Madhupal
-
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్‌గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal) -
సెప్టెంబర్‌లో ఒరు కనవు పోల
తమిళసినిమా: ఒరు కనవు పోల చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇరైవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై సీ.సెల్వకుమార్ నిర్మించిన చిత్రం ఒరు కనవు పోల. రామకృష్ణన్, సౌందర్‌రాజా కథానాయకులుగా నటించిన ఇందులో అమల అనే నూతన నటి కథానాయకిగా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో అరుళ్దాస్, చార్లీ,మియిల్‌సామి, వెట్ట్రివేల్‌రాజా, కవి పెరియతంబి, విన్నర్ రామచంద్రన్, శ్రీలత, బాలాంభిక తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.కాగా ఒక ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు మధుపాల్ నటించారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత అన్నది గమనార్హం. ఎన్.అళగప్పన్ ఛాయాగ్రహణను, ఇఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి కథ,కథనం, దర్శకత్వం బాధ్యతలను వీసీ.విజయశంకర్ నిర్వహించారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ మంచి కథా బలం,వైవిధ్యభరిత కథనాలతో కూడిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ బాహుబలి 2, విక్రమ్‌వేదా, మీసైమురుక్కు లాంటి చిత్రాలని పేర్కొన్నారు. ఆ వరుసలో విభిన్న కథనంతో తెరకెక్కించిన చిత్రం ఒరు కనవు పోల అని అన్నారు. ఈతరం యువత స్నేహం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఒరు కనవు బోల చిత్రం ఉంటుందన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్ నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.