సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల | oru kanavu pola film is released in the month of September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల

Aug 12 2017 1:43 AM | Updated on Sep 17 2017 5:25 PM

సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల

సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల

ఒరు కనవు పోల చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.

తమిళసినిమా: ఒరు కనవు పోల చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇరైవన్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై సీ.సెల్వకుమార్‌ నిర్మించిన చిత్రం ఒరు కనవు పోల. రామకృష్ణన్, సౌందర్‌రాజా కథానాయకులుగా నటించిన ఇందులో అమల అనే నూతన నటి కథానాయకిగా నటించింది.

ఇతర ముఖ్య పాత్రల్లో అరుళ్‌దాస్, చార్లీ,మియిల్‌సామి, వెట్ట్రివేల్‌రాజా, కవి పెరియతంబి, విన్నర్‌ రామచంద్రన్, శ్రీలత, బాలాంభిక తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.కాగా ఒక ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు మధుపాల్‌ నటించారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత అన్నది గమనార్హం. ఎన్‌.అళగప్పన్‌ ఛాయాగ్రహణను, ఇఎస్‌.రామ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి కథ,కథనం, దర్శకత్వం బాధ్యతలను వీసీ.విజయశంకర్‌ నిర్వహించారు.

చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మంచి కథా బలం,వైవిధ్యభరిత కథనాలతో కూడిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ బాహుబలి 2, విక్రమ్‌వేదా, మీసైమురుక్కు లాంటి చిత్రాలని పేర్కొన్నారు. ఆ వరుసలో విభిన్న కథనంతో తెరకెక్కించిన చిత్రం ఒరు కనవు పోల అని అన్నారు. ఈతరం యువత స్నేహం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఒరు కనవు బోల చిత్రం ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్‌ నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement