో బలమైన బీసీ సామాజికవర్గం ఆధిపత్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాజప్ప వర్గం ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందోనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: Andhra Pradesh: పోలవరం.. శరవేగం మూడు రాష్ట్రాలకు మణిహారం -
మాజీ ఎమ్మెల్యే తనయుడికి రెండో వివాహ యత్నం
-
ఎమ్మెల్యే కుటుంబానికి 1+1, 1+2 ఆఫర్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బోగస్ ఓట్లు తొలగించాని కోరితే తప్పట! ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉండడంపై ఫిర్యాదు చేస్తే నేరమట! ఓట్ల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేయాలని ఫారం–7పై దరఖాస్తు చేస్తే అదేదో అడ్డగోలుతనమట! ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల ముసుగులో ప్రజల డేటాను చోరీ చేసి, తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడిలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలివి. అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించడంలో సిద్ధహస్తుడైన ఆయనకు ఫారం–7 ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశమని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. తానేది చెబితే అదే నిజం.. తాను చెప్పిందే వాస్తవం అన్నట్టుగా ప్రజల డేటా చోరీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు వితండవాదం చేస్తున్నారు. ఇంత అడ్డంగా బుకాయిస్తున్న ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై, ముఖ్యంగా తన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంలోనివారికి రెండేసి మూడేసి ఓట్లు ఉండడంపై ఏమంటారో చూడాలి. ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న తపనతో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం ఇవేవీ వర్తించవా అనిపిస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబం మొత్తం దొంగ ఓట్లకు చిరునామాగా మారిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ రూరల్‌తో పాటు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ఓట్లు నమోదై ఉన్నాయి. అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు నుంచి మూడు ఓట్లు ఉండడం విచిత్రం. ఆమె కుటుంబానికి వివిధచోట్ల ఉన్న ఓట్ల వివరాలివీ.. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి (రెండు ఓట్లు) : పెద్దాపురం నియోజకవర్గంలోని ఈమె స్వగ్రామమైన మాధవపట్నం బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 2456226 పేరిట ఎమ్మెల్యే అనంతలక్ష్మికి ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ పరిధిలోని బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 2075331పై మరో ఓటు ఉంది. ఎమ్మెల్యే భర్త సత్యనారాయణమూర్తి (మూడు ఓట్లు) : ఈయనకు కాకినాడ రూరల్ బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 2078319లో ఒక ఓటు ఉంది. అలాగే, కాకినాడ రూరల్‌లోని బూత్ నంబర్ 106లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 1724087పై మరో ఓటు ఉంది. అలాగే, పెద్దాపురం నియోజకవర్గంలోని మాధవపట్నంలో బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519155పై ఇంకో ఓటు ఉంది. పిల్లి కృష్ణప్రసాద్ (ఎమ్మెల్యే మొదటి కుమారుడు) (రెండు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలోని బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519410పై ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068310పై మరో ఓటు ఉంది. పిల్లి కృష్ణకళ్యాణ్ (ఎమ్మెల్యే రెండో కుమారుడు) (మూడు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లోని ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182708పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068211పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నంబర్ 46, ఓటర్ నంబర్ ఐఎంజడ్ 1493402లో మూడో ఓటు ఉన్నాయి. పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడో కుమారుడు) (3 ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182757పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2067205పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 46లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 1493550పై మరొకటి ఓట్లు ఉన్నాయి. ఈ ఒక్క ఎమ్మెల్యే కుటుంబంలోని సభ్యులకే రెండేసి మూడేసి ఓట్లు ఉన్నాయంటే మిగతాచోట్ల, మిగతావారికి ఇంకెన్ని ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఓట్లను తొలగించాలని ఫారం–7పై అభ్యర్థన చేస్తే నేరమని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఇలాంటివి తొలగించడం కోసమే ఫారం–7 అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగి, ఫారం–7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, తీసుకుంటామని బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సమంజసమో మరి! -
ఆవిడ బొమ్మెల్యే!. ఆయనే ఎమ్మెల్యే!!
పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని సామెత.. అచ్చం అలాగే ఉంది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పరిస్థితి. ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి నామమాత్రంగా అధి కారం చలాయిస్తుండగా ఆమె భర్త సత్యనారాయణమూర్తి ఉరఫ్ సత్తిబాబు పెత్తనానికి కేరాఫ్ అయ్యారు. అన్ని వ్యవహారా లు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నా యి. అధికారులు కూడా ఆయన కొమ్ము కాస్తున్నారు. ఏ అధికార పదవీ లేని ఆయన పేరు, ఫొటోతో ఏకంగా శిలాఫలకాలే వేయిస్తున్నారు. మంది సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సత్తిబాబు ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తుంటే.. ఎప్పటికీ పనులు పూర్తికాని శిలాఫలకాలు అధికార దుర్వినియోగానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో ఒకే నివాస గృహం ఉన్న ఏరియాలో రూ. 8లక్షలతో వేసిన రోడ్డు కోసం నిర్మించిన శిలాఫలకమిది. శిలాఫలకంపై ఇద్దరు ఫొటోలు ఉన్నాయి. అందులో ఒకటి ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిది అయితే మరొకటి ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ( సత్తిబాబు)ది. ఈయనేమీ ప్రజాప్రతినిధి కాదు. ఎమ్మెల్యే భర్త కావడమే ఆయనకున్న అర్హత. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్మించిన శిలాఫలకాలపై వేసిన ఫొటోలు ఇప్పుడందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. అధికారులు ఎంత బరి తెగించేశారో అందరికీ అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పసుపు రంగుతో, ఫొటోలతో శిలాఫలకాలు వేయడం, దాంట్లో ప్రజాప్రతినిధి కాని ఎమ్మెల్యే భర్త ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలకు ముఖ్యంగా షాడో నేతలకు అధికారులు ఎంత దాసోహమై పోయారో... ఏ స్థాయిలో అడుగులకు మడుగులు ఒత్తుతున్నారో రూరల్ నియోజకవర్గంలో వేసిన శిలాఫలాకాలను చూస్తే స్పష్టమవుతుంది. ప్రజలు ఎన్నుకున్న మహిళా నేతల విషయంలో పురుషాధిక్యం పెత్తనం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. సర్పంచైనా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ సభ్యులు అయినా, ఎమ్మెల్యే అయినా భర్తల పెత్తనం, షాడోల అజమాయిషీ ఎక్కువగా ఉందనేది సర్వత్రా విన్నదే. కానీ, ఎమ్మెల్యే భర్త హోదాలో ఏకంగా శిలాఫలాకాలపై ప్రజాప్రతిని«ధి కాని పిల్లి సత్తిబాబు ఫొటోను ముద్రించడం చూస్తుంటే ఇక్కడ ఏ స్థాయిలో షాడో ఎమ్మెల్యేగా ఆయన దందా సాగిస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నది. ప్రతి దందాలోనూ ఆయన జోక్యం ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తగా తప్ప పిల్లి సత్తిబాబుకు మరే హోదా లేదు. కనీసం వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా, కార్పొరేటర్‌గా కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కానీ, అధికారులంతా ఆయన కనుసైగల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పటికే సూపర్ ఎమ్మెల్యేగా అన్నింట్లోనూ తలదూర్చుతున్నారు. ఎమ్మెల్యేను వెనక ఉంచి అంతా తానై వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి దందాలోనూ సత్తిబాబు జోక్యం ఉంటున్నది. అడ్డగోలు వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏ ఒక్క అధికారి నియోజకవర్గానికి వచ్చినా తొలుత ఆయనను కలవాల్సిందే. ఆయనకు చెప్పే నియోజకవర్గంలోకి రావాలి. అంతకన్న ముందు నియోజకవర్గంలో పనిచేయాలనుకుంటే సత్తిబాబు అనుమతి తీసుకోవాలి. ఆ స్థాయిలో నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. అయితే ఇదంతా అనధికారికంగానే జరుగుతోంది. కానీ అధికారులు పిల్లి సత్తిబాబుకు మాత్రం అధికారిక హోదా కట్టబెడుతున్నారు. ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ అత్యుత్సాహంతోనో.... సత్తిబాబు ఆదేశాలతోనూ తెలియదు గాని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలాకాల్లో ఏకంగా ఫొటో పెడుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు సత్తిబాబు ఫొటోను వేసి శిలాఫలకాలను నిర్మిస్తున్నారు. పదవి లేని సత్తిబాబు ఫొటో వేయడం సరికాదని ఇంతవరకు ఏ ఒక్క అధికారీ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవు. చెప్పాలంటే మెప్పు కోసం ప్రభుత్వ ధనంతో ఇష్టారీతిన శిలాఫలాకాలు వేసేస్తున్నారు. లక్షలాది రూపాయలు శిలాఫలాకాల కోసమే ఖర్చు పెడుతున్నారు. నియోజకవర్గ మొత్తం మీద 2,500 నుంచి 3,000 వరకు ఈ రకంగా శిలాఫలాకాలు వేసినట్టుగా తెలుస్తోంది. ఏ పదవీ లేకుండా తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ శిలాఫలాకాలు చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉంటే చాలు...పదవి లేకపోయినా శిలాఫలకాలపై ఫొటోలు వేసుకోవచ్చనే పరిస్థితి వచ్చేసిందని గుసగుసలాడుకుంటున్నారు. షాడో నేతగా పిల్లి సత్తిబాబు పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్న ఆధారం ఇంకేమి కావాలని జనం బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే శంకుస్థాపనలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా పనులకు మోక్షం కలగడం లేదు. శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపడం లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో అంగన్వాడీ సెంటర్ నుంచి లోపలికి ఉన్న ఇళ్ల కోసం రూ.10 లక్షలతో రోడ్డు నిర్మించేందుకు గతేడాది అక్టోబర్‌లో వేసిన శిలాఫలకమిది. ఇంతవరకు రోడ్డైతే వేయలేదు గాని అనంతలక్ష్మి దంపతులతో అట్టహాసంగా నిర్మించిన శిలాఫలకం మాత్రం అటుగా వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది. -
అల్లి ‘పిల్లి’ ఆర్భాటం దేనికీ...
అది టీడీపీ జిల్లా కార్యాలయం... సమయం: శుక్రవారం ఉదయం 11 గంటలు లైట్‌గా చినుకులు పడుతున్నాయ్... ఏపీ 5DA నంబర్‌తో తెలుగురంగు స్కార్పియో వాహనం ఎమ్మెల్యే కాకినాడ రూరల్ అనే స్టిక్కర్‌తో దూసుకొచ్చింది. అంతా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వచ్చారనుకున్నారు.. తీరా డోర్ తెరిచి వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో ఆమె భర్త పిల్లి సత్తిబాబు దిగారు. వెంటనే ఆయనకు పక్కన ఉన్న గన్‌మెన్ గొడుగు పట్టాడు. ఇది చూసినవారంతా ‘ఓర్ని...ఎమ్మెల్యే ‘పతి’ గారు ఏం బిల్డప్ ఇచ్చార్రా బాబూ! అని ఆశ్చర్యపోయారు. ఆలిది అధికారం... పెనిమిటి పెత్తంన అనే మాట కాకినాడ రూరల్ మండలంలో విస్తృతంగా వినిపిస్తున్నా... ఎమ్మెల్యే భర్త హడావుడి ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే అయిన భార్యను ఇంటికి పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.