ప్రతి రైతును రక్షించాలి
ప్రతి రైతు రక్షించబడాలని నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ పేర్కొన్నారు. ఇరైవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఒరు కణవు పోల. రామకృష్ణన్, సౌందర్‌రాజన్ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో నూతన నటి అమల కథానాయికిగా పరిచయం అవుతున్నారు. విజయ్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విశాల్ మాట్లాడుతూ తాను ఇప్పుడు ఒక నటుడిగానో, నడిగర్‌సంఘం కార్యదర్శిగానో మాట్లాడడం లేదని, ఇక మనిషిగా మాట్లాడుతున్నానని అన్నారు.
రక్షించబడాల్సిన రైతు ఇప్పుడు కృంగిపోతున్నాడన్నారు. అలా కాకుండా ప్రతి రైతూ రక్షించబడాలని, అందుకు తమతో పాటు, న డిగర్‌సంఘం, నిర్మాతలమండలి, ఫెఫ్సీ ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాల వారు సిద్ధమవుతున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని విశాల్ తెలిపారు.మరో అతిథిఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి మాట్లాడుతూ ఇక్కడ చిన్న చిత్రం,పెద్ద చిత్రం అన్ని భేదం లేదన్నారు.నిజం చెప్పాలంటే ఇటీవల చిన్న చిత్రాలే అధికంగా విజయం సాధిస్తున్నాయన్నారు.
అదే విధంగా రామకృష్ణన్, సౌందర్‌రాజన్ కథానాయకులుగా నటించిన ఒరు కణవు పోల చిత్రం మంచి విజయం సాధించాలన్నారు.అప్పుడే ఈ చిత్రానికి పని చేసిన వారు విజయాన్ని పొందుతారని అన్నారు. దర్శకుడు పేరరసు, నటి రోహిణి, అశోక్, ఎస్‌ఆర్.ప్రభాకరన్, పొన్‌రాం పాల్గొన్నారు. చిత్ర నిర్మాత రైతుల సంరక్షణ కోసం నటుడు విశాల్ ఈ సందర్భంగా రూ.25 వేలను చెక్కు రూపంలో అందించారు.