
షూటింగ్‌లో తమన్నా, సందీప్ కిషన్
ఈ రేంజ్‌లో తింటుందీ అమ్మాయి. అయినా సరే... అంత స్లిమ్ముగా ఎలా ఉంటుందబ్బా?
ఈ రేంజ్‌లో తింటుందీ అమ్మాయి. అయినా సరే... అంత స్లిమ్ముగా ఎలా ఉంటుందబ్బా? – సందీప్ కిషన్ కొత్త సినిమా షూటింగులో తమన్నా తిండి చూసినోళ్లంతా ఇలానే అనుకుంటున్నారట! సందీప్, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్ కోహ్లి తీస్తున్న తెలుగు సినిమా షూటింగ్ మొన్నామధ్య వరకు లండన్‌లో జరిగింది.
షూటింగులో హీరో హీరోయిన్ల మధ్య ఫైటింగులు, బ్రేక్‌లో ఫన్నీ ప్రాంక్స్, ఫ్రీ టైమ్‌లో ఫుడ్డు... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశామని ఇండియాకి తిరిగొచ్చిన యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సిన్మా కావడంతో సరదాగా షూటింగ్ జరిగిందట! ఇంతకీ, తమన్నా అంత స్లిమ్ముగా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే.. ఫుడ్డు ఫుడ్డే, రిమ్ జిమ్ అంటూ జిమ్ములో వర్కౌట్లు వర్కౌట్లే. ఫుడ్డు కూడా న్యూట్రీషియనిస్ట్ చెప్పినట్లు తీసుకుంటున్నారట!