saundarrajan
-
ప్రతి రైతును రక్షించాలి
ప్రతి రైతు రక్షించబడాలని నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ పేర్కొన్నారు. ఇరైవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఒరు కణవు పోల. రామకృష్ణన్, సౌందర్‌రాజన్ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో నూతన నటి అమల కథానాయికిగా పరిచయం అవుతున్నారు. విజయ్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విశాల్ మాట్లాడుతూ తాను ఇప్పుడు ఒక నటుడిగానో, నడిగర్‌సంఘం కార్యదర్శిగానో మాట్లాడడం లేదని, ఇక మనిషిగా మాట్లాడుతున్నానని అన్నారు. రక్షించబడాల్సిన రైతు ఇప్పుడు కృంగిపోతున్నాడన్నారు. అలా కాకుండా ప్రతి రైతూ రక్షించబడాలని, అందుకు తమతో పాటు, న డిగర్సంఘం, నిర్మాతలమండలి, ఫెఫ్సీ ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాల వారు సిద్ధమవుతున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని విశాల్ తెలిపారు.మరో అతిథిఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ ఇక్కడ చిన్న చిత్రం,పెద్ద చిత్రం అన్ని భేదం లేదన్నారు.నిజం చెప్పాలంటే ఇటీవల చిన్న చిత్రాలే అధికంగా విజయం సాధిస్తున్నాయన్నారు. అదే విధంగా రామకృష్ణన్, సౌందర్‌రాజన్ కథానాయకులుగా నటించిన ఒరు కణవు పోల చిత్రం మంచి విజయం సాధించాలన్నారు.అప్పుడే ఈ చిత్రానికి పని చేసిన వారు విజయాన్ని పొందుతారని అన్నారు. దర్శకుడు పేరరసు, నటి రోహిణి, అశోక్, ఎస్ఆర్.ప్రభాకరన్, పొన్రాం పాల్గొన్నారు. చిత్ర నిర్మాత రైతుల సంరక్షణ కోసం నటుడు విశాల్ ఈ సందర్భంగా రూ.25 వేలను చెక్కు రూపంలో అందించారు. -
వేద సంరక్షణ
మానవజాతికి వేదాలు వెలలేని నిధి. అవి మానవజాతి కర్తవ్య పాలనను మాత్రమే కాదు మోక్షసాధన మార్గాలను కూడా సూచించాయి. ఈనాటికీ మానవజాతికి సకల విధాల ఉపయోగపడగల వేదాలను సంరక్షించడం మన కర్తవ్యం, బాధ్యత. నిరంతర శిక్షణ, సాధన, బోధనవంటి మార్గాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకప్పుడు వేదాలు గురుకులాల్లో బోధించేవారు. నేర్చుకునేవారి లోనూ, నేర్పేవారిలోనూ కూడా అంకితభావం ఉం డేది. అక్కడ ఉండే గురుశిష్య సంబంధం అలాంటి అంకితభావాన్ని కలగజేసేది. ఈనాటికీ ఆ తరహా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ వారి సంఖ్య అరుదుగా ఉంటున్నది. చక్కని వేద విద్య అధ్యయనం చేసిన అధ్యాపకుల లేమి వలన వేద విద్యా విధానమే కుంటినడక నడుస్తున్నది. ఇది ఇలాగే మరికొంత కాలం కొనసాగితే మన వేదాలనూ, వాటి బోధనలనూ, సాధన లనూ మనం శాశ్వతంగా కోల్పోయే ప్రమా దం ఉన్నది. వేదాలను ఇలా చేజేతులా నాశనం చేసుకుంటే మానవజాతికి మిగి లేది వినాశనమే. దూరమైపోతున్న వేదాలను మనందరి దగ్గరకు చేర్చి, వాటిని సంరక్షించే మహత్తర కార్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో వేద పాఠశాలలు నెలకొల్పుతు న్నది. ముఖ్యంగా ధర్మగిరిలో వేద పాఠశాల ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో నిర్మించారు. అక్కడ 650మంది విద్యార్థులతో, 20 మంది అధ్యాప కులతో వేద విద్యాబోధన చక్కగా సాగుతున్నది. నాలుగు వేదాలు, వేదాంగాలు, ఆగమాలు బోధిస్తు న్నారు. ఇది దేశంలోనే పెద్ద పాఠశాల. బహుశా మొదటి స్థానంలోనో, రెండో స్థానంలోనో ఉంటుంది. వేద పాఠశాలల అభివృద్ధికి భవిష్య త్తులో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ధార్మిక విధివిధానాలు, ప్రస్తుత సాధనా విధానాలు, వేదాల సంరక్షణకు తీసుకునే చర్యల్లో ఏర్పడే అడ్డంకులు, వాటిని అధిగమించే మార్గాలు వగైరా అంశాలను ఈ కమిటీ పరిశీలించింది. మన రాష్ట్రంలోనూ, పొరుగునున్న కర్ణాటకలోనూ సమర్థవంతంగా నడుస్తున్న శృంగేరీ వేదపాఠశాల, శ్రీశ్రీ రవిశంకర్ గురుకులం, పరాశర గురుకులం, హైదరాబాద్ లోని వేద భవనం వగైరాలను ఈ కమిటీలో భాగస్వామిగా నేను కూడా పరిశీలించాను. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇ-లైబ్రరీ, దూరవిద్యవంటి పద్ధతుల ద్వారా వేద విద్యను వ్యాపింపజేయడానికి అవసరమైన మార్గా లను ఇండియా హెరిటేజ్ గ్రూపువారి సమావేశంలో చర్చించాము. అందులో అనేక విలువైన సూచనలు కూడా వచ్చాయి. వేదాధ్యయనంపై ఆసక్తి ఉన్నవారె వరైనా తాము ఉన్నచోటునుంచే ఇలాంటి మాధ్య మాల ద్వారా వేద విద్యను అధ్యయనం చేయవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కివచ్చి భారతీయ సంస్కృతి వైభవం మళ్లీ వెలుగులీనేలా చేయడానికి తోడ్పడితే అంతకన్నా కావలసిందేముంటుంది? టీటీడీ పాఠశాలల నుంచి వెలుపలకు వచ్చే విద్యార్థు లు అత్యున్నత మానవ విలువలను, మత పరమైన విలువలను పాటించి ధార్మిక మార్గంలో నడు స్తారు. ఈ పాఠశాలలు అందుకవసరమైన మార్గద ర్శకత్వాన్ని అందిస్తున్నాయి. దేశానికి చక్కటి వర్తమానాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందజేసే ఈ మహత్తర కార్యం విజయవంతం కావాలని కోరుకుందాం. - సౌందర్‌రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు -
భగవంతుడు కరుణామయుడు
ఆపదనుంచి కాపాడటమైనా, విజయాలు సమకూర్చడమైనా భగవంతుడు మనపట్ల మమకారంతో చేస్తాడు. ఆయన కరుణాకటాక్షాలు అటువంటివి. ఒకరోజు పొద్దుటే భక్తుడొకరు తలపై గాయంతో గుడికి వచ్చాడు. గాయం ఇంకా ఆరలేదు కాబోలు కట్టు నెత్తురోడుతూనే ఉంది. నా దగ్గరకొచ్చి ‘స్వామీ! ఆ దేవుడు నన్ను శిక్షించాడా?’ అని అడిగాడు. ‘లేదు. నీకు తగలవలసిన పెద్ద గాయాన్ని చిన్నది చేశాడు’ అని చెప్పాను. నా మాటలు బహుశా ఆయనకు సందేహ నివృత్తి చేయలేకపోయాయి. తర్వాత వచ్చాడు. ‘అయ్యా! సరిగ్గా మీరు చెప్పినట్టే జరిగింది’ అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగినదేమిటో, నేను చెప్పినదేమిటో మరిచిపోయాను. పెద్దవాడినయ్యాను కదా! అందుకే ‘ఏమి జరిగిందని?’ అడిగాను. ‘స్వామీ! నేను కారులో తిరిగి వెళ్తుండగా నా కారు టిప్పరును ఢీకొట్టింది. కారునుండి నేను పక్కకు పడిపోయాను. కారుకు జరిగిన నష్టం చూసిన వారెవరైనా డ్రైవర్ మరణించివుంటాడనే అనుకుంటారు. కానీ, నాకు చిన్న గాయం కూడా కాలేదు. ఈ ఘటన మైకులో చెప్పండి. నన్ను భగవంతుడే కాపాడాడు’ అని ఎంతో ఉద్వేగంతో అన్నాడు. భగవంతుడు మనిషి తలరాతను మార్చడు. కానీ, ఆయన కరుణాకటాక్షాలవలన దుర్ఘటన తీవ్రతను తగ్గించగలడు. ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. ప్రతివారూ తమ విజయం వెనక కోచింగు సెంటర్ల ప్రోద్బలం గురించి, తల్లిదండ్రుల ప్రోత్సాహం గురించి ఏకరువుపెట్టారే తప్ప భగవంతుని ఆశీర్వచనాల గురించి ఎవరూ చెప్పలేదు. మరుసటి రోజు చిలుకూరుకు వచ్చిన విద్యార్థిని తనకు మెడిసిన్‌లో 6వ ర్యాంకు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలిపింది. టీవీ ఇంటర్వ్యూలో భగవంతునికి ధన్యవాదాలు ఎందుకు చెప్పలేదని అడిగాను. ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. ‘చిలుకూరు బాలాజీ వలన ర్యాంకు వచ్చిందని చెప్పకున్నా కనీసం ఆ భగవంతుని ఆశీర్వాదంవల్ల విజయం సాధించానని చెప్పవలసింది’ అన్నాను. మన విజయాలకు అతనిని కర్తగా చేస్తే, మన అపజయాలను ఆయన భరిస్తాడు. ‘కర్మణ్యే వాధికారస్తే....’ సంవత్సరాంత పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఎందరెందరో విద్యార్థులు హాల్ టికెట్లు తెచ్చి, చిలుకూరు బాలాజీ ముందు పెట్టి తీసుకువెళ్తారు. అక్కడికి వచ్చే తల్లిదండ్రులకు మేము ఒకటే చెబుతాము.... ‘ఏ పరీక్ష అయినా జీవన్మరణ సమస్య కాదు. అందులో మార్కులు సాధించనివారికి బతుకులేదని కాదు. పరీక్షల గురించి పిల్లలను భయపెట్టవద్దు. అది వారి ఆలోచనాశక్తిని ఆటంకపరుస్తుంది’. అలాగే, పిల్లలకు కూడా నేను చెప్పేదొక్కటే.... ‘మీరు బాధ్యతాయుతంగా, శ్రద్ధగా చదవండి. చక్కగా పరీక్షలు రాయండి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి’ కృషి చేయడం మాత్రం మన కర్తవ్యం. ఫలితంపై మనకు హక్కు లేదు. మన కృషికి తగ్గ ఫలితం భగవంతుడు తప్పక ఇస్తాడు. - సౌందర్‌రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు