
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసినా సైరా (సైరా నరసింహారెడ్డి) ఫీవర్ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ బిగ్గెస్ట్ మూవీ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్‌తోపాటు సైరా నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ‍్యంతో తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన . అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
మరోవైపు `సైరా` విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా `సైరా` అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
A gift for the super @tamannaahspeaks
from Mrs Producer 😉❤️🥳
Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd
— Upasana Konidela (@upasanakonidela) October 3, 2019
Comments
Please login to add a commentAdd a comment