కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): మార్ఫింగ్ ఫోటోలతో కాకినాడ రూరల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన చేస్తున్న దుష్ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు.
నాలుగు నెలల కిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని కన్నబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నబాబు ఫిర్యాదుతో సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.
జనసేన కార్యకర్తలు కన్నబాబుపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులు..
Comments
Please login to add a commentAdd a comment