చెడుపై గెలుపు | Tamannaah joins the second schedule of Odela 2 | Sakshi
Sakshi News home page

చెడుపై గెలుపు

Published Sat, Apr 27 2024 1:04 AM | Last Updated on Sat, Apr 27 2024 1:04 AM

Tamannaah joins the second schedule of Odela 2

అహీరోయిన్‌ తమన్నా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఫేమ్‌ అశోక్‌ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రతి యుగంలో చెడుని ఎలా గెలుస్తాడో చూపించే కథాంశంతో ఈ మూవీ ఉంటుంది.

హైదరాబాద్‌ పరిసరప్రాంతాల్లో జరుపుతున్న రెండో షెడ్యూల్‌ 25 రోజుల పాటు సాగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌ సింహ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌ రాజన్‌ .ఎస్, క్రియేటెడ్‌ బై: సంపత్‌ నంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement