గోపిచంద్, నయన్‌ల 'బలం' | gopi chand, b gopal next movie title Balam | Sakshi
Sakshi News home page

గోపిచంద్, నయన్‌ల 'బలం'

Published Sat, Oct 15 2016 1:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

గోపిచంద్, నయన్‌ల 'బలం'

గోపిచంద్, నయన్‌ల 'బలం'

కమర్షియల్ స్టార్‌ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గోపిచంద్, వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఏఎమ్ రత్నం నిర్మాతగా ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గోపి. యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఆక్సిజన్ సినిమాతో పాటు చాలా రోజులుగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు గోపిచంద్. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. నయనతార హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తయిన దశలో ఆగిపోయింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ప్యాచ్ వర్క్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ డిసెంబర్‌లో సినిమారు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు బలం అనే టైటిల్‌ను నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement