నాగోలు, న్యూస్‌లైన్: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటనలో నిందితులను హయత్‌నగర్ పోలీసులు శనివారం అ రెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పథకం ప్రకారమే ఆమెను శ్రీశైలం తీసుకెళ్లి అడవిలో హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ రవి వర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనంద భాస్కర్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.
నల్లగొండజిల్లాకు చెం దిన పంగాల వేణు(22), బాలం మధు (22), కాసా ని శ్రీను (23), అనంతుల కాటమయ్య (25), నీలం కార్తీక్‌కుమార్ (22)లు మన్సూరాబాద్‌లో నివాసముంటూ లారీడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురూ ముఠా క ట్టి పార్కింగ్ చేసిన లారీలను ఎత్తుకెళ్లి.. విడిభాగాలుగా చేసి విక్రయించేవారు. ఈ క్రమంలోనే గతంలో మధు, వేణులు అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు.
నల్లగొండజిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లికి చెందిన రమావత్ అను (30) భర్తతో గొడవ జరగడంతో బీఎన్‌రెడ్డినగర్ సమీపంలో హాస్టల్‌లో ఉంటూ కంప్యూటర్ కోర్సు చదువుతోంది. వేణుతో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వేణు వె ంట తిప్పుకున్నాడు. గర్భందాల్చిన అను తనను పెళ్లి చేసుకోవాలని వేణుపై ఒత్తిడి తెచ్చింది. వేణుకు తన స్వగ్రామమైన చందంపేట మండలం గన్నెర్లపల్లిలో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఎలాగైనా అనును అడ్డు తొ లగించుకోవాలనుకున్నాడు.
తన స్నేహితులైన మధు, శ్రీను, కాటమయ్యకు తన పథకం చెప్పాడు. 2011 జూన్ 16న శ్రీశైలంలో వివాహం చేసుకుందామని వేణు.. అనును నమ్మించి తన స్నేహితులను వెంటబెట్టుకొని తీసుకెళ్లాడు. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లాక కర్నూలుజిల్లా పాణ్యం పోలీస్‌స్టేషన్ పరిధిలో వేణు, మధు, కార్తీక్‌లు కలిసి అను ముఖానికి చున్నీతో బిగించి ఊ పిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మధు బండరాయితో అను ముఖంపై మోదాడు. తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేశారు.
పాతనేరస్తుల విచరణలో వెలుగులోకి...
దొంగతనాల కేసుల్లో పాతనేరస్తులపై నిఘా పెట్టిన హయత్‌నగర్ పోలీసులు లారీల చోరీలకు పాల్పడుతున్న వేణు, మధు, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరికి సహకరించిన శ్రీను, కాటమయ్యలను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు గురైన అను తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యంపై ఎక్కడా కేసు పెట్టకపోవడం వల్లే కేసు విచారణ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్, సత్యనారాయణరాజు, మురళీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పథకం ప్రకారమే...
Published Sun, Oct 20 2013 4:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement