చీపురు పట్టిన నాగార్జున | Nagarjuna unveils website to promote 'Swachh Bharat' | Sakshi
Sakshi News home page

చీపురు పట్టిన నాగార్జున

Published Sun, Oct 26 2014 4:30 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

చీపురు పట్టిన నాగార్జున - Sakshi

చీపురు పట్టిన నాగార్జున

హైదరాబాద్: 'స్వచ్ఛ భారత్' కోసం హీరో అక్కినేని నాగార్జున చీపురు పట్టారు. పరిసరాలను శుభ్రం చేసేందుకు ఆయన నడుం బిగించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అమల, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, నాగసుశీలతో కలిసి అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నాగార్జున చెత్తాచెదారాన్ని ఉడ్చారు. చాముండేశ్వరినాథ్ కూడా చీపుపట్టారు.

'స్వచ్ఛ భారత్' లో పాల్గొనాలని రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ.. టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే చీపురు పట్టడంలోనే సరిపెట్టకుండా 'స్వచ్ఛ భారత్' లో ప్రజలను చైతన్య పరిచేందుకు, ఎక్కువమందిని ఇందులో భాగస్వాములు చేసేందుకు నాగార్జున వెబ్సైట్ కూడా ప్రారంభించారు. నాగ్ ఫర్ స్వచ్ఛ భారత్ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. పరిసరాల శుభ్రతకు నిరంతరం పాటు పడతామని ఈ సందర్భంగా నాగార్జున ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement