
సచ్చింది..’లో కామెడీ చేస్తా
బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ వెండితెరపైనా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, ‘జబర్దస్త్’ రాకేష్, శివారెడ్డి, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో శ్రీధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటేతో కలిసి సోహామ్ రాక్‌స్టార్ ఎంటర్ టైన్మెంట్– ఎంటర్‌టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
శ్రీధర్‌రెడ్డి యార్వ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ జోనర్‌లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నా. అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘హీరో–హీరోయిన్ అని కాకుండా కేవలం కథే హీరోగా నడిచే చిత్రమిది. ఇందులోని తెలంగాణ సాంస్కృతిక గీతం ఒగ్గు కథ నన్ను ఆకట్టుకుంది. సినిమాటిక్‌గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ ట్రై చేస్తున్నా. ఈసారి అందర్నీ నవ్విస్తా’’ అన్నారు అనసూయ. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌కుమార్.