బుల్లితెరపై అమల | Amala to make her small screen debut | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై అమల

Published Tue, Jul 15 2014 12:40 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

బుల్లితెరపై అమల - Sakshi

బుల్లితెరపై అమల

 నాగార్జున తరువాత ఇప్పుడు ఆయన సతీమణి అమల వంతు వచ్చినట్లుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర వీక్షకులను నాగ్ ఆకట్టుకుంటూ ఉంటే, తాజాగా అమల ఓ టీవీ సీరియల్‌కు పచ్చ జెండా ఊపినట్లు కోడంబాకమ్ కబురు. తమిళంలో త్వరలో రానున్న ఓ టీవీ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. అందులో ఆమె ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల ఆ టీవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సదరు టీవీ సిరీస్ పేరు -‘ఉయిర్మే’.
 
  ‘‘ఇప్పటికే రకరకాల బాధ్యతల్లో తలమునకలుగా ఉంటున్నాను కాబట్టి, ఎంతో ప్రత్యేకమైన పాత్ర అయితే కానీ సినిమాలో అయినా, సీరియల్‌లో అయినా నటించడానికి ఒప్పుకోవట్లేదు. ఈ స్క్రిప్టు నాకు బాగా నచ్చడంతో, నో చెప్పలేకపోయా’’ అని అమల వ్యాఖ్యానించారు. మొత్తం 12 మంది డాక్టర్ల జీవితాలు, వారి కుటుంబాలు, రోగుల చుట్టూ నడిచే ఈ టీవీ షో ఆగస్టులో ప్రసారం ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement