Telangana News: తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!
Sakshi News home page

తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!

Published Sat, Oct 7 2023 1:44 AM

- - Sakshi

వరంగల్‌: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు గురువారం ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూనావత్‌ వేణు కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఇంటి వద్ద ఖాళీగా ఎందుకు ఉండాలని తండ్రితో కలిసి సూర్యాపేటలో సెంట్రింగ్‌ కూలీ పనులకు వెళ్లాడు.

2 నెలల క్రితం పనులు ముగించుకొని తండ్రితో కలిసి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాల్లో వేణు ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కుమారుడు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపిక అయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు భద్రు, కేవూల్య కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు బతికుంటే తమను సాకేవాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement