ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య | Lovers commits suicide in Guntur district | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

Published Thu, Jan 7 2016 9:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

Lovers commits suicide in Guntur district

పిడుగురాళ్ల(గుంటూరు): ప్రేమించుకుంటున్న యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన షేక్ మౌలాలి (24), ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమల(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం మౌలాలి బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు.

ఇతను ఓ ప్రై వేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మౌలాలికి ఇటీవలే వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన అమల పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement