కమల్, అమలల 'అమ్మ నాన్న ఆట' | kamal, amala movie title amma nana aata | Sakshi
Sakshi News home page

కమల్, అమలల 'అమ్మ నాన్న ఆట'

Published Sun, Nov 22 2015 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

కమల్, అమలల 'అమ్మ నాన్న ఆట'

కమల్, అమలల 'అమ్మ నాన్న ఆట'

కుర్ర హీరోలు కూడా ఆచితూచి సినిమాలు చేస్తుంటే లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. పాపనాశం, చీకటి రాజ్యం సినిమాలను గ్యాప్ లేకుండా రిలీజ్ చేసిన కమల్, ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో అమల లీడ్ రోల్లోనటించనుండటంతో సినిమా మీద మరింత క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం చీకటిరాజ్యం సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ వీలైనంత త్వరగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. చాలా కాలం క్రితం కమల్ హీరోగా చాణక్యన్ సినిమాను తెరకెక్కిన రాజీవ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అచ్చమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమ్మ నాన్న ఆట అనే టైటిల్ను నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement