మిడ్‌నైట్ బఫే
బిజీ నగర జీవనంలో నైట్ లైఫూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రాత్రి సంచారుల కోసం ఫుడ్ కోర్టులూ వెలుస్తున్నాయి. వారి అభి‘రుచి’కి తగ్గట్టుగా నయా మెనూలతో ఆకర్షిస్తున్నాయి. తాజాగా అమీర్‌పేట హోటల్ ఆదిత్య పార్క్ ‘మిడ్‌నైట్ బఫే’ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 10 నుంచి రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మీరూ ఇక్కడి రుచులను ఆస్వాదించవచ్చు. రెండు రకాల స్టాటర్స్, సూపు, మూడు రకాల బిర్యానీలు, హలీమ్, పాయా పోర్బా, మూడు రకాల ఓరియంటల్ రుచులు ఈ బఫేలో ఉంటాయి. వీటితోపాటు పాస్తా, అప్పం వంటివి వేడివేడిగా ఆరగించడానికి లైవ్ కౌంటర్లున్నాయి. చైనీస్ వింగ్‌లెట్, హైదరాబాద్ కబాబ్, రోస్ట్ ఎగ్ మసాలా, కబాబ్ రైస్, నిజామీ హండీ వంటి వెరైటీలు ఇందులో ఉన్నాయని మాస్టర్ చెఫ్ వేణు నోరూరిస్తున్నారు.
- సాక్షి, సిటీ ప్లస్