అలా నిర్ణయించడం కరెక్ట్‌ కాదు.. ఆ హీరో సినిమాపై తమన్నా కామెంట్స్! | Tamannaah Bhatia Hoits Backs John Abraham After Criticism About Film Vedaa, Deets Inside | Sakshi
Sakshi News home page

Tamannaah: 'ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'

Published Sun, Aug 4 2024 5:23 PM | Last Updated on Sun, Aug 4 2024 6:15 PM

Tamannaah Hoits backs John Abraham after criticism About film Vedaa

మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ తమన్నా. ఇటీవల స్ట్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఆజ్‌ కీ రాత్‌ అనే ఐటమ్‌ పాటలో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా తమన్నా వేదా చిత్రంలో నటిస్తోంది. జాన్‌ అబ్రహం హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ముంబయిలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు తమన్నా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఓ సంఘటన గురించి తమన్నా స్పందించారు. కేవలం పోస్టర్లు చూసి సినిమాపై ఓ అంచనాకు రావొద్దని ట్వీట్‌ చేశారు. 

తమన్నా తన ట్వీట్‌లో రాస్తూ..'కేవలం ట్రైలర్‌, పోస్టర్స్‌ చూసి వేదా సినిమాను అంచనా వేయకండి. నేను చెప్పేది కాస్తా వినండి. ఇది యాక్షన్‌ ఫిల్మ్‌కు మించి ఉంటుంది. మన దేశంలో గొప్ప యాక్షన్‌ హీరోల్లో జాన్‌ అబ్రహం ఒకరు. అతడు ఈ జానర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ సినిమాలో యాక్షన్‌ నేపథ్యంతో పాటు భిన్నమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే, దర్శకుడు నిఖిల్‌ దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు. శార్వరీ నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ చిత్రాలకు ఈ సినిమా సరికొత్త నిర్వచనంగా నిలుస్తుంది. జాన్, నిఖిల్ సర్, శర్వరి, అభిషేక్ బెనర్జీతో నటిస్తుందుకు చాలా సంతోషంగా ఉంది' పోస్ట్ చేశారు.

అయితే 'వేద' ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌లో జాన్ అబ్రహం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ సినీ జర్నలిస్ట్ మీరెప్పుడు యాక్షన్ చిత్రాలే చేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో మీరు సినిమా చూశారా? అంటూ అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నకు మిమ్మల్ని మూర్ఖులు అని పిలవొచ్చా? అని అబ్రహం మండిపడ్డారు. కాగా.. నిఖిల్ నిక్కిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో అభిషేక్ బెనర్జీ విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, మౌని రాయ్ కూడా అతిథి పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement