నాగ్ సరసన | Pragya Jaiswal With Nag in Raghavender Rao Movie | Sakshi
Sakshi News home page

నాగ్ సరసన

Published Mon, Apr 25 2016 1:59 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ సరసన - Sakshi

నాగ్ సరసన

ధూపాటి హరిబాబు మనసు దోచుకున్న సీతగా ‘కంచె’లో ప్రేక్షకులను అలరించారు కథానాయిక ప్రగ్యా జైశ్వాల్. తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్  ఆఫర్ వరించిందని సమాచారం. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడి సాయి’ వంటి భక్తి రస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించిన కె. రాఘవేంద్రరావు మరోసారి అదే తరహాలో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను నాగార్జున చేయనున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా ఎంపికయ్యారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement