Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను.. | Tamannaah Bhatia Attended A Private Program In Hyderabad And Shared Many Things | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను..

Published Wed, Sep 4 2024 1:13 PM | Last Updated on Wed, Sep 4 2024 1:15 PM

Tamannaah Bhatia Attended A Private Program In Hyderabad And Shared Many Things

నగరంలో తళుక్కుమన్న ప్రముఖ సినీతార మిల్కీ బ్యూటీ..

మరి కొద్ది రోజుల్లో ఓదెల –2తో ప్రేక్షకుల ముందుకు

సాక్షి, సిటీబ్యూరో: మిల్కీ బ్యూటీ, ప్రముఖ సినీతార తమన్నా భాటియా మంగళవారం నగరంలో తళుక్కున మెరిశారు. నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై తమన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.. చాలా రోజుల తరువాత హైదరాబాద్‌ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఓదెల –2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నానని, ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, ఇక సినిమాకు సంబంధించి చిన్న పార్ట్‌ మాత్రమే పెండింగ్‌ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎప్పటి నుంచో తన పెళ్లి విషయమై ఊరిస్తున్న తమన్నా, ఈ సారి కూడా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.., ‘పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేనని’ దాటవేశారు. అయితే ఈ సందర్భంగా తమన్నా ప్రత్యేకంగా డిజైనింగ్‌ చేయించుకుని ధరించిన నీలి రంగు డ్రెస్‌ విశేషంగా ఆకట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement