Pelli SandaD Team Visits Tirumala | Director Raghavender Rao - Sakshi
Sakshi News home page

పెళ్లి సందD చిత్రం బాగుంటుంది: రాఘవేంద్రరావు

Aug 9 2021 10:31 AM | Updated on Aug 9 2021 3:18 PM

Director Raghavendra Rao, Pelli SandaD Team Visits Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటి సుమలత, పెళ్లి సందడి చిత్ర యూనిట్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితోపాటు హీరో రోషన్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కర్ణాటక హీరో దర్శన్ కూడా ఉన్నారు. అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పెళ్లి సందడి చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయిందని తెలిపారు. చిత్రం చాలా బాగుంటుందని, శ్రీకాంత్ తనయుడితో మరోసారి పెళ్లి సందడి చిత్రం చేస్తున్నామన్నారు.

రెండు సంవత్సరాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని సీనియర్‌ నటి సుమలత అన్నారు. శ్రీవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పెళ్లి సందడి చిత్ర షూటింగ్ విజయవంతంగా ‌పూర్తి అయిందని హీరో రోషన్‌ అన్నారు. అందుకే స్వామివారి దర్శనం యూనిట్ సభ్యులు దర్శనం చేసుకున్నామన్నారు.పెళ్లి సందడి చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

కాగా నిన్న(ఆదివారం) స్వామివారిని 20,446 మంది భక్తులు సందర్శించుకోగా.. స్వామివారికి 8,610 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామివారి హుండీ ఆదాయం 2.50 కోట్లు  వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement