డాక్టర్‌ తమన్నా | Milk Beauty Tamanna received a Doctorate at the event in Ahmedabad. | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ తమన్నా

Published Mon, Jul 24 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

డాక్టర్‌ తమన్నా

డాక్టర్‌ తమన్నా

తమన్నా డాక్టర్‌ అయ్యారు. అంటే.. యాక్టర్‌గా రిటైర్‌ అయ్యారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. తమన్నా రియల్‌ డాక్టర్‌ కాదు. సినిమా రంగంలో కష్టపడి పైకి రావడం, మంచి పేరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ, గుజరాత్‌కు చెందిన ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ కమిషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్‌ అందుకున్నారు.

‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు ‘హ్యాపీడేస్‌’తో మంచి బ్రేక్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్నారు. దాదాపు పదేళ్ల కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. దక్షిణాది సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్‌కిగాను గౌరవ డాక్టరేట్‌ దక్కిందామెకు. ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనీ, తన బాధ్యతను మరింత  పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని ‘డాక్టర్‌ తమన్నా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement