వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా వేణు
సూర్యాపేటమున్సిపాలిటీ : వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కోదాడ నియోజకవర్గం మోతె మండలానికి చెందిన పచ్చిపాల వేణుయాదవ్‌ను ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ ఆదివారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చిపాల వేణు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, నియామకానికి సహకరించిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యు న్నతి కోసం శక్తి వంచన లేకుం డాకృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.